Chinni Serial Today November 13th Episode: చిన్ని సీరియల్: 30 రోజుల కండీషన్ గురించి తెలుసుకున్న వల్లీ! తప్పించుకున్న ఆఫ్ టికెట్!
Chinni Serial Today Episode November 13th బాలరాజుని తప్పించాలి అని ఆఫ్ టికెట్ ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత, వరుణ్‌లకు దేవేంద్రవర్మ ఇంటికి తీసుకొస్తాడు. లోహిత నాగవల్లి కాళ్ల మీద పడిపోతే నాగవల్లి ఇలాంటి ఓవర్ యాక్షన్ నా దగ్గర పనికిరాదు అని హెచ్చరిస్తుంది. మహి నాగవల్లి దగ్గరకు వెళ్లి బావ వాళ్లని ఇంట్లోకి రానిచ్చినందుకు థ్యాంక్స్ మమ్మీ అని చెప్పి సారీ చెప్తాడు. నాగవల్లిని నవ్విస్తాడు.
మధు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. మమ్మీ నీ చేతి వంట తిని చాలా రోజులు అయింది బాగా ఆకలిగా ఉంది వంట చేసేయ్ మమ్మీ ఓ పట్టు పడతా అని అంటాడు. ఆడవాళ్లు అంతా వంట చేయడానికి వెళ్తాడు. దేవాకి కూడా మహి థ్యాంక్స్ చెప్తాడు. నెల రోజుల్లో చిన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని దేవా అనుకుంటాడు.
మహి చిన్ని ఫొటోలు చూస్తూ వచ్చేశా చిన్ని మళ్లీ నేను మా ఇంటికి వచ్చేశా.. నా బెస్ట్ ఫ్రెండ్ మధు వల్ల ఇంటికి వచ్చేశా అని అనుకుంటాడు. మధు కూడా మహి వాళ్లు వెళ్లిపోయారా లేదా అని టెన్షన్ పడుతుంది. ఇక మహి ఇంకా 30 రోజులే ఉందని అనుకుంటాడు. ఇంతలో మధు మహికి కాల్ చేస్తుంది. మా అమ్మ హ్యాపీ అని మ్యాడీ చెప్పగానే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందని మధు అంటుంది. ఇక మధుతో మాట్లాడుతూ మ్యాడీ చిన్నిని చూసి రేపు కలుద్దాం మధు నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటాడు. సరే అని మధు అంటుంది.
లోహిత తనకు చాలా హ్యాపీగా ఉందని వరుణ్‌తో చెప్తుంది. మా అత్త కోపం తగ్గడం అంత ఈజీ కాదు లోహి ఇంట్లోకి రానిచ్చారు కదా అని కోపం పోయింది అనుకోకు అని అంటాడు. ఆంటీ కోపం నేను తగ్గిస్తా అని లోహి అంటే అది అంత ఈజీ కాదు అని శ్రేయ, వసంత వస్తారు. నువ్వే అత్త కోపం తగ్గించాలి అమ్మా అని వరుణ్ అంటాడు. లోహిత కూడా వసంత చేతులు పట్టుకొని మీరే ఎలా అయినా కోపం తగ్గించాలి ఆంటీ అంటే ఎవరే నీకు ఆంటీ అని వసంత కోప్పడుతుంది. ఎంతైనా తను నీ కోడలు ఇప్పుడు ఇలా అనొద్దు అని వరుణ్ అంటే కొడుకుని పెళ్లి చేసుకుంటే కోడలు అయిపోదురా అని వసంత అంటుంది.
లోహిత ఏడుస్తూ మేం ప్రేమ పెళ్లి అయితే చేసుకున్నాం కానీ సంతోషంగా లేం ఆంటీ.. మిమల్ని ఎంత బాధ పెట్టానో అని నేను ఎంత బాధ పడ్డానో మీకు తెలీదు అని ఇక నుంచి మా వల్ల మీకు ఏం బాధ లేకుండా చూసుకుంటా అని లోహిత వసంతని బుట్టలో వేసేస్తుంది. వరుణ్ తల్లితో వీళ్ల మమ్మీ డాడీ కూడా మమల్ని ఆశీర్వదించారు అని చెప్తాడు. కోపం బాధ అంత త్వరగా పోవురా కొంచెం టైం పడుతుంది అని వసంత అంటుంది. వీళ్ల మమ్మా డాడీని పిలిపిద్దామా అని వరుణ్ అంటే వసంత సరే అంటే లోహిత ఇక్కడ లేరు ఫారెన్ వెళ్లిపోయారు అని చెప్పి తప్పించుకుంటుంది.
రౌడీలు మందు తాగుతూ ఉంటే ఆఫ్ టికెట్ వాళ్ల కంట పడకుండా తప్పించుకొని బాలరాజుని తప్పిస్తాడు. అయితే బాలరాజు చాలా వీక్‌గా ఉండటంతో రోడ్డు మీద కూలబడిపోతాడు. రౌడీలు ఇద్దరూ తప్పించుకోవడం చూసి వెంటపడతారు. బాలరాజుని ఆఫ్ టికెట్ పిలిస్తే నేను రాలేనురా నువ్వు తప్పించుకొని చిన్నిని జాగ్రత్తగా చూసుకోరా అని ఆఫ్ టికెట్‌ని పంపేస్తాడు. బాలరాజుని రౌడీలు మళ్లీ తీసుకెళ్లిపోతారు. ఆఫ్ టికెట్ తప్పించుకుంటాడు.
దేవాకి విషయం తెలియగానే ఫైర్ అవుతాడు. ఇక దేవా దగ్గరకు నాగవల్లి వచ్చి నాకు నచ్చలేదు బావ వరుణ్ వాళ్లని ఇక్కడికి తీసుకురావడం నాకు నచ్చలేదు అని అంటుంది. దాంతో దేవా 30 రోజుల గడువు గురించి చెప్తాడు. లోహిత చాటుగా దేవా, వల్లీల మాటలు వింటుంది. లోహి షాక్ అయిపోతుంది. నాగవల్లి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఉదయం మ్యాడీ మధుని కలవడానికి రెడీ అవుతాడు. నాగవల్లి ఆ మాటలు విని తినేసి వెళ్లు అంటే లేదు మమ్మీ త్వరగా వెళ్లాలి అంటే నిన్నటి వరకు అక్కడే ఉన్నావ్ కదా మళ్లీ అంత త్వరగా వెళ్లాల్సిన పని ఏంటి అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















