Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 14th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారిని కొట్టిన యమున! సహస్ర కోసం విహారి ఆలోచించాడా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode February 14th లక్ష్మీ గురించి నిజం చెప్పలేదు అని యమున విహారిని కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి లక్ష్మీ గురించి నిజం చెప్పకుండా లక్ష్మీని సీఈఓని చేస్తున్నట్లు ప్రెస్ మీట్‌లో చెప్తాడు. పద్మాక్షి ఈ విషయంలో విహారిని నిలదీస్తుంది. దానికి ఏ అర్హత ఉందని ఆ పదవి ఇచ్చావని అడుగుతుంది. అవన్నీ తర్వాత చెప్తా అని విహారి అంటాడు. ఇంతలో యమున విహారిని నీతో మాట్లాడాలి అని పక్కకి తీసుకెళ్లి లాగిపెట్టి కొడుతుంది. విహారి కాలర్ పట్టుకొని లక్ష్మీ గురించి ఎందుకు చెప్పలేదురా.. అసలు మధ్యలో ఎక్కడికి వెళ్లావ్.. వచ్చి ఎందుకు మాట మార్చావ్ అని నిలదీస్తుంది.
విహారి అజ్ఞాతవ్యక్తిని గుర్తు చేసుకొని ఏం మాట్లాడకుండా అలా నిల్చొంటాడు. విహారిని ఎంత నిలదీసినా నిజం చెప్పడు. ఏమైంది ఏంట్రా చెప్పరా అని యమున నిలదీస్తుంది. అందరికీ నిజం చెప్పే ముందు కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాలి అని అంటాడు. ఏ విషయాలు అని యమున అడిగితే సహస్ర గురించి.. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా.. ఈ టైంలో లక్ష్మీ నా భార్య అని చెప్పడం కరెక్ట్ కాదు అనిపించింది. సహస్ర విషయంలో నేను ఏ తప్పు చేయలేదు అని అందరికీ క్లారిటీ ఇస్తే అప్పుడు ఏ ప్రాబ్లమ్ రాదు అంటాడు. సహస్ర ప్రెగ్నెంట్ అని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా.. అని నిలదీస్తుంది. లక్ష్మీ వాళ్ల నాన్న దగ్గర ఈ విషయం నీకు ఎందుకు గుర్తు రాలేదు.. ఒకవేళ ఆదికేశవులు గారు ఇప్పుడు వస్తే ఏం చెప్తావ్‌రా..ఆయనకు మన ముఖం చూపించగలవా.. ఈ సారి ఏం తేడా జరిగినా నువ్వు లక్ష్మీని వదిలేయాలని గుర్తు పెట్టుకో అని అంటుంది.
విహారి మనసులో నాకు లక్ష్మీ ఎంత ఇష్టమో నువ్వు అంతే ఇష్టం అని అనుకుంటాడు. లక్ష్మీకి ఎలాంటి సమస్య లేని రోజు అందరికీ నేను నిజం చెప్తా.. అప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిజం దాస్తాను.. నువ్వు కూడా నిజం చెప్పమని అనుకుంటున్నా అంటాడు. నువ్వు ఇలా చేస్తావ అనుకోలేదురా.. లక్ష్మీని అక్కడే వదిలేసి రావాల్సింది.. తన పాపం మనకి కచ్చితంగా తగులుతుంది ఛీ అని విహారిని తిట్టి వెళ్లిపోతుంది. మరోవైపు అంబిక లక్ష్మీని సీఈఓని చేయడం వల్ల అది మా కంపెనీలను ఇంకా పై రేంజ్‌కి పంపిస్తుందని అనుకుంటుంది. సుభాష్‌కి కాల్ చేసి లక్ష్మీని సీఈఓని చేసి విహారి మంచి అవకాశం మనకి ఇచ్చాడు.. ఇప్పుడు నేను పావులు కదిపి ఇద్దరికీ చెక్ పెడతా నువ్వు టెన్షన్ పడకు అంటుంది.
విహారి ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటే లక్ష్మీ వస్తుంది. ఏమైంది ఎందుకు అలా ఉన్నారు.. ఏదో ఆలోచిస్తున్నారు. చాలా కంగారుగా ఉన్నారు అని అంటుంది. విహారి ఏం లేదని అంటాడు. మిమల్ని చూస్తుంటే ఏదో భయంగా ఉందని నాకు కూడా తెలీకుండా ఏదో చేస్తున్నారని అంటుంది. ఇప్పుడు నా గురించి ఆలోచిస్తున్నావా.. నీ గురించి ఆలోచించవా.. నిజం చెప్పకుండా నేను అన్యాయం చేశాను అది ఆలోచించవా.. నువ్వు ఎలాగూ కోరుకున్నావు కదా అందుకే నిజం చెప్పకుండా అయిపోయా అని అంటాడు. ఇంతలో పండు వస్తాడు. విహారితో అయ్యా మీరు ఇక నుంచి మీరు నాతో మాట్లాడొద్దు అంటాడు. విహారి పండుతో ఇప్పుడు నీకు ఏమైందిరా అని విహారి అంటే ఏంటి బాబు ఏం తెలీనట్లు అలా అంటారు. నా చెల్లిని ఇంటికి తీసుకొచ్చారని సంతోషపడ్డాను.. కానీ ప్రెస్ మీట్‌లో అసలు నిజం చెప్పకుండా నా చెల్లిని మోసం చేశారు.. మీరు మోసగాడు బాబు అంటాడు. దాంతో లక్ష్మీ పండుని కొడుతుంది. ఎందుకు అలా కొట్టావ్ లక్ష్మీ నేను చేసింది తప్పు కదా అంటాడు. లక్ష్మీ విహారితో మీరు నిజం చెప్పలేదు అంటే ఏదో పెద్ద కారణం ఉంటుంది. లేకపోతే విహారి గారు నిజం చెప్పకుండా ఆగిపోతారా.. అది అర్థం చేసుకోకుండా ఎలా అంటావ్ అని పండుని అడుగుతుంది. పండు విహారికి సారీ చెప్తాడు.
విహారి అంతా ఆలోచిస్తూ అమ్మ ఫోన్ రిపేర్‌కి ఇచ్చా కదా.. వాడి దగ్గర వివరాలు తెలుసుకోవాలి అనుకుంటాడు. వెంటనే రిపేర్ షాప్‌కి బయల్దేరుతాడు. ఇంతలో సహస్ర వచ్చి ఎక్కడికి బావ అంటుంది. అర్జెంట్ పని ఉందని సెల్‌ఫోన్ షాప్‌కి వెళ్తాను అని విహారి అంటాడు. సహస్ర ఆలోచించి ఫోన్ కోసం వెళ్తున్నాడా ఇప్పుడెలా అని తను కూడా ముందే వెళ్తాను అనుకుంటుంది. వెంటనే షాప్ వాడికి ఫోన్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























