Illu Illalu Pillalu Serial Today February 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సాగర్ చేసిన తప్పు, నర్మద రియాక్షన్.. ధీరజ్ పరిస్థితి ఏంటి?
Illu Illalu Pillalu Serial Today Episode February 21st సాగర్‌కి రామరాజు 20 లక్షలు గురించి అడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మదకు సాగర్ 20 లక్షలు బ్యాంక్ నుంచి తీసిన విషయం తెలిసిపోతుంది. 20 లక్షలు ఏం చేశావ్ అని సాగర్‌ని ప్రశ్నిస్తుంది. సాగర్ విషయం చెప్పకపోవడంతో నర్మద తన మీద ఒట్టు వేసి విషయం అడుగుతుంది. దాంతో సాగర్ లంచం ఇచ్చి జాబ్ కొన్నాను అని చెప్పడంతో నర్మద సాగర్‌ని లాగిపెట్టి కడుతుంది. వనజ వాళ్లు ఇచ్చిన డబ్బు ముట్టుకోవడానికి సిగ్గు లేదా.. నువ్వు చేసిన పనికి నువ్వు ముఖం మీద ఉమ్మేసుకోవాలి.. మరోసారి పరువు పోతే మీ నాన్న ప్రాణాలతో ఉంటారా.. ఆ మాత్రం తెలీదా.. లంచం ఇవ్వడమే తప్పు అలాంటిది పరాయి వాళ్ల డబ్బు ఎలా ముట్టుకుంటావ్ సిగ్గు లేదా అని తిడుతుంది.
నర్మద ఎన్ని అడిగినా సాగర్ అలా ఉండిపోతాడు. ఇంకొక్క క్షణం కూడా ఇలా ఉండను అని నర్మద బట్టలు సర్దేస్తుంది. సాగర్ నర్మదని బతిమాలుతాడు. నువ్వు గుమ్మం దాటితే ప్రాణాలు తీసుకుంటా అని అంటాడు. బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని నర్మద అంటే నాన్నకి డబ్బు ఎలా ఇవ్వాలో తెలీక భయపడుతున్నా.. ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్లిపోతే నేను ఏమైపోతాను.. ఈ సమస్యల నుంచి బయట పడటానికి నాకు చావు తప్ప ఇంకేం పరిష్కారం ఉంది అని అడుగుతాడు. నర్మద కాలు పట్టుకొని నువ్వు గుమ్మం దాటితే నా ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో దారి లేదు.. దయచేసి నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను ఈ గండం నుంచి తప్పించు నర్మద అని చేతులెత్తి మొక్కుతాడు. నర్మద కూడా ఏడుస్తుంది.
హాస్పిటల్ ఎమర్జెన్సీ అని చెప్పడంతో ధీరజ్ తన ఫ్రెండ్స్‌కి కారు ఇస్తాడు. కానీ అతని ఫ్రెండ్స్ ఎంజాయ్ కోసం కారు తీసుకుంటారు. ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫోన్లు తీయడం లేదని ధీరజ్ చాలా కంగారు పడతాడు. ఇద్దరూ పోన్లు స్విఛ్ ఆప్ చేస్తారు. ఓనర్ కాల్ చేస్తే ఏం చేయాలో తెలీక ధీరజ్ చాలా టెన్షన్ పడతాడు. ఇంతలో ప్రేమ వచ్చి ఏమైందని అడిగితే ధీరజ్ విషయం చెప్తాడు. ఆ కిషోర్ గాడు ఎంజాయ్ కోసం కారు తీసుకున్నాడని ఇప్పుడు అర్థమైందని అంటాడు. గుండె దడగా ఉందిరా అని ప్రేమ అంటే ఏదీ చూస్తా అని మీద చేయి వేయబోతే ప్రేమ వద్దని వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అంటుంది. ధీరజ్, ప్రేమలు ఒకరికి ఒకరు తరుముకుంటూ అక్కడే పడుకున్న తిరుపతిని కుమ్మేస్తారు. ఇద్దరూ రొమాన్స్‌లో ఉన్నారని తిరుపతి ఇబ్బంది పెట్టకూడదు అని నొప్పి వేసినా అలా నోరుమూసుకొని ఉంటాడు.
