భగవద్గీత: మోసం చేసినవారికి మరో అవకాశం ఇవ్వొద్దు



భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన ప్ర‌కారం, చాలా సంతోషంగా లేదా చాలా విచారంగా ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఈ రెండు పరిస్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకోవడానికి అనుమతించవు.



కారణం లేకుండా మనిషి జీవితంలో సమస్యలు రావని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. సమస్యల రాక మన జీవితంలో ఏదో మార్పు రావాలి అనే సంకేతం.



ఎవరైనా మీకు మంచి అవకాశం ఇస్తే, ఏ కారణం చేతనైనా అతన్ని మోసం చేయవద్దు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే, అతనికి మళ్లీ ఆ అవకాశం ఇవ్వవద్దు.



ఒకసారి మోసం చేసిన వ్యక్తి మరోసారి మోసం చేయడనడానికి ఎలాంటి రుజువు లేదు.



కేవలం ప్రదర్శన కోసం మంచిగా మారకూడదు. అంటే ఎవరో ఒకరు మనల్ని చూస్తున్నారని మనం చక్కగా ప్రవర్తించకూడదు.



దేవుడు మిమ్మల్ని బయటి నుంచి మాత్రమే కాకుండా లోపల నుంచి అంటే ఆత్మ నుంచి కూడా చూస్తాడు.



ఓటమి, గెలుపు మన ఆలోచనపై ఆధారపడి ఉంటాయి. ఓటమిని అంగీకరిస్తే అది ఓటమి అవుతుంది. అదే ఓటమిని విజయంగా మార్చుకుంటే అది మన జీవితానికి సోపానం అవుతుంది.



ఓటమి, గెలుపు మన సామర్థ్యంపై, మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్పాడు.



Images Credit: Pinterest