Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today April 9th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషా బొప్పాయి ప్లాన్ తిప్పికొట్టిన లక్ష్మీ.. చేతులు కాల్చుకున్న దేవాయాని!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode ఉగాది పచ్చడితో కడుపు పోయే ప్లాన్ మనీషా వేయడం దాన్ని లక్ష్మీ తిప్పి కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode దేవయాని జాను చేయి కాల్చాలి అని అట్ల కాడ కాల్చేసి అట్లు చేయమని జానుతో చెప్తుంది. జాను మొత్తం వినేసి అత్త ప్లాన్ అత్తకే రివర్స్ చేయాలి అనుకొని పిండి, పెనం అంటూ అట్ల కాడ పట్టేలా చేస్తుంది. దాంతో దేవయాని చేయి కాలిపోతుంది. దేవయాని చేయి కాలిపోయిందని గోల గోల చేసేస్తుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. ఏమైందని అండుగుతారు.
దేవయాని చేయి కాల్చేసిన జాను..
జాను వచ్చి దేవయాని అత్తయ్య గారు ఉగాది కోసం అట్లు చేయాలి అని అట్ల పెనం కాల్చబోయి అట్ల కాడ కాల్చేశారు అందుకే చేయి కాలిపోయింది అని చెప్తుంది. ఎప్పుడూ వంటింటికి వెళ్లనామె కొత్తగా వెళ్తే ఇలాగే ఉంటుందని జయదేవ్ అంటాడు. ఇక అరవింద జానుకి వెన్న తీసుకొచ్చి రాయమని చెప్తుంది. వివేక్ ఏం పట్టించుకోకపోవడంతో దేవయాని వివేక్‌ని ప్రశ్నిస్తుంది. కన్నతల్లికి ఇలా అయితే చీమ కుట్టినట్లు కూడా లేదా అని అడుగుతాడు.
వెన్నలో ఉప్పు.. చేయి మంట..
దేవయాని చేతికి వెన్న పూస్తే చేయి నొప్పి తగ్గిపోయి మళ్లీ మనీషాతో చేతులు కలిపి ఏదో ప్లాన్ చేస్తుందని జాను వెన్నలో ఉప్పు కలిపేస్తుంది. అది దేవయానికి రాయడంతో మంట నొప్పి అని ఏడుస్తుంది. ఇంకా ఇంకా ఉప్పు కలిపిన వెన్న జాను రాసేస్తుంది. దాంతో దేవయాని ఇళ్లు పీకి పందిరేస్తుంది. జాను ఏదో చేసిందని వివేక్‌కి అనుమానం వస్తుంది. వెన్నలో ఏమైనా కలిపావా అని జానుని అడుగుతాడు. విశ్వాసం కలిపానని అంటుంది జాను. అదేంటి అని వివేక్ అడిగితే ఉప్పు కలిపానని అంటుంది.
లక్ష్మీకి చావు దెబ్బ కొడతా..
దేవయాని మంట అని గదిలోకి వెళ్లి అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఏమైందని మనీషా అడుగుతుంది. దేవయాని జరిగింది చెప్తుంది. జాను, వివేక్ మొత్తం బ్లూటూత్‌లో వింటారు. నా ప్లాన్ తిరగబడింది నీ ప్లాన్ అయినా కరెక్ట్‌గా చేయొ అంటుంది. నేను కరెక్ట్‌గా చేస్తాను అని మనీషా అంటుంది. ఇక ప్లాన్ చెప్పమని దేవయాని అడిగితే మనీషా చెప్పదు. ఈ రోజు లక్ష్మీకి చావు దెబ్బ కొట్టబోతున్నా అని చెప్తుంది. ప్లాన్ అంతా రెడీగా ఉంది లక్ష్మీ పతనం ఖాయం అని అంటుంది.
మనీషా ఎత్తులు చిత్తు చేస్తా..
