అన్వేషించండి

chinni serial today may 9th: చిన్ని సీరియల్: అదిరిపోయిన చిన్ని క్లైమాక్స్! చివరి ఎపిసోడ్‌లో ఇన్ని ట్విస్ట్‌లా! పార్ట్ 2 ఉందా!

chinni serial today episode may 9th దేవా అసలు నేరస్తుడు అని ఇంట్లో అందరూ తెలుసుకొని దేవాని అరెస్ట్ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode  ఎన్నో ట్విస్ట్‌లు రోజుకో మలుపులతో ఎంతో ఆసక్తికరంగా మారిన చిన్ని సీరియల్ నేటితో ముగియనుంది.. 581 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న చిన్ని సీరియల్ చివరి ఎపిసోడ్(582) ఈ రోజు ప్రసారం కానుంది.. చిన్నిని ముగిస్తున్న తరుణంలో గత వారం రోజులుగా కథను స్పీడప్ చేశారు. ఈ నేపథ్యంలోనే కావేరి కేసు విషయంలో మ్యాడీ, చందు ఒక్కటై దూసుకుపోతున్నారు.. నిన్నటి ఎపిసోడ్‌లో కావేరి ఫ్రెండ్ అయిన లాయర్‌ హరిని మ్యాడీ, చందు కాపాడతారు. అలాగే శ్రేయ మెడలో చందు తాళి కూడా కట్టేస్తాడు. చివరి ఎపిసోడ్‌లో ఏం జరిగింది.. సీరియల్‌ని ఎలా ముగించారో ఇప్పుడు తెలుసుకుందాం..

మ్యాడీ, చందు లాయర్‌ హరికి కలిసి కావేరి కేసు గురించి  మాట్లాడుతారు. మ్యాడీ లాయర్‌ హరితో చిన్ని వాళ్ల అమ్మ నిర్దోషి అనడానికి సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి అని బాలరాజు అంకుల్ చెప్పాడు అని మ్యాడీ అంటాడు. దాంతో లాయర్ హరి సాక్ష్యాలు ఉన్నాయి అని అందుకు సంబంధించి సాక్ష్యాలను తీసుకొచ్చి మ్యాడీకి ఇస్తాడు. మ్యాడీ  పెన్‌డ్రైవ్‌ని చూసి దీంతో అసలు హంతకులు ఎవరో తెలుస్తుంది అని అనుకుంటాడు. మరోవైపు వసంత శ్రేయని లగేజ్‌ని తీసుకొచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాం అని అందరికీ చెప్తుంది. దానికి నాగవల్లి వెళ్లిపోవాల్సింది నువ్వు కాదు.. ఈ చిన్ని ఇది ఇంట్లో అడుగు పెట్టి మనల్ని చంపుకొని తింటుంది. వీళ్ల అమ్మ మా అక్కని చంపేసింది.. దీన్ని అసలు ఎప్పుడో చంపేయాల్సింది అని నాగవల్లి అంటుంది. ఎప్పుడో చెప్పాను కదా దీన్ని చంపేస్తే అన్నీ ప్రాబ్లమ్స్ పోతాయి అని దేవా అంటాడు. మా అమ్మ నిర్దోషి అని నిరూపిస్తా.. కచ్చితంగా నిరూపిస్తా.. అందుకు కావాల్సిన సాక్ష్యాలు దొరికాయి మామయ్యగారు అని చిన్ని అంటుంది. దొంగ సాక్ష్యాలు సృష్టించావా అని దేవా అంటే దొంగ సాక్ష్యాలో దొర సాక్ష్యాలో తెలుస్తుంది.. మ్యాడీ వాళ్లు వాటిని తీసుకురావడానికి వెళ్లారు.. మ్యాడీ వాళ్లు లాయర్‌ అంకుల్‌ని కాపాడి,, సాక్ష్యాలు తీసుకొస్తున్నారు అని చిన్ని చెప్తుంది. 

