అన్వేషించండి

Chinni Serial Today February 16th: చిన్ని సీరియల్: మధుని కాపాడిన మ్యాడీ! లవ్ ప్రపోజ్ చేస్తాడా? సత్య సలహా ఏంటి?

Chinni Serial Today Episode February 16th మధుని తిలక్ చంపాలని ప్రయత్నించే టైంలో మ్యాడీ, సత్యభామ మధుని కాపాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Chinni Serial Today Episode తిలక్ దేవా ఇచ్చిన డబ్బుతో దేవాతో చేతులు కలిపి మధుమితని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. మధుని చంపేయమని తన మనుషులతో చెప్తాడు. మధు వద్దని బతిమాలుతుంది. మధుని కత్తితో పొడిచే టైంకి మ్యాడీ, సత్యభామ అక్కడికి వస్తారు. రౌడీలను ఇద్దరూ చితక్కొట్టేస్తారు. తిలక్‌ని కూడా మ్యాడీ కొడతాడు. తిలక్ మధుని పొడవడానికి వెళ్తే మ్యాడీ చేతితో కత్తి పట్టుకుంటాడు. దాంతో మ్యాడీ చేతికి గాయం అవుతుంది. ఇంతలో పోలీసులు వచ్చి తిలక్‌ని తీసుకెళ్లిపోతారు.

మధు ఎమోషనల్‌గా తన చీర కొంగు చింపేసి మ్యాడీ చేతికి కట్టు కడుతుంది. ఇద్దరూ ఎమోషనల్‌గా మాట్లాడుకోవడం సత్యభామ చూస్తుంది. మధు మ్యాడీకి సత్యభామ గురించి చెప్తుంది. థ్యాంక్యూ మేడం అని మధు అంటే మేడం అనొద్దు నేను మ్యాడీకి బెస్ట్ ఫ్రెండ్‌ని అని అంటుంది. దేవాకి విషయం తెలిసి షాక్ అయిపోతాడు. ఇంతలో మ్యాడీ, మధు, సత్యభామ ఇంటికి వస్తారు. అందరూ మధుని చూసి షాక్ అయిపోతారు. మధుని ఎవరు కిడ్నాప్ చేశారు అని నాగవల్లి అడుగుతుంది. మీరు ఊహించలేని వ్యక్తి కిడ్నాప్ చేశాడు.. తిలక్ కిడ్నాప్ చేశాడు అని సత్యభామ చెప్తుంది. తిలక్ మధుని చంపాలి అని ప్రయత్నించాడని సత్యభామ చెప్తుంది. దాంతో అందరూ షాక్ అయిపోతారు. మధుని చంపాలి అనుకోవడం ఏంటి అని అడుగుతారు. అతను చంపాలి అనుకున్నాడో లేక ఎవరైనా చెప్పారేమో అని సత్యభామ అంటుంది. వాడిని పొద్దున్నే చంపేయాల్సింది అని దేవా అంటాడు. పొద్దున్న నువ్వు చంపడం ఏంటి అని నాగవల్లి అడిగితే పొద్దున్న తిలక్ దగ్గరకు వెళ్లా.. నా కోడలు గురించి అడిగాను,, అప్పుడే గన్ గురి పెట్టి ఉంటే నిజం చెప్పేసేవాడు అని అంటాడు.

మ్యాడీ చేతికి గాయం గురించి తెలిసి నాగవల్లి చాలా బాధ పడుతుంది. సత్యభామ మ్యాడీతో మాట్లాడాలి అని పక్కకి తీసుకెళ్తుంది. నువ్వు ఏ పరిస్థితుల్లో మధుని పెళ్లి చేసుకున్నావో అర్థమైంది. మధుకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు మధు మీద అంతే ప్రేమ ఉందని ఇందాక అర్థమైంది. అంత ప్రేమ మనసులో దాచుకోవడం కరెక్ట్ కాదు.. మధు మీద నీకు ఉన్న ప్రేమ మధుకి తెలియాలి అని చెప్తుంది. తర్వాత అందరికీ చెప్పి సత్యభామ బయల్దేరుతుంది. చచ్చి బతికావ్ కదా అయినా నిన్ను వదలను చంపేస్తా అని దేవా అనుకుంటాడు.

మధు జరిగింది తలచుకొని బాధగా ఉంటుంది. మ్యాడీ వెళ్లి ఏమైందని అడుగుతాడు. మధు మ్యాడీని హగ్ చేసుకొని ఏడుస్తుంది. నువ్వు నాకు పునర్జన్మని ఇచ్చావ్ మ్యాడీ అని మధు అంటే అది నా బాధ్యత మధు.. నువ్వు లేకపోతే నేను బతకలేను అని అనిపించింది.. నాకు తెలీకుండా నువ్వు నా ఆరోప్రాణం అయిపోయావ్ అని అంటాడు. కొత్తగా ఉంది.. మ్యాడీ అని మధు అంటుంది. పుట్టింటికి వెళ్తాను అని చెప్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్లినా తోడుగా నేను వస్తా.. ఇంకోసారి మనల్ని దూరం చేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వను అని అంటాడు. శ్రేయ మధు, మ్యాడీ దగ్గరైపోతున్నారు అని చాలా బాధ పడుతుంది. లోహిత శ్రేయతో దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపే ప్రయత్నం ఉంది.. నాగవల్లి ఆంటీ ఓకే అంటే మ్యాడీ మధుని తరిమేసేలా చేయగలను అంటుంది. అత్తయ్యతో నేను మాట్లాడుతా అని శ్రేయ నాగవల్లి దగ్గరకు వెళ్లి మధుని ఇంట్లో నుంచి గెంటేయడానికి లోహితకు పర్మిషన్ ఇవ్వు అత్తయ్యా అని అంటుంది. పర్మిషన్ ఏంటి అని నాగవల్లి అడిగితే ఆ మధుని ఇంటి నుంచి పంపేయడానికి ఏం చేయాలో నీకు తెలుసు అంట కదా.. పర్మిషన్ ఇచ్చేయ్ అంటుంది. 

నాగవల్లి కోపంగా లోహితతో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. మ్యాడీ మధుని తీసుకొని పుట్టింటికి వెళ్తాడు. మధుని చూసి అందరూ ఎమోషనల్ అవుతారు. మధుని ఎవరు కిడ్నాప్ చేశారు అని వాళ్లు అడిగితే మీ స్నేహితుడు తిలక్ అని మ్యాడీ చెప్తారు. అతని మాటలు విని మా డాడీని అనుమానించారు.. ఇప్పటికైనా ఎవరు ఎలాంటివాళ్లో తెలుసుకోండి అని మ్యాడీ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget