అన్వేషించండి

Chinni Serial Today February 9th: చిన్ని సీరియల్: బాలరాజుని మ్యాడీ చూసేస్తాడా! తండ్రి నిజస్వరూపం తెలిసిపోయిందా! అసలు ట్విస్ట్ ఇదే!

Chinni Serial Today Episode బాలరాజుని దాచిపెట్టిన చోటుకి తిలక్ మ్యాడీని తీసుకెళ్లడం మ్యాడీ అక్కడ దేవాని చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today February 9th Episode దేవా బాలరాజుని ఎక్కడ దాచి పెట్టాడో ఆఫ్ టికెట్‌కి తెలిసిపోతుంది. ఆ లొకేషన్‌ని ఆఫ్ టికెట్ సేవ్ చేసుకుంటాడు. ఇక  మ్యాడీ రౌడీని తరుముకుంటూ వస్తాడు. ఇంతలో తిలక్ ఎదురు పడి ఏమైంది అంత కంగారుగా పరుగులు పెడుతున్నావ్ అని అడుగుతాడు. మధుని కిడ్నాప్ చేసిన  వాడిని పట్టుకోవాలని వచ్చా పారిపోయాడు అని చెప్తాడు. ఆ రౌడీ మీ నాన్న మనిషే కదా అంత తేలికగా దొరకడు అని తిలక్ అంటాడు. 

మ్యాడీ షాకింగ్‌గా చూస్తే తిలక్ ఏంటి బాబు అలా చూస్తావ్.. మధుని కిడ్నాప్ చేసింది మీ నాన్న అయితే ఆ మనిషి కూడా మీ నాన్నకి చెందిన వాడే అయింటాడు అని తిలక్ అంటాడు. మ్యాడీ తిలక్ కాలర్ పట్టుకొని మా నాన్నని ఇంకోసారి అలా అంటే ఊరుకోనని చెప్తాడు. ఇంతలో ఆఫ్ టికెట్ తిలక్‌కి బాలరాజు ఉన్నలొకేషన్ పంపిస్తాడు. మ్యాడీబాబుని ఆ లొకేషన్‌కి తీసుకెళ్తే బాలరాజు గురించి దేవా గురించి మ్యాడీకి తెలుస్తుందని అనుకొని మ్యాడీని కూడా రమ్మని పిలుస్తాడు. ఆ లొకేషన్‌లో మధు ఉంది.. అక్కడికి వస్తే మీ నాన్న నిజస్వరూపం తెలుస్తుందని అంటాడు. మ్యాడీ సరే అనడంతో ఇద్దరూ కలిసి లొకేషన్‌కి బయల్దేరుతారు. 

బాలరాజుతో దేవా ఇప్పటి వరకు నిన్నూ నీ కూతురికి కలిపి ఒకే సారి చంపాలి అనుకున్నా,, కానీ ముందే నిన్ను చంపాల్సి వస్తుందేమో.. నీ కూతురు దొరికినట్లే దొరికి తప్పించుకుంది.. ఈ సారి మాత్రం అలా జరగదు.. దొరికిన చోటే దాన్ని నరికి చంపేస్తా అని దేవా బాలరాజుతో చెప్తాడు. ఇంతలో తిలక్, మ్యాడీ లొకేషన్‌కి వస్తారు. దేవా కూడా బయటకు వెళ్తుంటే మ్యాడీ, తిలక్‌ ఎదురు పడతారు. ఒకరిని ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని దేవా అడిగితే మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు డాడీ అని మ్యాడీ అంటాడు. లోపలికి వెళ్లి చూస్తే మీరు తప్పు చేయలేదు అని ఆయనకు అర్థమైపోతుంది. వెళ్లి చూద్దాం అని అంటాడు మ్యాడీ. తిలక్ మ్యాడీని తీసుకొని లోపలికి వెళ్తాడు. మ్యాడీకి బాలరాజు మొత్తం చెప్పేస్తే ఏంటి పరిస్థితి అని దేవా అనుకుంటాడు. ఇక అందరూ లోపలికి వెళ్లి చూసే సరికి అక్కడ బాలరాజు ఉండడు. బాలరాజు ఏమయ్యాడు ఆఫ్ టికెట్ తీసుకెళ్లాడా అని దేవా అనుకుంటాడు. 