ధీరజ్ ప్రేమ నడుం పట్టుకుంటాడు. వదలమని ప్రేమ అంటుంది. ఎంతకీ ఇద్దరూ లేవకపోవడంతో తిరుపతి అరుస్తాడు. ఇద్దరినీ తిట్టి తిరుపతి వెళ్లిపోతాడు. ప్రేమ దాక్కుంటుంది. ధీరజ్ కూడా సిగ్గు పడతాడు. రేవతి ముగ్గు పెడుతుంటే అమూల్య వచ్చి చూస్తుంది. నీకు ముగ్గు వచ్చా అని రేవతి అడిగితే ఎప్పుడూ వదినలే వేసేవాళ్లు నాకు తెలీదు అంటుంది. నేను నేర్పిస్తా రా అని రేవతి పిలుస్తుంది. వల్లీ అమూల్యని చూసి తన మనసులో ఏం ఉందో తెలుసుకోవాలని అనుకుంటుంది. తాళిబొట్టు ఎవరు వేసుకోమని అన్నారో అడుగుతానని అనుకుంటుంది.
నేను అమూల్యకి ముగ్గు నేర్పిస్తా అని వల్లీ రేవతిని పంపేస్తుంది. అమూల్యతో మాట్లాడుతుంటే నువ్వు నాతో మాట్లాడకు వదిన నీ వల్లే ఇలా నా జీవితం అయిపోయింది అని అమూల్య అంటే అలా అనొద్దు నా కాపురం కూలిపోతుంది అని వల్లీ బతిమాలుతుంది. ఇక పెళ్లి గురించి అడుగుతుంది. వల్లీ అమూల్యతో మాట్లాడుతూ ఉంటే ప్రేమ వచ్చి అమూల్యతో ఏం మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. ఏం లేదు అని వల్లీ అంటుంది. వల్లీని పంపేసి ఏం అడిగింది అని అంటే అమూల్య విషయం చెప్తే తాళి బొట్టు గురించి ఎప్పటికీ దానికి చెప్పకు అని ప్రేమ అంటుంది. ధీరజ్ అమూల్యని చూసి చాలా ఎమోషనల్‌గా ఫీలవుతాడు. ఇక చందు తండ్రికి లెక్కలు అప్పగిస్తాడు.
రెండు వేలు లెక్కలు తేడా అయిందని చందు టెన్షన్ పడుతుంటే ఆ మేటర్ కవర్ చేయడానికి భాగ్యం వచ్చి 20 లక్షలు గురించి చెప్తుంది. తండ్రికి ఏం చెప్పాలా అని సాగర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. రామరాజు పాస్ బుక్ చందుకి ఇస్తే డబ్బు తీసుకొస్తాడని అంటే నర్మద కలుగజేసుకొని మేం తీసుకొచ్చి వనజకు ఇస్తామని అంటుంది. భాగ్యం వాళ్లు మాత్రం పాస్ బుక్ అడుగుతారు.
సాగర్‌కి నర్మద క్లాస్ ఇచ్చి తన నగలు తాకట్టు పెట్టడానికి తీసుకెళ్తుంది. వద్దని సాగర్ అంటే మరేం చేయాలి ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేయాలి అని నర్మద అంటుంది. ఇక ధీరజ్ తన ఫ్రెండ్స్‌ని పట్టుకుంటాడు. ధీరజ్‌ని అతని ఓనరు పిలిచి మీ ఫ్రెండ్స్‌కి కార్ ఇచ్చావ్ వాళ్లు లొత్తలు పడేలా చేశారని క్లాస్ పీకుతాడు. కోపంతో ధీరజ్ ముఖం మీద టీ కొడతాడు. రామరాజు గురించి ఆయన తప్పుగా మాట్లాడటంతో ధీరజ్ గొడవ పెట్టుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.






