దేవాకి భయం మొదలవుతుంది. ఇంతలో మ్యాడీ, చందు వస్తారు. మ్యాడీ తండ్రికి కోపంగా చూస్తే ఏంటి నాన్న అలా చూస్తున్నావ్ ఏమైంది అని దేవా అడిగితే జ్ఞానోదయం అయింది.. నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలిసింది.. మంచితనం ముసుగులో నాటకాలు ఆడుతుంది ఎవరో.. ఆ నాటకాలకు బలైపోయింది ఎవరో తెలిసింది అని అంటాడు. అందరూ వినండి చనిపోయిన మా అమ్మ మీద ప్రమాణం వేసి చెప్తున్నా మా అమ్మని చంపింది చిన్న వాళ్ల అమ్మ కాదు.. నన్ను కనకపోయినా.. నవమాసాలు మోయకపోయినా.. కన్నతల్లి కంటే ఎక్కువ ప్రేమగా పెంచి పెద్ద చేసిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా చిన్ని వాళ్ల అమ్మ నిర్దోషి.. తల్లి మర్డర్ మిస్టరీనీ చేధించగల నా లాంటి కొడుకును కన్న మా డాడీ మీద ప్రమాణం చేసి చేసి చెప్తున్న చిన్ని వాళ్ల అమ్మ చేయని నేరానికి శిక్ష అనుభవించిన నిర్దోషి అని అంటాడు. 

డాడీ అసలు దోషి ఎవరో మీకు తెలీదా.. మా అమ్మని అతి దారుణంగా చంపేసిన ఆ దుర్మార్గుడు ఎవరో మీకు తెలీదా అని మ్యాడీ అడుగుతాడు. నాకు తెలీదు అని దేవా అంటే నిజంగా తెలీదా ఇప్పుడు తెలుస్తుంది. అసలు హంతకుడు ఎవడో మీతో పాటు అందరికీ తెలుస్తుంది అని పెన్‌డ్రైవ్‌తో తెలుస్తుందని అంటాడు. ఈ పెన్‌ డ్రైవ్‌తో కోర్టుకు వెళ్తున్న కావేరి ఆంటీని ఆ హంతకుడు చంపేశాడు.. అప్పుడు కింద పడిపోయిన ఈ పెన్‌డ్రైవ్ లాయర్ అంకుల్‌కి దొరికింది అని మ్యాడీ చెప్తాడు. తర్వాత ల్యాప్‌టాప్‌లో పెన్‌డ్రైవ్‌ పెట్టి అందరికీ చూపిస్తాడు. అందులో పార్వతి ఏడుస్తూ దేవా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనుకున్నా కానీ నా ఆస్తి కోసం అని ఈ మధ్యే అర్థమైంది.. సాక్ష్యం లేకుండా ఆ దేవా ఎన్ని దుర్మార్గాలు చేశాడో తెలిసింది.. ఆ రాక్షసుడి వల్ల నా ప్రాణానికి.. కావేరి మానానికి ప్రమాదం పొంచి ఉంది.. అని చెప్తుంది. తర్వాత దేవా పార్వతికి పాలు ఇచ్చి అందులో విషం కలిపి పార్వతిని చంపేయడం.. అక్క అంటూ కావేరి వచ్చి బంగారం లాంటి భార్యని చంపేస్తావా నీ పని పోలీసులకు చెప్తా ఉండు అని కావేరి అనడం ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. 

నాగవల్లి దేవాని కోపంగా చూస్తుంది. ఇప్పుడు తెలిసిందా డాడీ హంతకుడు ఎవడో.. ఇప్పుడు తెలిసిందా.. కావేరి ఆంటీ హంతకురాలు కాదు అని.. ఇప్పుడు తెలిసిందా చిన్ని హంతకురాలి కూతురు కాదు అని.. నేను ఓ హంతకుడి కొడుకుని.. నీ కొడుకుగా పుట్టినందుకు సిగ్గు పడుతున్నా.. ఇంతకాలం మిమల్ని డాడీ డాడీ అని పిలిచినందుకు సిగ్గు పడుతున్నా.. కానీ మీ నిజస్వరూపం బయట పెట్టినందుకు పార్వతి కొడుకుగా గర్వపడుతున్నా.. కావేరి ఆంటీ అల్లుడిగా గర్వపడుతున్నా.. చిన్ని భర్తగా గర్వపడుతున్నా అని అంటాడు. చిన్ని ఏడుస్తూ మీరు చేసిన నేరానికి మా అమ్మ శిక్ష అనుభవించింది.. మీరు చేసిన పాపానికి  మా అమ్మ జైలు పాలు అయింది.. మీరు చేసిన ద్రోహానికి నా జీవితం జైలు పాలు అయింది.. మీరు చేసిన కుట్రకి మా నాన్న జీవితం జైలు పాలు అయింది అని అంటుంది. ఇంతలో బాలరాజు అక్కడికి రావడంతో చిన్ని తండ్రిని హత్తుకొని ఏడుస్తుంది. నేను అమ్మానాన్న హాయిగా బతకాల్సిన వాళ్లం మీ వల్ల ముగ్గురం జైలు పాలు అయ్యాం. మీరు ఇప్పుడు శిక్ష అనుభవించక తప్పదు అని అంటుంది. వీడి నా ప్రాణ స్నేహితుడు అనుకొని వీడి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అయ్యాను. వీడి కోసం నా భార్యని జైలు పాలు చేశాను.. మీ మామయ్యని చంపి ఆ నేరం నా మీద వేశాడు.. ఇంత కాలానికి వీడి పాపం పండింది అని బాలరాజు అంటాడు.

