Chinni Serial Today November 12th: చిన్ని సీరియల్: మధు, మ్యాడీల కన్నీటి వీడ్కోలు! నాగవల్లి వరుణ్, లోహితల్ని క్షమిస్తుందా!
Chinni Serial Today Episode November 12th మ్యాడీ, వరుణ్, లోహిత దేవేంద్ర వర్మతో ఇంటికి వెళ్లడం వరుణ్ వాళ్లని ఇంట్లో వాళ్లు అంగీకరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవేంద్రవర్మ మహి కోసం వరుణ్, లోహితల్ని అంగీకరిస్తాడు. మ్యాడీ లగేజ్ సర్దు కోవడానికి వెళ్లి బాధగా ఉంటాడు. మ్యాడీని పిలుస్తా అని మధు వెళ్తుంది. ఏంటి సార్ ఇంకా రెడీ అవడంలేదు అని మధు అంటే ఈ ఇంటిని వదిలి వెళ్లాలి అని లేదు మధు.. ఏం సంబంధం లేని నన్ను, వరుణ్‌వాళ్లని జాగ్రత్తగా చూసుకున్నారు.. మీ మంచితనం ఇవన్నీ మిమల్ని మిస్ అవుతున్నట్లు ఉంది అని అంటాడు.
మధు మనసులో నాకు మిస్ అవుతున్నట్లు ఉంది మ్యాడీ అనుకుంటూనే పైకి మాత్రం మనం ఏం శాశ్వతంగా విడిపోవడం లేదు కదా.. కాలేజ్‌లో కలుస్తాం.. మీ ఇంటికి మీ నాన్న భోజనానికి పిలిచారు వస్తూనే ఉంటాం కదా అని అంటుంది. ఇక మధుని మ్యాడీని కూడా ఇంటికి పిలిస్తే ఇప్పుడు వద్దు మ్యాడీ నేను వస్తే మీ అమ్మకి కోపం పెరిగిపోతుంది అని అంటుంది. ఇక మ్యాడీతో ఇంటికి వెళ్లగానే మీ అమ్మకి సారీ చెప్పి హగ్ చేసుకో ఇన్నిరోజులు ఆవిడ పడిన బాధ ఎగిరిపోతుంది.. అప్పుడు ఆవిడ నవ్వగానే నేను నీకు గుర్తు రావాలి అని అంటుంది. 
మ్యాడీ బయటకు వచ్చి మధు తల్లిదండ్రులతో ఇంత వరకు మమల్ని చూసుకున్నందుకు థ్యాంక్స్ అని అంటాడు. ఇప్పుడు నేను ఏదో ఒక డైలాగ్ కొట్టేస్తా అని మధు దగ్గరకు వెళ్లి హగ్ చేసుకొని అనవసరంగా మా విషయాల్లో దూరకు అని చెప్తుంది. 
మ్యాడీ చాలా బాధ పడతాడు. అందరూ మ్యాడీ వాళ్ల ఇంటికి వెళ్లిపోతారు. మధు చాలా బాధ పడుతుంది. మ్యాడీ వెళ్తుంటే మధు కన్నీరు పెట్టుకుంటుంది. తర్వాత గదిలోకి వెళ్లి అన్నీ గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మహి ఇచ్చిన పెళ్లి కొడుకు బొమ్మ పట్టుకొని మ్యాడీ ఇన్నేళ్లు నువ్వు మహిగా నాకు దూరంగా ఉన్నావ్,, ఇప్పుడు నువ్వు మహి అని తెలిశాక దూరం అయిపోవావ్,, ఈ దూరం ఎప్పటికీ దూరం కాదని నాకు తెలుసు.. నిన్ను మీఇంటికి చేర్చాను కాబట్టి ఇక నేనే చిన్ని అని నీకు చెప్పేస్తా అని అనుకుంటుంది. చంటి మధు దగ్గరకు వచ్చి అమెరికి అబ్బాయి వెళ్లిపోయాడు అని ఇంత ఫీలవుతున్నావ్ అంటే మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని అంటాడు. తర్వాత మధు బొమ్మని పట్టుకొని ఐలవ్‌యూ అని చెప్తుంది.
శ్రేయ మ్యాడీని చూసి అత్త మామయ్య మ్యాడీని తీసుకొని వచ్చాడని చెప్తుంది. నాగవల్లి చాలా సంబర పడిపోతుంది. మ్యాడీని హగ్ చేసుకుంటుంది. ఇక వరుణ్, లోహితల్ని చూసి షాక్ అయిపోతుంది. ఇద్దరూ లోపలికి వస్తుంటే ఆగండి అని అంటుంది. మా పరువు తీసిందే కాకుండా సిగ్గులేకుండా ఇంట్లోకి అడుగు పెడతారా అవుట్ గెట్ అవుట్ అని అంటుంది. దేవా నాగవల్లితో కూల్ వాళ్లని నేనే రమ్మని చెప్పాను అని అంటాడు. అన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు రానివ్వు అని అంటాడు.
వసంత కూడా వాళ్లకి లోపలికి వచ్చే అర్హత లేదు రావొద్దు అని అంటుంది. ప్రమీల కూడా వాళ్లని క్షమించను అని అంటుంది. వాళ్ల వల్లే ఎంతో గారాబంగా పెంచుకున్న నా కొడుకు దూరం అయిపోయాడు.. ఎవరు క్షమించినా నేను వాళ్లని క్షమించను అని అంటుంది నాగవల్లి.. మర్యాదగా వెళ్లిపోండి అని అంటుంది. వరుణ్ వాళ్లు వెళ్తుంటే దేవా ఆపుతాడు. నాగవల్లితో నేనేం చేసినా ముందు చూపుతో ఆలోచిస్తా అని నీకు తెలుసు తర్వాత అంతా వివరంగా చెప్తా ముందు వాళ్లని లోపలికి రమ్మని చెప్పు అనడంతో దేవా కళ్లు చూసిన నాగవల్లి సరే బావ నీ ఇష్టం అని అంటుంది. లోహిత తనని ఆశీర్వదించమని నాగవల్లి కాళ్లమీద పడితే ఇలాంటి ఓవర్ యాక్షన్స్ నా దగ్గర పనికి రావు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.



















