Nuvvunte Naa Jathaga Serial Today February 14th: నువ్వుంటే నా జతగా: దేవా 2 కుటుంబాలను కలుపుతాడా? బామ్మకి మాటిచ్చిన దేవా! సత్యమూర్తి నమ్ముతాడా!
Nuvvunte Naa Jathaga Serial Today Episode February 14th దేవా బామ్మతో రెండు కుటుంబాలను కలుపుతానని మాటివ్వడం సత్యమూర్తి దేవాకి ఒక అవకాశం ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode సత్యమూర్తి దేవాతో పాటు ఇంట్లో అందరికీ 30 ఏళ్ల పగ మీ నానమ్మ కన్నవారితోనే అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. ఆ భూపతి చెల్లికి నేను అంటే చాలా ఇష్టం.. నన్ను పిచ్చిగా ప్రేమించింది.. కానీ నేను మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. తనని నేను కాదు అన్నాను అని ఆ భూపతి చెల్లి ఆత్మహత్య చేసుకుంది. ఆవేశంతో కోపంతో వాళ్లు నన్ను చంపడానికి వచ్చారు. ఒక యుద్ధం లాంటి వాతావరణంలో మా నాన్న ఆ భూపతి రెండో చెల్లి భర్తని చంపేశారు.. ఆ గొడవల్లో మా నాన్న ఏమయ్యారో ఎటు వెళ్లారో కూడా ఇప్పటి వరకు తెలీదు.. అయినా వాళ్ల కోపం చల్లారలేదు.. మనం కుటుంబం మీద పగ రగులుతూనే ఉంది.. దూరంగా ఉంటే అయినా వాళ్ల పగ చల్లారుతుందని మీరంతా క్షేమంగా ఉంటారు అని ఆశ పడి దూరంగా వెళ్లిపోయాను.,. అయినా వాళ్ల పగ చల్లారలేదని ఇప్పుడే నాకు అర్థమైందని అని సత్యమూర్తి చెప్తాడు.
పగ ప్రతీకారం మనుషుల్ని ఎలాంటి వైపు అయినా తీసుకెళ్తుంది.. నువ్వు మా నాన్నలా కత్తి పడతావా.. వాళ్లని చంపేస్తావా. చెప్పు నీకు తెలిసినవి అవే కదా.. నీ లాంటి వాడిని నమ్మి ఆ అమ్మాయి మళ్లీ మళ్లీ మోసపోతుంది. నువ్వు నటిస్తూ ఆఅమ్మాయిని మోసం చేస్తున్నావ్.. ఉంటే నువ్వు ఒక్కడివే ఉండు..వాళ్లందరినీ చంపుకుంటూ ఉండు.. మేం వెళ్లిపోతాం.. అని సత్యమూర్తి అంటాడు. నేను చంపను నాన్న.. రక్తం కళ్లచూడకుండానే రక్తసంబంధాలను మార్చుతాను.. పగని పక్కన పెట్టి వాళ్లంతట వాళ్లే మీ షష్టిపూర్తికి వచ్చి ఆశీర్వదించేలా చేస్తా అని అంటాడు దేవా. అంత సీన్ లేదు అని కాంతం, రంగం అంటాడు. బేబీ ఎమోషనల్‌గా నువ్వు నిజంగా వాళ్లని మార్చుతావా.. మీ నాన్న కూడా చెప్పని నా చివరి కోరిక ఏంటో తెలుసా.. ఆ కుటుంబం మన కుటుంబం కలిసిపోవడమే.. అది నువ్వు చేస్తే ఆనందంగా నేను కన్ను మూస్తానురా అని బామ్మ అంటుంది. మాటివ్వరా మనవడా అని అడుగుతుంది. దానికి మిథునబామ్మ చేయి పట్టుకొని ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా ఆయన్ను నేను నమ్ముతున్నా నేను చేస్తా అంటుంది.
