Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial August 7th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జాను ముందు వివేక్ సరసాలు.. చేయి విరిచేస్తానని వార్నింగ్ ఇచ్చిన లవర్!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను వివేక్ని మర్చిపోయిందని నమ్మేసిన దేవయాని జాను, సంయుక్తలతో కలిసి గుడికి బయల్దేరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode వివేక్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఖుషి తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వస్తుంది. లక్కీని చూసి ఇంట్లో అందరూ ఉన్నారా అని అడుగుతారు. లక్కీ ఎప్పటిలా తన మాటలతో వాళ్లని ఇబ్బంది పెడుతుంది. ఇక ఇంట్లోకి వచ్చిన వియ్యాలవారిని దేవయాని ఆహ్వానిస్తుంది. ఇక దేవయాని జానుని పిలుస్తుంది. జాను మీద అరిచే దేవయాని జానుని ఇంత ప్రేమగా పిలుస్తుందేంటని అనుకుంటుంది. జాను, వివేక్‌లు కిందకి వస్తారు. జాను నువ్వుతూ నటిస్తే వివేక్ డల్ అయిపోతాడు. ఇక ఖుషీని పలకరించమని దేవయాని అంటుంది. వివేక్ ఖుషీకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఖుషీ వివేక్ చేయి పట్టుకొని నలిపేస్తుంది. అది జాను చూసి వివేక్కి వార్నింగ్ ఇస్తుంది.
జాను: దాని చేయి వదలకపోతే నీ చేయి విరిచేస్తా. ఛాన్స్ దొరికింది కదా అని తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్.
దేవయాని: వదిన గారు మీరు ఇక్కడే ఉండండి నేను సంయుక్తని పిలుస్తా.
మనీషా: ఈ దేవయాని ఆంటీకి పిచ్చి పట్టిందా టెంపుల్‌కి ఊరందర్ని పిలుస్తుంది. అబ్బా..
దేవయాని: సంయుక్త పద టెంపుల్‌కి వెళ్దాం. వివేక్ వాళ్ల కాబోయే మామకి ఏదో ఆచారం ఉంది అంట. నువ్వు ఈ పెళ్లి పెద్దవి కాబట్టి నువ్వు కచ్చితంగా రావాలి. నిన్నటి వరకు జాను వల్ల వివేక్ పెళ్లికి ఏవిధంగా అడ్డ వస్తుందా అని కంగారు పడిపోయా కానీ నీ వల్ల జాను మారిపోయింది అందుకే నువ్వు ఈ పెళ్లికి పెద్దవి. నీ వల్ల నా టెన్షన్ పోయింది.
సంయుక్త: టెన్షన్ పెట్టకుండా చేయడానికే కదా నేను వచ్చింది. అదే ఆంటీ టెన్షన్ లేకుండా చేయడమే నా పని. ఆంటీ మిత్ర గారు టెంపుల్‌కి వస్తే నేను వస్తా.
మిత్ర: ఏంటి నేను వస్తే వస్తారా. నాకు ఆఫీస్‌లో పనులు.
సంయుక్త: మాకు కూడా ఆఫీస్‌లో పనులు ఉన్నాయి కానీ ఏదో అంటీ చెప్పారని.
దేవయాని: మిత్ర తమ్ముడి పెళ్లి కదా అని నువ్వు ఇప్పుడు గుడికి రావాలి. సంయుక్త నువ్వు రెడీ అయిపో తను వస్తాడు. బావగారు మీరు కూడా టెంపుల్‌కి వస్తారా.
జయదేవ్: నేను ఇప్పుడు ఎందుకు వస్తానులే పెళ్లి ఆగిపోయాక వస్తానులే. అదే అయిపోయాక వస్తాను.
మనీషా: అంకుల్ కచ్చితంగా పెళ్లి ఆగిపోతేనే వస్తా అన్నారు కానీ మాట మార్చారు ఇక్కడ ఏదో జరుగుతుంది కానీ అది ఆంటీకి అర్థం కావడం లేదు. ఈ సంయుక్త ఒకర్తి మిత్రని అంటి పెట్టుకుంటోంది నేను కూడా వెళ్లాలి.
అందరూ కలిసి టెంపుల్‌కి వెళ్తారు. మిత్రని సంయుక్త జాను, వివేక్‌ల పెళ్లి ఆగిపోవడానికి సాయం చేయమని అంటుంది. మిత్ర జాను కోసం చేస్తాను అంటే జాను వాళ్ల అక్క కోసం చేయరా అని అడుగుతుంది. కార్‌లో ఉన్న లక్కీ జాను టీచర్‌కి అక్కా నాకు ఈ విషయం తెలీదని అడుగుతుంది. సంయుక్త లక్కీని తన గురించి తానే చెప్తుంది. ఇక లక్కీ అర్జున్‌కి కాల్ చేసి జున్నుని తీసుకొని గుడికి రమ్మని పిలుస్తుంది. ఇక జున్ను తల్లిని కూడా గుడికి తీసుకురమ్మని చెప్తుంది లక్కీ. జాను, సంయుక్త, అర్జున్ షాక్ అవుతారు. ఇక సంయుక్త అయితే లక్కీ తనని బుక్ చేసే పనులే చేస్తుందని అనుకుంటుంది. అమ్మని తీసుకురాకపోతే మీ ఇంటి దగ్గర తీసిన ఫొటోలు అన్నీ సోషల్ మీడియాలో పెడతాను అని బెదిరిస్తుంది. ఇక సంయుక్త ఫోన్ తీసుకొని జున్నుని జున్ను మదర్‌ని తీసుకురావాలని అంటుంది. ఇన్‌డైరెక్ట్‌గా తాను మ్యానేజ్ చేస్తానని అంటుంది. జున్నుని రెడీ అవ్వమని అర్జున్ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపకు మరో వాయిదా, ఈసారి బలమైన సాక్ష్యం లేకపోతే శౌర్య నర్శింహ దగ్గరకే!