Prema Entha Madhuram September 12th: ముసలోడు రిజెక్ట్ చేసిన మళ్లీ పెళ్లి కావాలంటున్న ఛాయాదేవి!
వర్ధన్ ఇంటికి వచ్చి ఆర్య ని పెళ్లి చేసుకోబోతున్నాను అని ఛాయాదేవి అందరికీ చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema entha madhuram september 12th: వర్ధన్ ఇంట్లో అను ముసుగు వేసుకుని వరలక్ష్మి దేవి పాట పాడుతూ ఉంటుంది. పాట అయిపోయిన తర్వాత పంతులుగారు హారతి ఇచ్చి పూజ అయిపోయింది అని అంటారు.
అను: తల్లి నా దురదృష్టం ఎంత ఉన్నా సరే నా ఇంటికి వచ్చి నన్ను పూజ చేసుకొనేలా చేశావు.నేను నేనుగా రాకపోయినా సరే ఇంట్లో పూజ చేసినందుకు మనస్పూర్తిగా ఉంది. అని మనసులో అనుకుంటుంది.
ఆ తర్వాత సీన్ లో అక్షర తన స్కూల్ పిల్లలతో కలిసి కూర్చుంటుంది. ఇంతలో వాళ్ళు రేపు పేరెంట్స్ మీటింగ్ ఉన్నది మా నాన్న వస్తున్నారు అని వాళ్ళ నాన్నల గురించి గొప్పగా చెప్తారు. అక్కి మీ నాన్న ఎందుకు ఇప్పుడు రారు? అని ఒక అమ్మాయి అడుగుతుంది. అప్పుడు సాత్విక్ అక్కి వెనకనే ఉంటాడు.
సాత్విక్: మనందరి లాగా అక్కీకి ఫాదర్ లేరు వాళ్ళ మదర్ ఒకరే ఉన్నారు.
మిగిలిన వాళ్ళు: అయ్యో సో సాడ్. అని అంటారు. అదే సమయానికి అక్కడికి వచ్చిన అభయ్ సాత్విక్ కి వార్నింగ్ ఇచ్చి అక్కి నీ అక్కడి నుంచి బయటకు తీసుకొని వస్తాడు.
అభయ్: వాళ్ల మాటలు ఏమీ పట్టించుకోవద్దు అక్కి. మనకి అమ్మ అయినా నాన్న అయినా అంతా అమ్మే కదా.
అక్షర: నిజమే కానీ అన్నయ్య అందరిలాగే మన అమ్మానాన్న కూడా కలిసి ఉంటే బాగుండు కదా. అని చెప్పి వెళ్లి అభయ్ ని హద్దుకుంటుంది.
ఆ తర్వాత సీన్లో వర్ధన్ కుటుంబంలో పూజ బాగా అయింది అని అందరూ అనుకుంటారు. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ ఇంటికి వెళ్లి పోగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అను, చైత్రలే మిగిలి ఉంటారు.
Also Read: జాహ్నవి మనసులో విష బీజం వేసిన రాజ్యలక్ష్మి- విక్రమ్ కి దివ్య దూరం కానుందా!
నీరజ్: అనుకున్న దానికన్నా ఈరోజు పూజ ఎందుకో చాలా ప్రశాంతంగా అయినట్టు అనిపిస్తుంది.
అంజలి: దానికి కారణం చైత్ర, రాధలే. నాకు ఈ పూజల గురించి ఎక్కువ తెలీదు వాళ్లే ఈ పూజని బాగా చేయించారు.
చైత్ర: నాకు కూడా ఈ పూజలు ఏవి అంతలా తెలియదు సో ఒక క్రెడిట్ అంతా రాధదే.
అను: నాదేమీ లేదు అంతా అమ్మవారి దయ.
చైత్ర: ఇంక శారద మేడం వాళ్ళని కూడా కిందకి రమ్మందాము.
అంజలి: నేను వెళ్లి ఆంటీ ని పిలుస్తాను.
పంతులుగారు: నువ్వు నీ భర్త దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటేనే ఈ పూజ సంపూర్ణంగా ముగిసినట్టు అమ్మ. అని అంజలితో చెప్తారు.
చైత్ర: నువ్వు వెళ్లి మీ పతి దేవుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకొ, నేను వెళ్లి పిలుచుకుని వస్తాను. అని అంటుంది. అలాగే అను చెవి దగ్గరికి వెళ్లి, ఆర్య సార్ దగ్గర నీకు ఆశీర్వాదాలు ఇప్పించేలా చేస్తాను. అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుండగా ఛాయాదేవి అక్కడికి వస్తుంది.
అంజలి: నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు?
ఛాయాదేవి: వరలక్ష్మి వ్రతం రోజు ఒక ఆడపిల్ల వస్తే లక్ష్మీదేవి వచ్చింది అనుకోవాలి కానీ ఏదో దెయ్యం వచ్చినట్టు చూస్తావ్ ఏంటి?
అంజలి: ఫ్లోలో చెప్పిన కరెక్ట్ గానే చెప్పావు నువ్వు దెయ్యానివే.
చైత్ర: తను ఎవరు అను అని అనుని అడుగుతుంది.