సత్యమూర్తి తల్లితో వాళ్లు అనుకున్నట్లు అది జరగదు అమ్మా అని అంటాడు. దేవా మారాడు అని నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం అనుకొని ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రమోదిని అంటుంది. అందరూ చెప్పడంతో సత్యమూర్తి అక్కడే ఉండి షష్టిపూర్తి జరిపించుకోవడానికి ఒప్పుకుంటాడు. దేవా తండ్రి చెప్పిన మాటలు తలచుకుంటూ ఉంటాడు. మిథున వచ్చి ఇక్కడ పరిస్థితులు బాలేకపోయినా రెండు కుటుంబాలను కలుపుతాను అన్న నీ ఆలోచన చాలా మంచిది.. నేను అస్సలు నమ్మలేకపోయాను తెలుసా.. నా దేవా ఏనా అనిపించింది.. ఎప్పుడూ అడుగు ముందుకు వేయాలనుకునే నా దేవా ఒక అడుగు వెనక్కి వేయడం సంతోషంగా ఉంది.. నువ్వు అనుకున్నట్లు జరిగితే చాలా మంది,, కానీ నువ్వు మళ్లీ పాత దేవాలా మారిపోతే అనే ఆలోచన నాలో భయం పెంచేస్తుందని అంటుంది. నీకు మాటిచ్చా మిథున నా తల తెగి కింద పడినా మాట తప్పను అని దేవా అంటాడు. నానమ్మ మనసులో ఎంతో బాధ పెట్టుకొని కూడా పైకి నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉంటుంది కదా. ఇంత బాధ ఎలా భరిస్తుందా అనిపిస్తుంది. ఎంత కష్టం అయినా సరే రెండు కుటుంబాల్ని కలుపుతా.. ఎన్ని అవమానాలు అయినా భరిస్తా అని దేవా అంటాడు.
భూపతిరాజు గతంలోకి వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు. అతని రెండో చెల్లి, వికలాంగుడైన తండ్రి భూపతి రాజు దగ్గరకు వస్తారు. భూపతితో చెల్లి వాళ్లు గెలిచినట్లు ఆనందంతో బతుకుతున్నారు.. చుట్టుపక్కల గ్రామాల వాళ్లు నిన్ను దేవుడు అని దండం పెడతారు. ఇంకొంత మంది భయంతో దండం పెడతారు. ఈ ఇంటికి ఓ చరిత్ర ఉంది.. కానీ ఆ చరిత్రకు మచ్చ ఉంది.. దీనికి కారణం ఆ ఎదురింటి వాళ్లు. మేం సంతోషంగా ఉన్నాం అని ఫంక్షన్ చేస్తూ మనల్ని వెక్కిరిస్తున్నారు.. ఆ ఆనందాన్ని ధైర్యాన్ని రెండింటినీ చంపేయాలి అన్నయ్యా అని అంటుంది. ఆ సత్యమూర్తి చేసిన పని వల్ల నీ నుదిట కుంకుమ దూరం అయింది. ఆ కుటుంబాన్ని ఆనందంగా ఉండనివ్వను అన్న భయంతో వాడు ఊరు వదిలేసి పారిపోయాడు. వాడిని అంత ఈజీగా వదలను అని అంటాడు భూపతి. ఇంతలో అతని మనిషి వచ్చి బామ్మ మనవడు అంట ఎవరు అడ్డుకున్నా షష్టిపూర్తి ఆగదు అని చెప్పాడంట.. ఫంక్షన్‌కి ఏర్పాట్లు చేస్తున్నారంట అంటాడు. 30 ఏళ్లగా ఆ ఇంట్లో మా ఎదురుగా ఫంక్షన్ జరిగిందే లేదు.. ఇప్పుడు జరగనివ్వను అని భూపతి రాజు అంటాడు. ఇక బామ్మ అందరూ కలిసిపోవాలి.. అప్పుడు రెండు కుటుంబాలు కలిసి పెద్ద కుటుంబంగా సంతోషంగా ఉంటారు అని పొంగిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























