Nindu Noorella Saavasam Serial Today February 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరికి షాక్ ఇవ్వనున్న భాగీ – అయోమయంలో చంభా
Nindu Noorella Saavasam serial Today Episode February 21st: గుడి దగ్గర భాగీ నాటకం ఆడుతూ మనోహరిని మభ్యపెడుతుంది భాగీ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: తన వెనకాలే వచ్చిన మనోహరిని చూసి భాగీ నాటకం మొదలు పెడుతుంది. గట్టిగా ఏడుస్తున్నట్టు నటిస్తుంది. కరుణ షాక్ అవుతుంది. ఏందే ఏమైంది అంటూ అడగ్గానే.. ఏం లేదు నువ్వు చూస్తూ ఉండు అంటూ హఠాత్తుగా వెళ్లి మనోహరిని హగ్ చేసుకుంటుంది.
చంభా: ( మనసులో) ఇదేంటి భాగీ, మనోహరి చెంప చెల్లుమనిపిస్తుంది అనుకుంటే ఇలా చేస్తుందేంటి
మనోహరి: భాగీ ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లిపోయావు భాగీ
భాగీ: కనీసం నువ్వైనా అడిగావు చాలా థాంక్స్ మనోహరి. నేను చెప్తున్నా ఆయన వినకుండా వెళ్లిపోయారు
మనోహరి: నువ్వు అలా వెళ్లిపోయినందుకు అమర్‌కు కోపం వచ్చింది. అసలు ఏం జరిగింది భాగీ
భాగీ: నా కూతురు వల్ల అమ్ముకు ప్రాణగండం ఉందని పంతులు గారు చెప్పారు. అందుకే అమ్ము కోసం బుజ్జమ్మను తీసుకుని దూరంగా వెళ్లిపోయాను
మనోహరి: ఓహో నువ్వు వెళ్లక ముందు అమ్ముపై రెండు మూడు సార్లు దాడి జరిగింది అందుకేనా..?
భాగీ: మేము దగ్గర ఉంటే అమ్ముకు అపాయం అని దూరంగా వెళ్లిపోయాము
మను: మరి ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చావు..
భాగీ: ఆయన్ని పిల్లలను చూద్దామని వచ్చాను. పైగా ఆ జాతకం ప్రభావం తగ్గిపోయి ఉంటుంది అనుకున్నాను. కానీ ఆ జాతక ప్రభావం అమ్ము నుంచి బుజ్జమ్మకు షిప్ట్ అయింది
మనోహరి: మొన్న స్కూల్ లో బుజ్జమ్మ మీద అటాక్ జరిగింది అందుకేనా..?
భాగీ: అవును బుజ్జమ్మ నీకు తెలుసా..?
మనోహరి: అది కరుణ చెప్పింది. నేను కూడా నిన్ను చూడాలని చాలా ట్రై చేశాను. ఈరోజుకు ఇలా కుదిరి ఇక్కడ కలిశాము. నీ పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు భాగీ
భాగీ: సాటి ఆడదానికిగా నా పరిస్థితి చాలా బాగా అర్థం చేసుకున్నావు మనోహరి
చంబా: ఎక్కడో తేడా కొడుతుందే.. భాగీ క్యారెక్టర్ ఇది కాదే..?
భాగీ: ఎలా ఉన్నావు యాదమ్మ
చంభా: సారీ మేడం.. మనోహరి మేడం మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు అని నేను మాట్లాడలేదు. మీరు ఎలా ఉన్నారు మేడం.. పాప ఎలా ఉంది..?
భాగీ: ఏదో ఉన్నాం యాదమ్మ ఇన్నాళ్లు మా అక్క పిల్లలను చూసుకున్నందుకు చాలా థాంక్స్
చంభా: పిల్లలను చూసుకుంది నేను కాదు మేడం మనోహరి మేడం గారు
భాగీ: అవునా మనోహరి.. నా స్థానంలో ఉండి పిల్లలన్ని నువ్వు చూసుకున్నావా..? అసలు నా స్థానంలో ఉండాల్సింది నువ్వే తెలుసా.? మా అక్క చనిపోయాక ఆయనకు నువ్వు భార్యవి కావాల్సింది. అనవసరంగా నేను అడ్డు అయ్యాను. ఆ పాపమే నాకు నా కూతురుకు తగిలినట్టు ఉంది.
మనోహరి: భాగీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుననావు..
భాగీ: చెయ్యడానికి ఏముంది. ఆయనకు పిల్లలకు నేను నా కూతురు దూరంగా ఉండటం తప్పా వేరే దారే లేదు..
మనోహరి: అంటే మళ్లీ నీ కూతురును తీసుకుని దూరంగా వెళ్లిపోతావా..?
భాగీ: వెళ్లాలి కదా మనోహరి. లేదంటే అమ్ముకు నా కూతురుకు ప్రమాదం కదా..? కాకపోతే ఒక్కటే బాధ
మనోహరి: ఏంటా బాధ
భాగీ ఏడుస్తున్నట్టు నటిస్తూ.. ఆయనకు ఇక తోడు కావాలి.. ఆ తోడు నువ్వే కావాలి.. ఆయనకు పిల్లలకు నువ్వే అన్నై చూసుకోవాలి మనోహరి అంటూ భూమి చెప్పగానే.. మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!























