Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today December 20th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: విభజించి పాలించనున్న కొత్త మనీషా.. దగ్గరైన లక్ష్మీ, మిత్రలు చూడముచ్చటగా ఫ్యామిలీ!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషా మిత్ర ఫ్యామిలీలో అందరినీ విడదీసి తన పగ తీర్చుకోవాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా కుట్రని లక్ష్మీ, జయదేవ్ సాక్ష్యాలతో సహా పట్టుకున్నప్పటికీ మనీషాతో పాటు దేవయాని కూడా ఉందని నిజం మిత్రకు చెప్పొద్దని లక్ష్మీ మామయ్యతో చెప్తుంది. జయదేవ్ లక్ష్మీ మాటకు ఎదురు చెప్పలేక సైలెంట్ అయిపోతాడు. జయదేవ్ వెళ్లిపోయిన తర్వాత అక్కడే ఉండి చాటుగా వాళ్ల మాటలు విన్న మనీషాని లక్ష్మీ బయటకు పిలుస్తుంది. మనీషా బయటకు వస్తుంది. ఒకర్ని ఒకరు కోపంగా చూసుకుంటారు.
లక్ష్మీ: మొత్తం వినేశావు కదా.
మనీషా: విన్నాను నేను అంటే నీకు ఆ మాత్రం భయం భక్తి ఉండాలి.
లక్ష్మీ: కొట్టడానికి చేయి ఎత్తి ఆగిపోయి భయపడకు నిన్ను కొట్టాలి అన్నా నాకు కంపరంగా ఉంది. రోజు రోజుకు నువ్వు ఇంత దిగజారిపోతుంటే అసహ్యంగా ఉంది. మొదటి నుంచి నువ్వు చేస్తున్న తప్పుల గురించి తెలిసినా నువ్వు మారుతావని ఒక్క అవకాశం ఇస్తూ వచ్చాను కానీ నువ్వు ఇంకా ఇంకా పతనం అయిపోతున్నావ్. నువ్వు మిత్ర గారితో మొదటి నుంచి ఉన్నావు. ఒక ఫ్రెండ్‌లా ప్రేమికురాలిలా ఆయన మంచి కోరుకోవాల్సిన నువ్వు ఆయన పక్కనే ఉంటూ గోతులు తవ్వుతున్నావు. నీది ప్రేమ కాదు మనీషా పైశాచికత్వం. ఇంత చేసినా నిన్ను ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా మారుతావేమో అని చూస్తున్నా నా సహనాన్ని పరీక్షించకు. ఇది నా కుటుంబం నా కుటుంబంలో ఏ ఒక్కరిని బాధ పెట్టినా నీ నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకున్నట్లే ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నువ్వు ఇప్పుడైనా మారకపోతే చచ్చిపోతావ్.
లక్ష్మీ లక్కీకి జడలు వేస్తుంటుంది. జున్ను వస్తే లక్కీ గుడ్ గల్ నువ్వు రోజు రోజుకు బద్ధకస్తుడువు అయిపోతున్నావ్ అని అంటుంది. నా పనులు నువ్వేం చేయకు అని జున్ను లక్ష్మీని అంటే మీ నాన్న చేస్తాడా అని అడుగుతుంది. దాంతో జున్ను తన తండ్రే చేస్తాడని అంటాడు. దానికి లక్ష్మీ ఇక నుంచి నేను లక్కీ పనులే చేస్తానని అంటే దానికి జున్ను మీ ఇద్దరు ఒక టీమ్ అయితే నేను నాన్న ఒక టీమ్ అని చెప్పి వెళ్లిపోతాడు. మిత్ర దగ్గరకు లక్కీ అమ్మ ఒక టీమ్ అని నా పనులు చేయను అని లక్కీతో కంపేర్ చేసి నన్ను తిడుతుందని అంటాడు. దాంతో మిత్ర లక్ష్మీ వినేలా నీ పనులు నేనే చేస్తానని చెప్పి జున్నుని రెడీ చేస్తాడు.
ఇక మిత్ర హాల్‌లో ఉంటే జాను టీ ఇస్తుంది. మీ అత్తకి ఇచ్చావా మీ భార్యకి ఇచ్చావా అని అడుగుతాడు. ఇచ్చాను అని జాను అంటే నువ్వు నీ భర్తకి ఇచ్చావా అని అంటాడు. జానుకి సీన్ అర్థమై లక్ష్మీ దగ్గరకు వెళ్లి మీ ఆయనకు నువ్వే టీ ఇవ్వు అని చెప్పి లక్ష్మీ చేతిలో టీ పెడుతుంది. లక్ష్మీ వెళ్తుంది. ఇక దీక్షితులు గారికి దివ్యదృష్టిలో మిత్ర ఫ్యామిలీకి ఏదో అవుతున్నట్లు కనిపించి వెంటనే జయదేవ్‌కి పిలవమని చెప్తారు. ఆయన శిష్యుడు జయదేవ్‌కి కాల్ చేసి రమ్మని చెప్తాడు. జయదేవ్ కంగారుగా బయల్దేరుతారు. ఇక లక్ష్మీ మిత్రకు టీ ఇస్తుంది. మిత్ర లక్ష్మీతో కలిసి టీ షేర్ చేసుకుంటాడు. ఇక ఇద్దరూ అలా ఒకర్ని ఒకరు చూసుకొని టీ తాగుతూ ఉంటే పిల్లలు, జాను, వివేక్‌లు సైలెంట్‌గా వచ్చి వాళ్ల పక్కన నిల్చొంటారు. చూడటానికి చాలా బాగుందని ఈ ఫ్యామిలీ ఎప్పుడూ ఇలాగే ఉండాలి ఎవరి దిష్టి తగలకూడదని వివేక్ అంటాడు.
ఇంతలో రూపం మార్చుకున్న మనీషా టిప్ టాప్ మీద ఎంట్రీ ఇస్తుంది. సంతోషంగా ఉన్న మిత్ర ఫ్యామిలీని చూస్తుంది. జాను, వివేక్, మిత్ర, లక్ష్మీ పిల్లలు, దేవయాన అందరూ నవ్వుకుంటూ ఉంటే కోపంగా చూస్తుంది. నేను తప్ప అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటుంది. లక్ష్మీ ఇచ్చిన వార్నింగ్‌కి ఏం చేయాలి అని అనుకుంటుంది. మనీషా అంతరాత్మ కనిపించి మనీషా ఓడిపోయావ్ అని ఇంకా మనీషాని రెచ్చగొడుతుంది. కుటుంబాన్ని అన్నదమ్ముల్ని అక్కాచెల్లెళ్లని విడగొట్టి ఏమైనా సాధించు అని మనీషా అంతరాత్మ మనీషాతో చెప్తుంది. దాంతో మనీషా ఆలోచనలో పడుతుంది. ఇక వివేక్‌కి మ్యానేజర్ ఫోన్ చేస్తే మీటింగ్‌కి ఇంటికి రమ్మని చెప్తాడు. మిత్ర ఆఫీస్‌కి హాలీడే కదా అంటే అందుకే ఇంటికి రమ్మన్నాను అని చెప్తాడు. లక్ష్మీ వచ్చి వాళ్లని ఇంటికి పిలిచి మంచి పని చేశావ్ అని వివేక్తో అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.