Ammayi garu Serial Today November 12th:అమ్మాయి గారు సీరియల్: సూర్యప్రతాప్ లో మార్పు! విరూపాక్షి-రూపల ఆనందం, విజయాంబిక కుట్రలు!
Ammayi garu Serial Today Episode November 12th సూర్యప్రతాప్‌లో మార్పు వస్తుందని విజయాంబిక, దీపక్ కలిసి కుట్రలు పన్నడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ విరూపాక్షి గజ్జెల గురించి గొప్పగా చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు. సూర్యప్రతాప్‌లో మార్పు వస్తుందని రూప వాళ్లు సంతోషిస్తారు. విజయాంబిక కుళ్లుకుంటుంది. ఇంత విలువైన వాటిని నువ్వు పాడు చేస్తే మీ అమ్మమ్మ ఎంత బాధ పడుతుందో ఆలోచించవా అని సూర్యప్రతాప్ మనవడికి బుద్ధి చెప్తాడు.
బంటీ తాతయ్యకి సారీ చెప్తాడు. మీ అమ్మమ్మ చూడక ముందే వీటిని తన గదిలో పెట్టేయ్ అని సూర్యప్రతాప్ చెప్తాడు. సూర్యప్రతాప్ వెనక్కి తిరిగే సరికి విరూపాక్షి, రూప, రాజు, సుమ, చంద్ర అందరూ నవ్వుతూ ఉండటం చూస్తాడు. ఇక బంటీ విరూపాక్షికి గజ్జెలు ఇచ్చి సారీ చెప్తాడు. సూర్యప్రతాప్ సైలెంట్గా తన గదికి వెళ్లిపోతాడు. విరూపాక్షి చాలా చాలా సంతోషపడుతుంది. రూప , రాజులు విరూపాక్షి దగ్గరకు వెళ్లి నాన్న మారుతున్నాడు అమ్మా అని రూప అంటుంది. నాకు అదే నమ్మకం కుదిరింది అని విరూపాక్షి సంతోషం వ్యక్తం చేస్తుంది.
మందారం, సుమ వంట చేస్తూ ఉంటారు. సుమ మందారంతో బావగారు మారిపోయారు.. రూపని రాజు ప్రేమగా చూసుకుంటున్నాడు. దీపక్ కూడా మారిపోయాడు కదా ఇక మనకు అన్నీ మంచి రోజులే అని సుమ అంటే అందరికీ మంచి రోజులు వస్తాయి కానీ నాకు రావు అమ్మా దీపక్ బాబు మారడు అని అంటుంది. సమయం వస్తే అందరూ మారిపోతారు. ఓపికతో ఉండు అని సుమ ధైర్యం చెప్తుంది.
విజయాంబిక సూర్యప్రతాప్‌లో వచ్చిన మార్పును జీర్ణించుకోలేకపోతుంది. ఏదో ఒకటి చేయాలి అని కొడుకుతో అంటుంది. ఇంతలో కోమలి వచ్చి మీ వల్ల అనవసరంగా నేను ఇరుక్కుపోయాను.. ఆస్తి మొత్తం కొట్టేసి ఎవరి వాటి వాళ్లు తీసుకొని వెళ్లిపోవచ్చు అనుకుంటే మన ఆశలు అడియాశలు అయ్యాయి,, రూప నిజస్వరూపం బయట పడటం లేదు.. ఇక ఈ రోజుతో సూర్యప్రతాప్ గారు విరూపాక్షి కలిసిపోయేలా ఉన్నారని అర్థమైందని అంటుంది.
సూర్యప్రతాప్‌లో మార్పు రాదు అని తను అలా 25 ఏళ్లుగా ట్యూన్ చేస్తున్నాను అని విజయాంబిక అంటుంది. కోమలి దీపక్ వాళ్లతో నాకు నా లైఫ్ ముఖ్యం మిమల్నిఇంకా నమ్ముకొని ఉంటే నా బతుకు వేస్ట్ అయిపోతుంది. ఇంత వరకు మీరు చెప్పినట్లు చేసినందుకు డబ్బు ఇవ్వండి అని అంటుంది. విజయాంబిక మనసులో ఆస్తి రాగానే ముందు దీన్ని చంపేయాలి అనుకుంటుంది. పైకి మాత్రం మధ్యలో పని వదిలేయడం సరి కాదు అని అంటుంది. నువ్వు మధ్యలో వెళ్లిపోతే నా తమ్ముడి కూతురిగా ఉన్న నువ్వు అశోక్ని పెళ్లి చేసుకొని వెళ్లిపోతే నిన్ను నిలువునా చీరేస్తాడని విజయాంబిక అంటుంది.
మందారం వస్తే విజయాంబిక నువ్వేంటే నా కొడుకు గదిలోకి వచ్చావ్ ఈ గదిలోకి ఎందుకు వచ్చావ్ అని అంటుంది. నిజానికి ఇది మా గది.. ఈ వయసులో మీరు హాల్లో ఏం పడుకుంటారని నేను ఇక్కడ ఉండకుండా మిమల్ని ఉండనిచ్చా.. అని అంటుంది. విజయాంబిక మందారాన్ని కొట్టడానికి చేయి ఎత్తితే మందారం చేయి అడ్డు పెట్టి నా భర్త నన్ను కొడితే ఓకే మీకేం అధికారం ఉంది అని అంటుంది. పెద్దయ్యగారు అమ్మగారిలా మాది విడదీయరాని బంధం అవుతుంది చూస్తూ ఉండండి అని అంటుంది.
బంటీ చదువుతూ ఉంటాడు. రూపతో అమ్మ ఆకలేస్తుంది త్వరగా పాలు తీసుకురా అని గోల చేస్తాడు. బంటీ చదువుతున్న స్టోరీలో కాపురాలు కూల్చే కాకి అని వస్తుంది. అప్పుడే కోమలి రావడంతో బంటీ మనసులో కాకి ఇక్కడికి వచ్చిందని అనుకుంటాడు. కోమలిని చూస్తూ కాకి పావురం కథ చదువుతాడు. కోమలి రగిలిపోతుంది. రూప వచ్చి పాలు తాగు అని ఇస్తే కోమలిని చూసి ఈ కాకి ముఖం చూస్తూ తాగలేనమ్మా అని వేరే ప్లేస్కి వెళ్తాడు. విజయాంబిక కోమలి దగ్గరకు వచ్చి బంటీ మాటలు పట్టించుకోవద్దని అంటుంది. కోమలి బంటీ ఎదురుగా వచ్చి కూర్చొంటుంది. ఈ దెయ్యం నా ఎదురుగా కూర్చొంది అని కోపంగా చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