అను: ఛాయాదేవి అని చెప్పాను కదా అది తినే. అప్పుడే ఛాయాదేవి చైత్ర ను చూస్తుంది.
ఛాయాదేవి: వ్రతానికి గెస్ట్లు బానే వచ్చినట్టున్నారుగా.
చైత్ర: ఇంటి మంచి కోరుకునే వాళ్లు పిలిచినా పిలవకపోయినా వస్తాము. ఇలా పిలవని పేరంటాలికి వచ్చేది మీలాంటి వాళ్లే.
ఛాయాదేవి: గెస్ట్ వి గెస్ట్ లా ఉండు. అయినా నేను వచ్చింది కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి గెస్టులతో కాదు.
నీరజ్: ఇక్కడ నువ్వు తప్ప ఉన్న వాళ్ళందరూ కుటుంబ సభ్యులే. ముందు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ విషయం చెప్పు.
ఛాయాదేవి: నీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు నచ్చింది. నేను కూడా సూటిగా చెప్తాను.ఈ గొడవలన్నీ ఆగి మీతో బంధుత్వం పెంచుకోవడానికి వచ్చాను.
Also Read: ఏంజెల్ కి షాక్ ఇచ్చిన రిషి, టెన్షన్లో వసు - కొడుకు నిజస్వరూపం తెలుసుకున్న ఫణీంద్ర!
జెండే: నువ్వేం చెప్పాలనుకున్నా తర్వాత చెప్పు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు.
ఛాయాదేవి: ఎందుకు కంగారు పడతారు? వచ్చింది వెళ్లిపోవడానికి కాదు పూర్తి విషయం చెప్తాను. నేను ఇంటికి పెద్ద కోడలు అవుదాం అనుకుంటున్నాను. ఆర్య ని పెళ్లి చేసుకుంటాను. అని అనగా కుటుంబ సభ్యులందరూ ఒకేసారి షాక్ అవుతారు.
నీరజ్: అసలు ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా? దాదా పక్కన భార్య స్థానం ఎప్పుడూ వదినమ్మదే దాన్ని ఎవరు తీసుకోలేరు. అని అనగా ఛాయాదేవి చిటిక వేస్తే వెనుక నుంచి నలుగురు అమ్మాయిలు చేతిలో గిఫ్ట్ పట్టుకొని వస్తారు.
ఛాయాదేవి: కోపం ఎందుకు? అయినా బంధుత్వం మాట్లాడేటప్పుడు ఖాళీ చేతులతో రాకూడదు అని ఇవి తెచ్చాను మన బంధుత్వం బలపడాలి అని.
చైత్ర: ఆర్య సార్ గురించి నీకు బాగా తెలిసినట్టు లేదు. వర్క్ లో మీరు ఎనిమీస్ అయ్యుండొచ్చు తన కుటుంబం జోలికి వచ్చిన సరే మిమ్మల్ని వదిలిపెట్టరు, అలాంటిది తన భార్య అయిన అను జోలికి వస్తే నీ చిత్రానికి దండ వేసేయడమే.
ఛాయాదేవి: ఎందుకు అందరూ అను జపం చేస్తున్నారు? భర్త పక్కన భార్య ఉండాలి మరి ఆర్య పక్కన అను ఏది? అని అనగా ఈ మాటలకి అను బాధపడుతూ ఉంటుంది.
నీరజ్: వదినమ్మ ఇక్కడ ఉన్నా లేకపోయినా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఈ ఇంటి పెద్ద కోడలు స్థానం వదినమ్మదే.
చైత్ర: అయినా ఆర్య సార్ ,శారదా మేడం ఇక్కడ లేరు కాబట్టి బతికి పోయావు లేకపోతే ఇదే నీ చివరి రోజు అయిపోయేది.
జెండే: ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. అని గట్టిగా అరుస్తాడు.
ఛాయాదేవి: నేను ఇంటి పెద్దా అయిన శారదమ్మతో మాట్లాడడానికి వచ్చాను అయినా మీరందరూ ఒకే మాట మీద ఉన్నట్టున్నారు. నేను కూడా అసలు వెనకాడే పరిస్థితి లేదు. ఈరోజు గెస్ట్ లా వచ్చాను గెస్ట్ లా వెళ్తాను. తర్వాత సారి వచ్చినప్పుడు ఇంటి పెద్ద కోడలిగా వచ్చి తాంబూలం తీసుకుంటాను.
జెండే: మొన్న ఆఫీసులో ఆర్య రిజెక్ట్ చేశాడు అని ఇంటి వరకు దీన్ని తెచ్చావు. ఇంటి వరకు ఈ విషయం తెచ్చేవని తెలిస్తేనే ఆర్య నిను వదిలిపెట్టడు. ఇంక నువ్వు పగటి కలలు కనడం ఆపు.
ఛాయాదేవి: ఇంటికి వచ్చిన ఆడపిల్లకి కుంకుమ పెట్టే సంస్కారం కూడా లేదు పగటి కలలు గురించి మీరు మాట్లాడుతున్నారా? అయినా పర్లేదు ఎప్పటికీ ఈ ఇల్లు నాదే కదా. అని సంతోషపడుతుంది ఛాయాదేవి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.