దేవయాని, మనీషా ఏదో చేయాలి అనుకుంటున్నారని వివేక్, జానులు లక్ష్మీకి చెప్తారు. వాళ్ల టార్గెట్ నువ్వే అని నిన్ను బ్యాడ్ చేయడానికి ఏదో చేస్తున్నారని అంటారు. మనీషా ప్లాన్ ఏం అయినా నేను ఆపుతానని మిత్ర గారు నా వైపు ఉన్నంత వరకు మనీషా ఎత్తులు చిత్తు చేస్తానని అంటుంది. జాను, వివేక్‌లకు టెన్షన్ తీసుకోవద్దని పూజకు రెడీ అవ్వమని చెప్తుంది.
ఉగాది పూజ పంచాంగ శ్రవణం..
అందరూ చక్కగా రెడీ అయి ఉగాది పూజ చేస్తారు. ఇంటి సంకల్పం ఏంటి అని పంతులు అడిగితే మనీషా పంతులుతో నేను మిత్ర జీవితాంతం కలిసి ఉండాలని అంటుంది. లక్ష్మీ, అరవింద, జయదేవ్‌లు మిత్ర క్షేమం అని అంటారు. ఇక పంతులు కొబ్బరికాయ కొట్టమని అంటే జయదేవ్ లక్ష్మీకి కొట్టమని అంటారు. లక్ష్మీ కొట్టబోతే మనీషా పట్టుకొని నేను కొబ్బరి కాయ కొడతా అంటుంది. అరవింద ఆపి గర్భణీలు కొబ్బరి కాయ కొట్టకూడదని అంటుంది. ఇక లక్కీ నేను కొడతాను నేను నాన్నకి లక్కీ కదా నేనే కొబ్బరి కాయ కొడతా అని చెప్పి మనసులో నాన్నకి మంచి జరగాలి అందరం బాగుండాలి అని మొక్కుకొని కొబ్బరి కాయ కొడుతుంది.
తొలి ప్రసాదం మనీషాకే..
లక్ష్మీ ఉగాది పచ్చడి తీసుకురావడానికి వెళ్తుంది. మనీషా వాంతి వచ్చినట్లు నటించి లక్ష్మీ దగ్గరకు వెళ్తుంది. లక్ష్మీ నన్ను పంపించడానికి ఏం ప్లాన్ చేయలేదా అని అడుగుతుంది. నువ్వేం ప్లాన్ చేశావ్ మనీషా అని లక్ష్మీ అడుగుతుంది. ఇక మనీషా లక్ష్మీకి తెలీకుండా తాను కలిపిన ఉగాది పచ్చడి లక్ష్మీ తెచ్చే పచ్చడిలో పెట్టేస్తుంది. లక్ష్మీ వాటిని తీసుకొస్తుంది. అందరికీ లక్ష్మీ ప్రసాదం ఇస్తుంటే మనీషా తొలి ప్రసాదం తనకు ఇవ్వమని కడుపుతో ఉన్నాకదా అని అంటుంది. అరవింద తొలి ప్రసాదం మనీషాకి ఇవ్వమని లక్ష్మీతో చెప్తుంది.
క్షమించండి అత్తయ్యా నేను ఇవ్వను..
లక్ష్మీ ఆలోచించి అరవిందతో క్షమించండి అత్తయ్య నేను ఇవ్వను. మనీషా కడుపుతో ఉంది ఈ ఉగాది పచ్చడిలో అన్ని రుచులు ఉంటాయి అది బిడ్డకు మంచిది కాకపోవచ్చు అని అంటుంది. మనీషా అరవిందకి తినమని చెప్పి తర్వాత తాను తింటాను అంటుంది. ఫ్లాష్ బ్యాక్లో మనీషా బొప్పాయి పళ్లు కలిపినట్లు లక్ష్మీ గ్రహిస్తుంది. మనీషాకి పచ్చడి ఇవ్వకుండా పానకం ఇస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!





