నాగవల్లి చాలా కోపంగా నువ్వు అసలు మనిషివేనా.. కడుపునకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా.. ఆస్తి కోసం కట్టుకున్న భార్యని చంపేస్తావా.. నువ్వేదో మహానుభావుడు అనుకున్నాను.. నువ్వు రెండో పెళ్లి చేసుకోకపోతే మంచోడు అనుకున్నా.. మ్యాడీ అనాథ అయిపోతాడు అని నేను నిన్ను పెళ్లి చేసుకున్నా.. నీ మాట విని కావేరి, సత్యం బాబు చావులకి నేను కారణం అయ్యాను.. నీలాంటి వాడు బతికుండకూడదు అని ఏడుస్తుంది. దేవా కాలర్ పట్టుకొని నిలదీస్తుంటే చిన్ని ఆపి ఇలాంటి దుర్మార్గుడిని చంపి మీరు బాధ పడొద్దు.. మ్యాడీ పోలీసులకు చెప్పాడు అని అంటుంది. ఇంతలో పోలీసులు వచ్చి దేవాని అరెస్ట్ చేస్తారు.  

నాగవల్లి చిన్ని, బాలరాజులకు సారీ చెప్తుంది. ఇక మ్యాడీ చందుని తీసుకెళ్లి సత్యంబాబు కొడుకు మమ్మీ అని చెప్పడంతో అవునా మీ నాన్నని మేమం  దూరం చేసి తప్పు చేశాం అందుకే నువ్వు మా శ్రేయని పెళ్లి చేసుకున్నట్లు ఆ దేవుడు చేశాడు అని శ్రేయ, చందులను కలుపుతుంది. ఈ అమాయకురాలిని నీ చేతిలో పెడుతున్నా జాగ్రత్తగా చూసుకో బాబు అని అంటుంది. ఇంతలో లోహిత నాగవల్లి కాళ్ల మీద పడి క్షమాపణలు అడుగుతుంది. అంత తప్పు నువ్వేం చేశాం అని అంటే లోహిత మొత్తం చెప్పేస్తుంది. మొత్తానికి అందరూ ఒక్కటై సంతోషంగా కలిసిమెలసి ఉంటారు. దీంతో చిన్ని సీరయల్‌కి శుభం కార్డు పడిపోతుంది. 

మరిన్ని ఆసక్తికరమైన సీరియల్స్‌, నటుల వ్యక్తిగత జీవితాలు, మరిన్ని సంగతల కోసం తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 21th: యువరాజుపై చేయిచేసుకున్న నిషిక...భార్య చెంప పగులగొట్టిన యువరాజు
జగద్ధాత్రి సీరియల్: యువరాజుపై చేయిచేసుకున్న నిషిక...భార్య చెంప పగులగొట్టిన యువరాజు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సొంత ఇంటికి చేరుకున్న క్రిష్! అక్కతో ఆటలు.. నానమ్మ గోరుముద్దలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సొంత ఇంటికి చేరుకున్న క్రిష్! అక్కతో ఆటలు.. నానమ్మ గోరుముద్దలు!
Godavari Serial Today July 21st: 'గోదావరి' సీరియల్: దుకాణంలో నందుతో దుకాణం పెట్టేసిన మురళీ! సీన్ అదుర్స్! గోదారమ్మాయిని వదిలేసిన పడవబ్బాయ్!
'గోదావరి' సీరియల్: దుకాణంలో నందుతో దుకాణం పెట్టేసిన మురళీ! సీన్ అదుర్స్! గోదారమ్మాయిని వదిలేసిన పడవబ్బాయ్!
Nindu Manasulu Serial Today July 21st: నిండు మనసులు: ఈశ్వరి మృతి.. గుండెపగిలేలా ఏడుస్తున్న గణ..! అన్నని చూసి ఏడ్చేసిన ప్రేరణ!
నిండు మనసులు: ఈశ్వరి మృతి.. గుండెపగిలేలా ఏడుస్తున్న గణ..! అన్నని చూసి ఏడ్చేసిన ప్రేరణ!
Advertisement

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget