Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 11th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషాని బోల్తా కొట్టించిన లక్ష్మీ.. గిల్ట్ లేదు.. బాధ లేదు.. ఫుల్ పార్టీ మూడే!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్రకు పార్టీకి ఒప్పించిన మనీషా మిత్ర సంతోషంగా ఉండటం చూసి తన ఫ్రెండ్స్‌ని పిలిచి అల్లరి చేయమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా మిత్ర దగ్గరకు వచ్చి పెళ్లి రోజు వేడుకలు జరుపుకోమని చెప్తుంది. నాకు వద్దని నేను బయటకు రాను అని మిత్ర చెప్తాడు. జరిగిన విషయం నీకు నాకు లక్ష్మీకి తప్ప ఎవరికీ తెలీదు ఫంక్షన్ చేసుకోకపోతే అందరికీ తెలిసిపోతుందని మనీషా మిత్రకు ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. నా వల్ల కావడం లేదని మిత్ర ఏడుస్తాడు.
మనీషా: జరిగిన తప్పు మన ఇద్దరి మనసుల్ని గాయపరిచింది మిత్ర. ఏం చేస్తే ఆ గాయం పోతుందో ఆలోచించాలి మిత్ర. నాలుగు గోడల మధ్య జరిగిన దాన్ని నలుగురు మాట్లాడుకునేలా చేసి నా పరువు తీయకు మిత్ర. చేతులు జోడించి దండం పెడుతున్నా. ఈ రోజు నన్ను తీసుకొని ఎలా వచ్చావో ఈవినింగ్ ఫంక్షన్‌కి అలాగే రా. రాక పోతే నా మీద ఒట్టు.
మిత్ర: ఒకే మనీషా నీ కోసం వస్తా.
మనీషా: నా కోసం కాదు మిత్ర లక్ష్మీ కోసం రావాలి. థ్యాంక్యూ సో మచ్. లక్ష్మీ దగ్గరకి వెళ్లి రెడీ అవుతున్నావా లక్ష్మీ ఇన్నాళ్లు నీది పై చేయి ప్రతీ సారి నేను ఓడిపోయే దాన్ని. కానీ ఈ సారి నాది పై చేయి అయింది. ఓడిపోవడం నీ వంతు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఫంక్షన్ నేను చెప్పడం వల్ల అవుతుంది. నేను చెప్పాను కాబట్టి మిత్ర విన్నాడు.
లక్ష్మీ: నువ్వేదో తెలివైన దానివి అనుకున్నా ఇంత దద్దమ్మ అనుకోలేదు. నువ్వు మిత్ర ఒప్పించుకోలేదు నీతోనే ఒప్పించేలా నేను చేశాను. నువ్వు మిత్రతో మాట్లాడటానికి చిన్నత్తయ్య కారణమే కానీ ఆవిడతో ఆ మాటని చెప్పించింది నేను. ఇప్పుడు అర్థమైందా నువ్వు తెలివి తక్కువ దద్దమ్మ అని ఎందుకు అన్నానో. ఇప్పుడు ఆయన వస్తారు. ఫంక్షన్ గ్రాండ్‌గా జరుగుతుంది. నువ్వు ఓ మూల కూర్చొని ఏడుస్తూ ఉండు.
మనీషా దేవయానికి ఫుల్ కోటింగ్ ఇస్తుంది. ఈ ఫంక్షన్ ఎలా అయినా ఆగిపోవాలని అంటుంది. ఇక పిల్లలు ఫంక్షన్‌కి యాంకరింగ్ చేస్తారు. మిత్ర చేతిలో లక్ష్మీ చేయి పట్టుకొని కిందకి వస్తుంది. దేవయాని లక్ష్మీని చూసి ఇది మామూలుది కాదు నన్ను మెల్ట్ చేసి నాతోనే మనీషాకి ఫంక్షన్ గురించి చెప్పేలా చేసిందని అనుకుంటుంది. పిల్లలు ఇద్దరినీ ప్రశ్నలు అడిగితే లక్ష్మీ నవ్వుతూ చకచకా సమాధానాలు చెప్తుంది. మిత్ర సైలెంట్‌గా ఉంటే జున్ను మిత్ర నందన్ గారు చెప్పండి అంటాడు. ముందు లక్ష్మీని పెళ్లి చేసుకొని తర్వాత ప్రేమించాను అని మిత్ర అంటాడు. మిత్రని పిల్లలు నవ్వించేశారు లక్ష్మీ గెలిచేసిందని దేవయాని మనీషాతో అంటుంది. దాంతో మనీషా అంజలికి కాల్ చేసి మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని మిత్ర ఇంటికి రమ్మని చెప్తుంది. పిల్లల వల్ల మిత్ర మామూలు మనిషి అయిపోతాడు. గిల్ట్ మొత్తం మర్చిపోతాడు.
అందరూ డ్యాన్స్‌లు వేస్తారు. మొదటగా జున్ను, లక్కీ డ్యాన్స్ చేస్తారు. తర్వాత వివేక్ జానులు గువ్వా గోరింకతో అంటూ అదర గొడతారు. చివరగా మిత్ర, లక్ష్మీలు ఒకరిని పట్టుకొని ఒకరు డ్యాన్స్ చేస్తూ మిత్రని లక్ష్మీ హగ్ చేసుకుంటుంది. ఇక నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి అంటూ బామ్మ దేవయానిని పట్టుకొని గెంతుతుంది. తర్వాత కేక్ కటింగ్ అవుతుంది. మిత్ర లక్ష్మీకి తినిపించే టైంకి సూపర్ మిత్ర అని మిత్ర ఫ్రెండ్స్ ఎంట్రీ ఇస్తారు. మిత్ర షాక్ అయిపోతాడు. మిత్ర నువ్వు మంచి ఫ్రెండ్ అనుకుంటే ఇంత పెద్ద యాక్టర్ అనుకోలేదు అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: పోస్టర్ చిచ్చు.. జడ్జి పరువు తీసేసిన ఫోన్ కాల్స్.. దేవాకి పురుషోత్తం సలహా!





















