Chinni Serial Today November 18th:చిన్ని సీరియల్: లోహిత మాటలకు మధు షాక్! లోహిత కుట్రలు, సీక్రెట్స్ తెలుసుకున్న మధు!
Chinni Serial Today Episode November 18th మధుకి లోహిత తన మామయ్య కూతురు అని తెలియడం లోహిత మధుకి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు చంద్రశేఖర్ వాళ్ల ఇంటికి వెళ్లడం.. తన చిన్ననాటి చందు మాస్టారు చందు ఒక్కరే అని గుర్తిస్తుంది. సత్యంబాబు ఫోటో చూసి ఎమోషనల్ అయిపోతుంది. మొత్తానికి మధుకి తన మేనమామ ఫ్యామిలీ ఎక్కడుందో తెలుస్తుంది.
మ్యాడీ చిన్ని కోసం వెతకడం మానేయాలి అని దేవా మ్యాడీని డైవర్ట్ చేయాలని చూస్తాడు. సీసీ టీవీ ఫుటేజ్ ఆ సోర్స్ ఈ సోర్స్ అని మ్యాడీని ఆపుతాడు. అయితే మ్యాడీ అన్ని చూసి ఇక బయట వెతుకుతా అని వెళ్లిపోతాడు. గుడిలో నిజంగానే నిమ్మకాయ దీపం పెట్టినప్పుడు చిన్ని ఎవరో తెలీలేదా అని నాగవల్లి అంటే లేదు అని లేదంటే ఈ పాటికే చిన్నిని చంపేసేవాడిని అని దేవా అంటాడు.
మధు తన ఇంట్లో ఉంది అని తెలియక లోహిత తాళి దాచేసి తండ్రి ఆబ్దికానికి వస్తుంది. లోహితని చూసి సరళ కోపంగా రావే లోహిరా.. మీ నాన్న కార్యక్రమానికి రావడానికి ఇప్పుడు తీరిక దొరికిందా అని అడుగుతుంది. లోహిత తన మామయ్య కూతురే అని తెలిసి మధు షాక్ అయిపోతుంది. ఈ లోహిత నా మామయ్య కూతురు లోహితనా అని అంటుంది. లోహిత మధుని చూసి షాక్ అయిపోతుంది. ఇది డైరెక్ట్‌గా ఇంట్లోకి వచ్చేసింది.. నాన్న ఫొటో చూసేసింది.. నేనే లోహిత అని తెలిసిపోయింటుంది.. ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతుంది. లోహిత, మధు ఒకరిని ఒకరు చూసుకోవడం సరళ చూసి నీకు నా కూతురు ముందే తెలుసా అంటే మీ కంటే నాకు ఎక్కువ తెలుసు ఆంటీ తన గురించి అని అంటుంది. కవర్ చేయడానికి ఇద్దరం ఒకే కాలేజ్ కదా అని అంటుంది.
ఆబ్దికం తర్వాత మధు ఏడుస్తుంటే నువ్వేంటి అమ్మా ఏడుస్తున్నావ్ అని సరళ అడిగితే తన వాళ్లు గుర్తొచ్చినట్లు ఉన్నారు అని లోహిత అంటుంది. చందు మధుతో నువ్వు కూడా ఇక్కడే తినేసి వెళ్లాలి అంటాడు. మధు సరే అంటుంది. లోహిత ఇంట్లో అందరిని బయటకు పంపేసి మధుతో మాట్లాడుతుంది. నువ్వు చిన్ని అన్న విషయం నాకు తెలుసు అని అంటుంది. తెలుసా అని మధు షాక్ అయిపోతే తెలుసు ఎప్పుడో తెలుసు.. అంతే కాదు మ్యాడీనే మహి అని తెలుసు.. ఈ విషయం నీకు కూడా తెలుసు అనే విషయం కూడా నాకు తెలుసు అని లోహిత చెప్తుంది. మధు అలియాస్ చిన్ని షాక్ అయిపోతుంది. మరి అన్నీ తెలిసి నువ్వు నా మేనమామ కూతురు అని ఎందుకు చెప్పలేదు అని మధు అడుగుతుంది. ఎందుకు చెప్పాలి.. చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు అసహ్యం.. అని అంటుంది. నా ఖర్మ కాలి నువ్వు నేను ఒకే కాలేజ్‌లో చదువుతున్నాం.. నేను కోడలిగా వెళ్లిన ఇంట్లోకే నువ్వు కోడలిగా రావాలి అనుకుంటున్నావ్.. మరీ అంత షాక్ అవ్వకు.. నువ్వు మహిని ప్రేమిస్తున్నావ్ అని తెలుసు అంటుంది. చిన్ని బిత్తరపోతుంది. నా అత్తింటికి నువ్వు కూడా కోడలిగా వస్తే నేను ఊరుకోను.. నీ అడ్డు తొలగించుకుంటా అని అంటుంది.
చిన్న ఏడుస్తూ నీకు నేను ఏం అన్యాయం చేశాను లోహిత ఎందుకు నా మీద ఇంత పగ అంటే చిన్నప్పటి నుంచి నువ్వు, మీ నాన్న, మీ అమ్మ మాకు తీరని ద్రోహం చేశారు అని అంటుంది. మా కళ్ల ముందు నవ్వుతూ ఉండాల్సిన మా నాన్న అలా చనిపోవడానికి కారణం ఎవరు అని లోహిత అడిగితే ఆ దుర్మార్గురాలు గురించి ఎందుకు అంటూ సరళ ఎంట్రీ ఇస్తుంది. నా భర్త చావుకి నా ఆడపడుచు, దాని మొగుడు, దాని కూతురే కారణం.. అని ఏడుస్తుంది. నా ఆడపడుచు దాని మొగుడే నా భర్తని కత్తితో పొడిచి చంపేశాడు అని ఏడుస్తుంది. చందు వచ్చి మన విషయాలు తనకు ఎందుకు తనని బాధ పెట్టడం ఎందుకు అని అంటాడు.
మధు చందు వాళ్లతో కలిసి భోజనం చేస్తుంది. ఇక చందు పని మీద వచ్చా అన్నావ్ ఏంటి అని అడుగుతాడు. ఏం లేదు అని మధు వెళ్లిపోతుంది. లోహిత వెళ్లిపోతా అంటే నాకు అంత టైం లేదు అని లోహిత వెళ్లిపోతుంది. మధు కావేరి ఫొటో పట్టుకొని ఏడుస్తూ జరిగింది చెప్తుంది. స్వరూప, సుబ్బు అది చూసి మధు దగ్గరకు వెళ్తారు. ఏమైంది అమ్మా గతం గుర్తొచ్చిందా.. నువ్వు గతం గుర్తు చేసుకోవద్దు నీ భవిష్యత్‌కి మంచిది కాదు అని సుబ్బు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















