అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today August 21st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర కిడ్నాప్ విషయం తెలుసుకొని కుప్పకూలిపోయిన అరవింద.. లక్కీ జున్నుకి రాఖీ కడుతుందా! 

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర చెల్లి సంజన ఇంటికి రావడంతో మిత్ర కిడ్నాప్ విషయం అరవిందకు తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను, వివేక్‌లు మిత్ర గురించి టెన్షన్ పడుతుంటే వివేక్ చెల్లి సంజన ఇంటికి వస్తుంది. జయదేవ్ కూడా రావడంతో పెద్దనాన్న అని పలకరిస్తుంది. మిత్ర అన్నయ్య గురించి అడుగుతుంది. ఇక దేవయాని కూతుర్ని చూసి సంతోషపడుతుంది. అన్నయ్యలకు రాఖీ కట్టడానికి వచ్చానని సందడి చేస్తుంది. మరోవైపు లక్కీ డోర్ వేసుకొని గదిలో నుంచి రాదు. అరవింద పిలిస్తే నాన్న వచ్చే వరకు బయటకు రాను అని మొండికేస్తుంది. మరోవైపు సంయుక్తలా ఉన్న లక్ష్మీ మిత్ర గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంది. దేవుడికి దండం పెట్టుకుంటుంది.  

అరవింద: లక్కీ నాన్న ఎప్పుడొస్తాడని అడుగుతుంది సంయుక్త దానికి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అసలు మిత్ర ఎప్పుడు వస్తాడో నాకు అర్థం కావడం లేదు.  
సంయుక్త: కంగారు పడొద్దు అంటీ మిత్ర గారు వచ్చేస్తారు.
అరవింద: నీకు ఒక విషయం తెలీడం లేదు సంయుక్త మిత్రకు వచ్చే గండాలు అన్నీ మామూలువి కాదు. ప్రాణాలు తీసేవిలా ఉంటాయి. ఏ నిమిషం అయినా మృత్యువు కబళించేలా ఉంటాయి. దీక్షితులు గారు మరీ మరీ హెచ్చరించారు. నాకు ఏం అవుతుందా అని కంగారుగా ఉంది.

సంజన సంయుక్తని చూసి వదిన అని వెళ్లి హగ్ చేసుకుంటుంది. నువ్వు బతికే ఉన్నావా వదినా అంటూ సంతోషపడుతుంది. వదిన బతికే ఉందని నాకు ఎందుకు ఎవరూ చెప్పలేదని అందర్ని ప్రశ్నిస్తుంది. అందరూ సైలెంట్ అయిపోతారు. దేవయాని తను మీ వదిన కాదు అని చెప్తుంది. సంజన షాక్ అయిపోతుంది. తాను సంయుక్త  అని తన గురించి చెప్తుంది. సంజన సంయుక్తకి సారీ చెప్తుంది. ఇక రాఖీ కట్టాలని మిత్ర గురించి అడుగుతుంది.

అరవింద: మిత్ర లేడు సంజన. ఎక్కడికి వెళ్లాడో ఎప్పుడు వస్తాడో తెలీదు. అసలు వీళ్లంతా నా దగ్గర ఏదో దాస్తున్నారు. వివేక్ చెప్పరా మిత్ర ఏడి. చెప్పు వివేక్. అరవింద అందర్ని పేరు పేరున మిత్ర గురించి అడుగుతుంది. ఏడుస్తుంది. అబద్దాలు చెప్పొద్దని అరుస్తుంది. అందర్ని ప్రాధేయపడుతుంది. నిజం చెప్పమని ఏడుస్తుంది.
జయదేవ్: అరవింద మిత్రని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ మాట వినగానే అరవింద కళ్లు తిరిగి పడిపోతుంది.
అరవింద: మిత్రను కిడ్నాప్ చేయడం ఏంటండి. నా కొడుకు మీద ఎందుకు పగ పట్టారు. ఏవండీ నాకు చాలా భయంగా ఉందండి. వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడని కంగారుగా ఉందండి. దయచేసి నా కొడుకుని కాపాడండి.
సంయుక్త: ఆంటీ మీరు కంగారు పడొద్దు మిత్ర గారికి ఏం కాదు.

అరవింద ఏడిస్తే సంయుక్త ఓదార్చుతుంది. ఇక అర్జున్ జున్ను మిత్ర ఇంటికి వస్తారు. లక్కీకి మిత్ర కనిపించడం లేదనే విషయం చెప్పొద్దని అర్జున్ జున్నుతో అంటాడు. జున్ను సరే అంటాడు. ఇద్దరూ ఇంట్లోకి వెళ్తారు. జున్ను జయదేవ్ దగ్గరకు వెళ్లి లక్కీ రాఖీ కడతానని చెప్పిందని ఏదని అడిగితే గదిలో ఉందని చెప్తే తాను బయటకు తెస్తానని జున్ను వెళ్తాడు. ఇక అర్జున్ అరవింద దగ్గరకు వెళ్లి తప్పని పరిస్థితుల్లో మిత్రలా మాట్లాడానని సారీ చెప్తాడు. అరవింద ఏం పర్లేదు అంటూనే మిత్ర గురించి చెప్తూ ఏడుస్తుంది. అర్జున్ అరవిందకు ధైర్యం చెప్తాడు. జున్ను లక్కీని బయటకు రమ్మని పిలిస్తే లక్కీ రాను అని చెప్తుంది. తన కోసం బయటకు రావా నాకు నువ్వు ఇచ్చే విలువ ఇదేనా అని అంటాడు. ఇక జున్ను మిత్ర అంకుల్ చాలా క్షేమంగా ఉన్నాడని ఆఫీస్‌కి వెళ్లి మాట్లాడానని జున్ను అంటాడు. రాఖీ కడతానని చెప్పావని వచ్చానని రాఖీ కట్టను అంటే వెళ్లి పోతానని జున్ను అంటే లక్కీ బయటకు వస్తుంది. ఇక సంజనతో అత్త అనుకుంటూ లక్కీ తన బాధ చెప్తుంది. ఇక సంయుక్త డాడీ వచ్చేస్తారని రాఖీ కట్టించుకోవడానికి డాడీ రమ్మని పిలిస్తే అత్త వచ్చిందని చెప్తే లక్కీ హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.   

Also Read: సత్యభామ సీరియల్: వాంతులు చేసుకున్న సత్య ఇది అదేనా.. మైత్రితో క్లోజ్‌గా హర్ష, ఫీలవుతున్న నందిని!

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Embed widget