తిలక్ దేవాతో బాలరాజు ఎక్కడా అని అడుగుతాడు. బాలరాజు గురించి నాకు ఏం తెలుసు అని దేవా అంటాడు. బాలరాజు ఏంటి ఇక్కడ మధు ఉందని చెప్పారు కదా ఇప్పుడు బాలరాజు అంటున్నారు ఏంటి అని మ్యాడీ అడుగుతాడు. అలా చెప్తే కానీ నువ్వు రావని అలా చెప్పాను అని తిలక్ అంటాడు. మీరు చెప్పే ప్రతీది అబద్ధం.. రాజకీయంగా ఆయన్ను దెబ్బ తీయలేక ఇలా చేశారు అని అంటాడు. కాదు బాబు అని తిలక్ మ్యాడీని తీసుకొని మొత్తం వెతుకుతాడు. ఇంతలో ఓ గదిలో నాగవల్లి కూర్చొని ఉంటుంది. అందరూ నాగవల్లిని చూసి షాక్ అయిపోతారు. నాగవల్లి మ్యాడీతో నువ్వేంటి నాన్న ఇక్కడికి వచ్చావ్.. నాకు తెలుసు నాన్న.. నేను డాడీ  ఈ పాత ఇళ్లు కొని కొత్తగా మార్చాలని అనుకున్నాం అని తెలిసి వచ్చావ్ కదా అంటుంది. లేదు మమ్మీ ఈయన బాలరాజు ఇక్కడ ఉన్నాడు అని నన్ను తీసుకొచ్చాడని అంటాడు. చూడండి తిలక్ గారు మీకు ఈ మధ్య మతి భ్రమించినట్లు ఉంది.. మంచి డాక్టర్‌ని చూపించుకోండి అని అంటుంది. 

మ్యాడీ కూడా తిలక్‌కి వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి నా తల్లిదండ్రుల జోలికి వస్తే ఊరుకోనని చెప్తాడు. ఇప్పుడు వెళ్లాను కానీ త్వరలోనే ఎవరు ఎలాంటి వాళ్లో నీకు తెలిసేలా చేస్తా అని అంటాడు. ఇక మ్యాడీని తన మనిషితో దేవా ఇంటి దగ్గర డ్రాప్ చేయిస్తాడు. దేవా నాగవల్లితో బాలరాజు ఎక్కడ అని అంటే పక్కగదిలో ఉన్నట్లు చూపిస్తుంది. తిలక్, మ్యాడీ వస్తారని నీకు ఎలా తెలుసు.. ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావ్ అని అడుగుతాడు. ఆఫ్ టికెట్‌ నీకు పెట్టిన మెసేజ్‌లు వల్ల ఒక్కడే ఏం చేయలేదు అని తిలక్ వెనక ఉంటాడని అర్థమైంది.. మొత్తం చెప్తుంది. ఇక బాలరాజుని కూడా ఓ ప్లేస్‌లో ఉంచడానికి ఏర్పాట్లు చేశానని అంటుంది. నాగవల్లి వాళ్లు నన్ను ఎక్కడకు పంపిస్తారో ఏంటో. అలా చేస్తే ఆఫ్ టికెట్ చిన్నిని కాపాడుకోగలడా అని బాలరాజు అనుకుంటాడు. 

స్వరూప, సుబ్బారావు నాగవల్లి వాళ్ల ఇంటికి వస్తారు. మధు ఆచూకి మాకు తెలీదు అని దేవా అంటే మీకు తెలుసుంటుందని వచ్చాం అని అంటారు. మాకు ఎలా తెలుస్తుందని నాగవల్లి అంటే మధు మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు కదా మీరు ఏమైనా మా అమ్మాయిని కిడ్నాప్ చేశారా అని అడిగితే దేవా, నాగవల్లి ఇద్దరూ స్వరూప, సుబ్బుల మీద సీరియస్ అవుతారు. ఇంట్లో అందరూ స్వరూప, సుబ్బుల మీద సీరియస్ అవుతారు. మామయ్యని ఎవరు ఒక్క చిన్ని మాట అన్నా నేను ఊరుకోను.. కానీ వాళ్లు కూతురు తప్పిపోయిన బాధలో ఉండి అంటున్నారని వరుణ్ అంటాడు. మాకు కూడా కోడలు కనిపించడం లేదు అని బాధ ఉంది.. అలా అని మీరు మా కోడల్ని కిడ్నాప్ చేశారని అన్నామా అని అంటారు. ఇద్దరూ సారీ చెప్పినా ఇంత అవమానించి క్షమాపణ ఎందుకు అని నాగవల్లి అంటుంది. ఇక మ్యాడీ రావడంతో విషయం లోహిత, శ్రేయ చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget