Chinni Serial Today February 21st: చిన్ని సీరియల్: చిన్నిని అసహ్యించుకున్నా మ్యాడీ! బొమ్మ విసిరి కొట్టేశాడుగా!
Chinni Serial Today Episode February 21st చిన్ని గుర్తుగా ఉన్న బొమ్మని మ్యాడీ విసిరికొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు లోహితకు వార్నింగ్ ఇస్తుంది. నీకు బుద్ధి లేదు కాబట్టే నాతో మ్యాడీ క్లోజ్‌గా ఉంటే చూడలేకపోతున్నావ్.. ప్రేమికుల రోజున మ్యాడీ నాకు ప్రపోజ్ చేయడం చూసి ఏమైపోతావో అని అంటుంది. మ్యాడీకి నువ్వే చిన్ని అని తెలిస్తే గెంటేస్తాడు అని లోహిత అంటే నేనే చిన్ని అని తెలిసినా మ్యాడీ నన్ను ప్రేమించేలా చేస్తా చూస్తూ ఉండు అని లోహితకు చెప్తుంది. అలా ఎప్పటికీ జరగకూడదు.. మ్యాడీ చిన్నిని క్షమించకూడదు అని లోహిత అనుకుంటుంది.
మధుని చంపలేకపోయినా కిల్లర్‌ని దేవా కలిసి మధుని చంపనందుకు కొడతాడు. నాయక్‌తో కొంచెం టైం తీసుకొని మధుని లేపేయమని అంటాడు. లోహిత వరుణ్ దగ్గరకు వెళ్లి మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కానీ ప్రేమికుల రోజు సెలబ్రేషన్స్ ఏం లేవు.. నువ్వు నా కోసం ఏం చేయడం లేదు అని గొడవ పడుతుంది. నువ్వు కూడా నా కోసం ఏం చేయడం లేదు అంటే నీకు కూడా నేను అంటే ప్రేమ లేదు కదా అని వరుణ్ అంటాడు. మ్యాడీ గురించి మధు ఆలోచిస్తూ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నా నేను చిన్ని అవ్వడం వల్ల నీకు ఆ నిజం చెప్పకపోవడం వల్ల మనస్ఫూర్తిగా నీ ప్రేమని ఆస్వాదించలేకపోతున్నా నేను చిన్ని అని నీకు చెప్పేయాలి అని అనుకుంటుంది. ఇంతలో మ్యాడీ అక్కడికి వస్తాడు. మధుకి బట్టలు ఇచ్చి రేపు వేసుకోమని అంటాడు. మధు మ్యాడీకి ఎలా అయినా నిజం చెప్పాలి అనుకుంటుంది.
మ్యాడీకి విషయం ఎలా చెప్పాలి అని మధు ప్రాక్టీస్ చేస్తుంటే నాగవల్లి వస్తుంది. మధు షాక్ అయితే నువ్వేం కంగారు పడకు మ్యాడీ వినలేదులే అని నాగవల్లి అంటుంది. ఎప్పుడూ ఇలాగే నువ్వు టెన్షన్ పడాలి అని నాగవల్లి అంటుంది. పెద్ద నిజాయితీ పరురాలిలా నిజం చెప్పావ్ కదా.. నిజానికి నువ్వు ఇప్పుడు ఈ నిజం చెప్పంది నిజాయితీతో కాదు భయంతో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో మ్యాడీని మాయచేయాలి అనుకుంటున్నావ్ అని నాగవల్లి అంటుంది. అలా ఏం కాదు మ్యాడీ మందు చిన్నిలా నేను గెలిస్తే మీతో చేసిన ఛాలెంజ్‌లో గెలవడం పెద్ద విషయం కాదు అని మధు అంటే నువ్వు ఓడిపోతావ్ ఓడిపోవడానికి రెడీగా ఉండు అని నాగవల్లి అంటుంది.
మధు, మ్యాడీ ముద్దు పెట్టుకొని తీసుకున్న సెల్ఫీ గుర్తు చేసుకొని నాగవల్లి ఇరిటేట్ అవుతుంది. లోహిత శ్రేయతో చిన్నికి సంబంధించి వస్తువులు ఏమైనా ఇంట్లో ఉన్నాయా అని అడిగితే పెళ్లి కూతురు బొమ్మ ఉందని చెప్తుంది. అది చాలు నేను చాలా చేస్తా అని లోహిత అంటుంది. లోహిత పెళ్లి కూతురు బొమ్మ తీసుకొని దాన్ని మ్యాడీ చూసేలా హాల్‌లో పెట్టాలి అనుకుంటుంది. ఇంతలో లోహిత తన గదిలో పెళ్లి కూతురు బొమ్మ తీయడం చూసిన మ్యాడీ లోహిత మీద అరుస్తాడు. ఎందుకు ఆ బొమ్మ తీశావ్ అని అడుగుతాడు. మధు కోసం ఈ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని అనిపించి నీకు ఇద్దామని తీశా అంటుంది. మ్యాడీ ఆ బొమ్మ లాక్కొని కిందకి విసిరి కొడతాడు. అందరూ షాక్ అయిపోతారు. మధు ఏడుస్తుంది. అది చిన్నికి సంబంధించిన బొమ్మ తనకు చెందినవి ఏవీ ఉండకూడదు. ఇక ఈ ఇంట్లో ఎవరూ చిన్ని గురించి మాట్లాడకూడదు.. చిన్ని అనే పేరు వింటేనే నాకు అసహ్యం అని అంటాడు. చిన్ని నీకు నిజాలు చెప్పాలి అనుకుంటుందని నాగవల్లి అంటే తన వైపు తప్పు ఉంది కాబట్టే ఇన్ని రోజులు చెప్పకుండా ఆగింది.. తను నన్ను చీట్ చేసింది అని మ్యాడీ అంటాడు. లోహిత డ్యాన్స్‌లు వేస్తుంది. మధు వెళ్లి మనం మేనత్త మేనమామల పిల్లలం ఒకరి మంచి ఒకరు కోరుకోవాలి.. కానీ నువ్వు నా చెడు కోరుకుంటున్నావ్.. నేను తలచుకుంటే నీ జీవితం నాశనం చేయడం ఒక్క క్షణంలో జరిగే పని.. అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























