అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi August 10th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: సంయుక్త ఉచ్చులో చిక్కుకున్న మనీషా.. ఖుషి ఫ్యామిలీ ముందు వివేక్‌, జానుల ప్రేమ కథ చెప్పేసిందిగా!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మనీషా గుడిలో ఖుషి ఫ్యామిలీ ముందు వివేక్ జాను ప్రేమించుకున్నారని అందరితో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode అర్జున్ ఓ చెట్టు కింద కూర్చొని ఉంటే మిత్ర అక్కడికి వెళ్తాడు. తన కూతురు చెప్పగానే నీ కొడుకు జున్నుని నీ భార్యని బాగానే గుడికి తీసుకొచ్చావ్ అని అంటాడు. తన కూతుర్ని బాగానే గౌరవించావని అంటాడు. అందర్ని గౌరవించడం తన అలవాటు అని అర్జున్ అంటే నువ్వు గౌరవించినట్లు నటిస్తావని అంటాడు మిత్ర. ప్రాజెక్ట్ తానే సొంతం చేసుకొని నీ గర్వం అణగదొక్కేలా చేస్తానని మిత్ర అంటాడు. ఇక జున్ను, లక్కీలు మిత్ర, అర్జున్‌ల దగ్గరకు వస్తారు. లక్కీ మిత్రతో సంయుక్త ఆంటీ కనిపించిందా అని అడుగుతుంది. ఇక అర్జున్‌ని అమ్మ ఎక్కడా అని అడుగుతుంది.

అర్జున్: తను లోపల పూజలో ఉంది లక్కీ.
మిత్ర: అర్జున్ నాకు ఓ డౌట్ ఎక్కడ జున్ను మదర్ కనిపించకుండా జాగ్రత్త పడేవాడివి ఇప్పుడేంటి అంత ధైర్యంగా బయటకు తీసుకొచ్చేశావ్. ఇన్ని రోజులు తనని బంగారు కోడిపెట్టలా లోపలే దాచేశావ్ ఇప్పుడు తనకి ఫ్రీడం ఇచ్చేశావ్.
అర్జున్: చూడు మిత్ర ఎప్పుడు ఏది బయట పడాలో అప్పుడే పడుతుంది. ఎప్పుడు ఏది ఎవరికీ దక్కాలో అప్పుడే దక్కుతుంది. ప్రతి దానికి సమయం సందర్భం ఉంటుంది. నువ్వు పోగొట్టుకున్నవి కూడా అతి త్వరలోనే పొందాలని కోరుకుంటున్నా.
సంయుక్త: ఏంటి స్నేహితులు ఇద్దరూ ఒక్కదగ్గర ఉన్నారు.
మిత్ర: స్నేహితులం గొప్ప స్నేహితులం.
అర్జున్: నువ్వు చెప్పింది నిజం సంయుక్త మిత్ర శత్రువులా కనిపించే స్నేహితుడు. స్నేహితుడిలా కనిపించే శత్రువు. జున్ను పద అమ్మ దగ్గరకు వెళ్దాం.
లక్కీ: ఇక్కడ సంయుక్త ఆంటీ ఉంది అక్కడ నిజంగా జున్ను వాళ్ల అమ్మ ఉందా వెళ్లి చూడాలి.
మిత్ర: అసలు అర్జున్ ఇన్ని రోజులు తన భార్యని ఎందుకు దాచాడు వెళ్లి చూడాలి. సంయుక్త మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తా. అర్జున్ గారి భార్య ఒకసారి నాకు రావాల్సిన ప్రాజెక్ట్ తను దక్కించుకుంది అందుకే ఆమెను ఒకసారి చూస్తా.
సంయుక్త: మిత్ర గారు మనకు అందరూ పిలుస్తున్నారు. పదండి.
లక్కీ: నాన్న మీరు వెళ్లండి నేను జున్ను వాళ్ల అమ్మని కలిసి వస్తా. అర్జున్ అంకుల్ అమ్మ ఎక్కడ ఇక్కడే పూజ చేస్తుంది అన్నారు కదా.
అర్జున్: లక్కీ ఇప్పుడు లక్ష్మీని చూడకపోతే సంయుక్త లక్ష్మీ ఒక్కరే అని గట్టిగానే నమ్ముతుంది.

