Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today April 3rd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: చివరి నిమిషంలో టెండర్ వేసిన లక్ష్మీ.. అత్త కోరిన టెండర్ లక్ష్మీ దక్కించుకుంటుందా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ మిత్ర కోరిక మేరకు టెండర్ వేయడం అరవింద స్వామీజీని కలవడానికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్రని లక్ష్మీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తుంది. మిత్ర లక్ష్మీని టెండర్ వేయడానికి వెళ్లమని చెప్తాడు. నా వల్ల కాదు అని లక్ష్మీ ఏడుస్తుంది. మిత్రని ఐసీయూలోకి తీసుకెళ్తారు. లక్ష్మీ, మిత్రల ఫోన్‌లు అవ్వకపోవడంతో ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు. నువ్వేమైనా చేశావా అని దేవయాని మనీషాని అడుగుతుంది. నేనేం చేయలేదని మనీషా చెప్తుంది. అందరూ మిత్ర, లక్ష్మీలు ఏమైయ్యారని అనుకుంటారు.
హాస్పిటల్‌కి అరవింద పరుగులు..
టీవీలో బిజినెస్మెన్ మిత్రకు రోడ్డు ప్రమాదం జరిగిందని టీవీలో వస్తుంది. ఇంట్లో అందరూ టీవీ చూసి కంగారు పడతారు. హాస్పిటల్‌కి కాల్ చేయమని అరవింద చెప్పడంతో జయదేవ్ కాల్ చేస్తాడు. లక్ష్మీ మాట్లాడగానే మిత్రకు ఎలా ఉంది.. మిత్ర బాగానే ఉన్నాడా అని అడుగుతుంది. మిత్ర బాగాన ఉన్నాడని చిన్న చిన్న గాయాలు అయ్యావి లక్ష్మీ చెప్తుంది. పిల్లలకు ఫోన్ ఇవ్వమని ఇద్దరితో మాట్లాడి మాకు ఏం కాలేదు సాయంత్రానికి ఇంటికి వస్తామని అంటుంది. అరవింద వాళ్లు హాస్పిటల్‌కి బయల్దేరుతారు. మనీషా కూడా వస్తాను అంటే నువ్వు అంత దూరం జర్నీ చేయడం మంచిది కాదు నువ్వు రావొద్దు అని చెప్పి ఆపేస్తుంది.
నువ్వు వెళ్తేనే ట్రీట్‌మెంట్ చేసుకుంటా..
సరయు ఏమైనా చేసిందా మిత్రకు ఏమైందని మనీషా సరయుకి కాల్ చేయాలి అనుకుంటుంది. మిత్ర లక్ష్మీని పిలిపించి నువ్వు టెండర్ వేయడానికి వెళ్తేనే ట్రీట్‌మెంట్ చేసుకుంటానని అంటాడు. దాంతో లక్ష్మీ వెళ్తానని అంటుంది. మనీషా సరయుకి కాల్ చేస్తుంది. మిత్ర, లక్ష్మీలకు యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. మిత్రకు సీరియస్‌గా ఉందని లక్ష్మీకి ఏం కాలేదని మనీషా చెప్తుంది. నువ్వు ఏమైనా చేశావా అని అంటే నేనే చేయలేదు నాకు సంబంధం లేదని అంటుంది. మనీషా సరయు మాటలు నమ్మేస్తుంది. ఇద్దరూ బతికిపోయారని సరయు అనుకుంటుంది.
చివరి నిమిషంలో లక్ష్మీ..
టెండర్ టైం అయిపోయింది ఇంకా ఎవరైనా ఉన్నారా అని టెండర్ వాళ్లు అడిగితే లక్ష్మీ ఒక్క నిమిషం అని ఆపి నందన్ గ్రూప్ తరఫున టెండర్ వేస్తుంది. సరయు షాక్ అయిపోతుంది. మిత్రను వదిలేసి ఎలా వచ్చింది. ఇది లక్ష్మీకాదు లక్ష్మీ బాంబ్ అని అనుకుంటుంది. అధికారులు కాసేపట్లో టెండర్ ఎవరికో చెప్తామని అంటాడు. లక్ష్మీ సరయుతో ఈ టెండర్ ఎలా అయినా నాదే అని అంటుంది.
కొడుకుని చూసి అరవింద ఎమోషనల్..
మిత్రకు ట్రీట్మెంట్ జరుగుతుంటే అరవింద చూసి ఏడుస్తుంది. డాక్టర్ వచ్చి మిత్రకు ప్రమాదం తప్పింది. లక్ష్మీ ముందే మాకు బ్లడ్ అవసరం అయిందని చెప్పి తన భర్త ప్రాణాలు కాపాడుకుందని చెప్తారు. లక్ష్మీ పక్కనుంటే మిత్రకు ఏం కాదని జయదేవ్ అంటే మిత్రకు ఇంకా గండం వెంటాడుతుందని అరవింద ఏడుస్తుంది. అరవింద వాళ్లు మిత్రను చూసి మాట్లాడుతారు. లక్ష్మీ గురించి అడిగితే టెండర్ వేయడానికి వెళ్లిందని అంటాడు. ఈ పరిస్థితిలో ఎందుకు వెళ్లిందని అరవింద అడిగితే నేను వెళ్లమన్నా అని చెప్తాడు.
అమ్మ కోసం ప్రాజెక్ట్ తీసుకురా లక్ష్మీ..
లక్ష్మీ పక్కనున్న ఓ వ్యక్తి ఫోన్ తీసుకొని వివేక్‌కి కాల్ చేస్తుంది. హాస్పిటల్‌కి వచ్చారా అని అడుగుతుంది. మిత్రతో మాట్లాడి ఏడుస్తుంది. మరోసారి నన్ను బతికించావ్ అలాగే అమ్మ కోరిన ఆ ప్రాజెక్ట్ కూడా తీసుకొని రా లక్ష్మీ అని మిత్ర అంటాడు. మీ నమ్మకం నిలబెట్టుకుంటాను ఎలా అయినా ప్రాజెక్ట్ తీసుకొస్తా మీరు జాగ్రత్త అండీ అని లక్ష్మీ చెప్తుంది. అరవింద స్వామీజీని కలవాలని అని భర్తని తీసుకొని వెళ్తుంది. టెండర్ దగ్గర రెండు కంపెనీలు దగ్గరగా ఉన్నాయని రెండు కంపెనీలు దగ్గరగానే కోట్ చేశారని చెప్తారు. ఒకరు నందన్ కంపెనీ అని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రి కాలర్ పట్టుకున్న కార్తీక్.. శ్రీధర్ చెప్పిన నిజం దీప మాయం!





















