Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today April 21st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఎవరు చిట్టితల్లి నువ్వు? అసలు నీకు మాకు సంబంధం ఏంటి? హాస్పిటల్ తగలబెట్టింది ఎవరు?
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ మనీషా గొంతు పట్టుకొని లక్కీ పుట్టక కోసం ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర, లక్ష్మీ ఇద్దరూ లక్కీ గురించి మాట్లాడుకుంటారు. మనీషా అదంతా విని మిత్ర లక్కీ గురించి ఆలోచించకుండా చేయాలని అనుకుంటుంది. లక్ష్మీ దగ్గరకు వెళ్లి మిత్ర నాకు దగ్గర అవ్వకుండా చూడాలని ప్రయత్నిస్తున్నావ్ కానీ రేపో ఎల్లోండో నాకు మిత్రకు ఫస్ట్‌నైట్ నువ్వు ఏర్పాట్లు చేయడం తప్ప ఏం చేయలేవ్ అంటుంది. దాంతో లక్ష్మీ చైర్ మనీషా కాల్ మీద తోసేస్తుంది.
పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆడితే చంపేస్తానని లక్ష్మీ మనీషాకి వార్నింగ్ ఇస్తుంది. మరోసారి నా భర్తతో మొదటి రాత్రి అంటే నీకు కాలరాత్రి చూపిస్తానని అంటుంది. వచ్చే త్రయోదశి నాడు లక్కీనే ఆయన అదృష్ట దేవత అని నిరూపించి నీ మెడలో ఉన్న పసుపు తాడు నీతోనే విప్పించి ఈ ఇంటి నుంచి గెంటేస్తా రెడీగా ఉండు అని అంటుంది. మనీషా టెన్షన్ పడుతుంది. ఏ మాత్రం లక్ష్మీకి అవకాశం ఇవ్వకూడదని అనుకుంటుంది. లక్కీ విషయంలో ఉన్న ఆధారాలు అన్నీ అర్జెంటుగా చెరిపేయాలి అనుకుంటుంది.
రాత్రి మిత్ర, జున్ను, లక్కీ, లక్ష్మీ పడుకొని ఉంటారు. లక్ష్మీ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. లక్కీని చూసి పెంచిన బంధం తప్పు ప్రేగు బంధం లేకపోయినా నా మాంగల్యం కాపాడావు ఎవరు చిట్టి తల్లీ నువ్వు అసలు మాకు ఏం అవుతావ్ అని లక్కీని లక్ష్మీ ముద్దాడుతుంది. లక్ష్మీకి తను ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు కల వస్తుంది. అసలు విషయం తెలియాలి అంటే మున్నార్ హాస్పిటల్‌కి వెళ్లాలి తనకు ఆశ్రయం ఇచ్చిన భాస్కర్ అన్నయ్యని కలవాలి అని అనుకుంటుంది.
మనీషా లక్ష్మీ ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకొని ఆలోచిస్తుంది. నిద్ర రావడం లేదా అని దేవయాని మనీషాని అడిగితే మీరు నిద్ర పోతే మీరు చనిపోతారని మీ అపోహ అందుకే మీరు నిద్ర పోవడం లేదు కానీ నేను నిద్ర పోతుంటే నా కళ్లలోకి లక్ష్మీ వస్తుంది అందుకే నిద్రపోలేకపోతున్నా అని అంటుంది. ఆ మాటలు వింటూ జాను నవ్వుతుంటుంది. ఏమైందని వివేక్ అడిగితే విషయం చెప్తుంది. ఇంతలో మనీషాకి కాల్ వస్తుంది. మనీషా వచ్చి గుడ్ నైట్ అని చెప్పి వెళ్లిపోతుంది. కడగాల్సిన వన్నీ కడిగేశా ఇక నేను ప్రశాంతంగా పడుకుంటా అని అంటారు.
ఉదయం లక్ష్మీ జయదేవ్‌తో మున్నార్ వెళ్తున్నా అని చెప్తుంది. ఇంతలో న్యూస్‌లో మున్నార్ హస్పిటల్‌లో అగ్నిమంటలు వచ్చి హాస్పిటల్ కాలిపోయిందని వార్త వస్తుంది. దాంతో లక్ష్మీ షాక్ అయిపోతుంది. ఇలా జరిగింది ఏంటి అని లక్ష్మీ బాధపడుతుంది. లక్ష్మీ జానుతో మనీషా, దేవయాని రాత్రి మాట్లాడుకున్నారని అర్థరాత్రి వరకు నీ వల్ల నిద్ర పట్టలేదు అన్న మనీషా సడెన్‌గా ఏదో కడిచేశాను ప్రశాంతంగా పడుకుంటాను అని చెప్పిందని రాత్రి ఏదో చేసిందని జాను అంటుంది. లక్కీ గురించి నీకు ఏం తెలీకుండా ఇలా చేసిందేమో అని వివేక్ అంటాడు. దాంతో లక్ష్మీ వివేక్‌కి భాస్కర్ గురించి తెలుసుకోమని అంటుంది.
మనీషా ఆ న్యూస్ చూస్తూ ఉంటే లక్ష్మీ వచ్చి మనీషా ఫోన్ తీసుకొని ఆ హాస్పిటల్ తగలబెట్టించింది నువ్వేనా లక్కీ గురించి నాకు తెలిసిపోతుందని ఇలా చేశావా అని లక్కీకి ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటి. మిత్ర లక్కీకి ఏంమైంది. భాస్కర్ అన్నయ్య ఎందుకు కనిపించడ లేదు. చెప్తావా చంపేయాలా అని అడుగుతుంది. ఇంతలో అరవింద వస్తుంది. ఏమైందని అడిగితే మనీషా మున్నార్ హాస్పిటల్ తగలబెట్టిందని అరవిందతో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా తెచ్చిన బట్టలు వేసుకొన్నసత్యమూర్తి.. తండ్రి సంతోషం దేవాలో మార్పు తీసుకొస్తుందా!





