లక్కీ మొత్తం వెతికి చివరకు జున్ను దగ్గర వచ్చి కూర్చొంటుంది. ఎదురుగా లక్ష్మీ కనిపిస్తుంది. ఇక లక్కీ సంయుక్తని లక్ష్మీ అమ్మని ఒకేసారి చూడటం కలవడం లేదని అంటుంది. ఇక లక్కీ లక్ష్మీని తనతో రమ్మని ఇద్దరినీ ఒక్కసారి పరిచయం చేస్తా అని అంటుంది. ఇక లక్కీ వెళ్తూ అర్జున్, జున్నులను ఇంటికి వెళ్లిపోమని తాను ఆఫీస్‌కు వెళ్తానని అంటుంది. జున్ను వెళ్లిపోయిన తర్వాత లక్కీకి సంయుక్తగా కనిపించాలని అనుకుంటుంది. మరో వైపు వివేక్ జాను కోసం వెతుకుతాడు. జాను ఓ చోట ధీనంగా కూర్చొని ఉంటుంది. పక్కనే వెళ్లి వివేక్ కూర్చొంటాడు.

వివేక్: మనీషా అన్న మాటలకు బాధ పడుతున్నావా. చూడు జాను ఎవరు ఎన్ని అన్నా చివరకు కలిసేది మనమే నేను తాళి కట్టేది నీ మెడలోనే.
జాను: ఏమో వివేక్ మీ అమ్మ మనీషా నిన్ను ఖుషీని పెళ్లి చేసే వరకు వదిలేలా లేరు. మధ్యలో వచ్చింది నేనే మధ్యలోనే పోయేలా ఉన్నాను.
వివేక్: అలా అనకు జాను వదిన మనల్ని కలుపుతాను అంది కదా నువ్వు ధైర్యంగా ఉండు. 

మరోవైపు సంయుక్తగా వచ్చిన లక్ష్మీ జాను వివేక్‌లను కలుపుతాను అని వాళ్లకి అండగా ఉండమని దేవుడ్ని వేడుకుంటుంది. ఇక ఎవరో కొందరు రౌడీలు అమ్మాయి అబ్బాయిని తరుముతారు. ఇక లక్కీ సంయుక్త ఆంటీ ఏది అంటే సంయుక్త ఎదురు పడుతుంది. ఇంతలో ఇద్దరు రౌడీలు తరుముతున్న ఆ ప్రేమికులు తమకు పెళ్లి చేయమని పంతుల్ని అడుగుతాడు.. ఇద్దరం మేజర్లు కాబట్టి పెళ్లి చేస్తానని అంటారు ఇక మనీషా ఆస్తి ఉంటే ప్రేమ గెలుస్తుందని అంటుంది. తాను మిత్రకు ఆస్తితో పాటు అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ల ప్రేమ బాగుందని అంటుంది. దానికి సంయుక్త మనీషాని ఇరికించాలని ఫిక్స్ అవుతుంది.

సంయుక్త: మనీషా నీ మైండ్ సెట్ మిత్ర మైండ్ సెట్ కలవవని మిత్ర నిన్ను పెళ్లి చేసుకోను అంటే ఓకేనా 
మనీషా: అది వేరు ఇది వేరు.
సంయుక్త: రెండు ఒకటే.
మనీషా: చెప్పేది మంచి మాట అయినప్పుడు చూపించేది మంచి మార్గం అయితే కచ్చితంగా చేస్తారు. 
సంయుక్త: అలాంటి వాళ్లు ఎవరు ఉన్నారు ఒక్కర్ని చూపించు.
మనీషా: ఎందుకు లేరు వివేక్ లేడా 
సంయుక్త: మనసులో ఇప్పుడు దారికొచ్చావ్ మనీషా దొరికావ్.
దేవయాని: ఇదేంటి కోపంలో ఏదోదో వాగేస్తుంది.
సంయుక్త: వివేకా వివేక్ ఏం చేశాడు.
మనీషా: వివేక్ జానుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. జానుతోనే బతకాలి అని కలలు కన్నాడు. ఆఖరికి ఏమైంది దేవయాని ఆంటీ మాటలు వినలేదా దేవయాని ఆంటీకి విలువ ఇచ్చి మనసు మార్చుకోలేదా జానుని పెళ్లి చేసుకోకుండా ఆగిపోలేదా.
సంయుక్త: మనీషా నేను వేసిన ఉచ్చులో బాగా చిక్కుకున్నావ్ ఇది కదా నాకు కావాల్సింది.
దేవయాని: అయ్యో ఇది నా కొంప ముంచేసింది. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నర్శింహ రెండో పెళ్లి చేసుకున్నాడని విడాకులు అడిగిన దీప.. కార్తీక్ ఎమోషనల్ స్పీచ్! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget