Chinni Serial Today December 27th: చిన్ని సీరియల్: మధుపై నాగవల్లి కుట్ర.. దిమ్మతిరిగే షాకిచ్చిన నాగవల్లి! మధు కళ్లముందే నిశ్చితార్థం!
Chinni Serial Today Episode December 27th మధు కళ్ల ముందే మ్యాడీ, శ్రేయల నిశ్చితార్థం జరగడం మధు బాధ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ, శ్రేయల నిశ్చితార్థం ఉంగరాలు కనిపించవు. ఎవరైనా దొంగతనం చేసుంటారని లోహిత అంటుంది. నీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అందరూ అడుగుతారు. మధు మీద అనుమానం అని లోహిత చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. నాగవల్లి, దేవాలకు ఆ విషయం తెలీదు.
మధు కూడా షాక్ అయి నేను ఎందుకు నిశ్చితార్థం రింగులు దొంగతనం చేస్తానని అంటుంది. రింగులు నచ్చాయని నువ్వే నాగవల్లి ఆంటీకి చెప్పావు కదా అని అంటుంది. మధు అలాంటి పని ఎప్పటికీ చేయదు అని మ్యాడీ అంటాడు. నీ నమ్మకం ఓకే కానీ నేను మధు పర్స్ చెక్ చేస్తా అందులో రింగులు లేకపోతే నేనే తనకి సారీ చెప్తా అని లోహిత అంటుంది. మధు పర్సు ఇస్తుంది. వెతకమని చెప్తుంది. ఇంతలో నాగవల్లి, దేవా వస్తారు. ఏమైందని అడిగితే లోహిత విషయం చెప్పి.. మధు దొంగతనం చేసిందని చెప్పానని అంటుంది.
నాగవల్లి మధు దగ్గరకు వెళ్లి నవ్వుతూ మధుకి సారీ చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. లోహితకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అందుకే నీ మీద నింద వేసింది.. ఆ రింగులు నేనే తీసి పూజ గదిలో పెట్టానని చెప్పి ప్రమీలను తీసుకురమ్మని చెప్తుంది. లోహిత బిత్తరపోతుంది. మ్యాడీ లోహితతో ఏంటి అలా చూస్తావ్ మధుకి సారీ చెప్పు అని అంటాడు. లోహిత మధుకి సారీ చెప్తుంది. ఇక మ్యాడీ, శ్రేయ రింగులు మార్చుకుంటారు. మధు చాలా బాధ పడుతుంది.
మధు దగ్గరకు దేవా వెళ్లి చిన్ని కనిపించిందా అని అడుగుతాడు. లేదు అని మధు చెప్తుంది. చూడు ఎక్కడైనా కనిపిస్తే చెప్పు అని అంటాడు. లోహితను నాగవల్లి పక్కకి తీసుకెళ్లి లాగిపెట్టి కొడుతుంది. ఏమైంది ఆంటీ అని లోహిత అడిగితే నువ్వు మధు బ్యాగ్‌లో రింగులు పెట్టడం నేను చూశా.. అసలే మ్యాడీ అయిష్టంగా నిశ్చితార్థం చేసుకుంటున్నాడని నేను బాధ పడుతుంటే ఇలాంటి పనులు చేస్తే ఇక నీ జీవితమే డిస్ట్రబ్ అయిపోతుందని వార్నింగ్ ఇస్తుంది. లోహిత సారీ చెప్తుంది.
మధు స్వప్నతో నిశ్చితార్థం ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదే అని ఏడుస్తుంది. లోహిత అక్కడికి వచ్చి స్వప్నని పంపేసి మధు ఏడుస్తున్నావా మొత్తం కన్నీరు ఇప్పుడు వేస్ట్ చేసుకోకు.. పెళ్లి రోజుకి కొంచెం ఉంచుకో అని అంటుంది. ఇంత కాలం నువ్వు స్వార్థపరురాలివే అనుకున్నావ్ ఇప్పుడు తెలిసింది నువ్వు శాడిస్ట్‌వి కూడా అని అంటుంది మధు. నేను ఈ ఇంటి కోడలిని నువ్వు ఈ ఇంటి కోడలు కాకపోయిన దురదృష్టవంతురాలివి.. ఒక్క నిమిషంలో నిన్ను గెంటేస్తా అని లోహిత అంటే.. నీకు నిమిషం కావాలేమో నాకు అర నిమిషం చాలు.. నువ్వు ఏం చెప్పి ఈ పెళ్లి చేసుకున్నావో నాగవల్లి ఆంటీకి చెప్తే నీ మెడ పట్టుకొని గెంటేస్తారని అంటుంది. లోహిత షాక్ అయిపోతుంది.
మధు మ్యాడీతో మాట్లాడటానికి వెళ్తుంది. నా బాధ చూసి నువ్వు బాధ పడటం చూశాను అని మ్యాడీ అంటాడు. నేను రాకపోయి ఉంటే నీ బాధ ఎవరితో పంచుకునే వాడిని అని మధు అడిగితే వచ్చినందుకు థ్యాంక్స్ మధు అని మ్యాడీ హగ్ చేసుకుంటాడు. నాగవల్లి అది చూస్తుంది. నా బాధ తగ్గించడానికి ఆ దేవుడు నాకు నీ లాంటి ఫ్రెండ్‌ని ఇచ్చాడని అంటుంది. ఇక నువ్వు నా బాధని నాతో పూర్తిగా పంచుకోలేం మ్యాడీ ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా నువ్వు శ్రేయకి కాబోయే భర్తవి కదా..లిమిట్స్‌లో ఉండాలి అని అంటుంది. ఫ్రెండ్స్‌కి లిమిట్స్ ఉండవు అని మ్యాడీ అంటాడు.
మ్యాడీతో మాట్లాడి మధు వెళ్తుంటే నాగవల్లి కలుస్తుంది. అప్పుడే వెళ్లిపోతున్నావ్ ఏంటి మధు అంటుంది. మీరు పిలిచిన పని అయిపోయింది కదా ఆంటీ అని అంటుంది. త్వరలోనే నీ చేతుల మీద మ్యాడీ పెళ్లి కూడా చేయించు మధు.. హంతకురాలు అయిన మీ అమ్మ నిర్దోషి అని నిరూపిస్తా అని అన్నావ్.. ఆ ఛాలెంజ్‌లో కూడా ఓడిపోవడానికి రెడీగా ఉండు. ఆ ఛాలెంజ్ నేను గెలవబోతున్నా.. త్వరలోనే మా అమ్మ నిర్దోషి అని నిరూపిస్తా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















