Brahmamudi Serial Today January 6th రుద్రాణితో సేవలు చేయించుకుంటూ ముప్పుతిప్పలు పెడుతోన్న స్వప్న!
Brhmamudu Serial Today Episode స్వప్న తన అత్తతో సేవలు చేయించుకొని రుద్రాణిని ఓ ఆట ఆడుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Brhmamudu Today Episode: రుద్రాణి, రాహుల్‌లు ప్రెగ్నెంట్ అయిన తనని సరిగా చూడటం లేదు అని స్వప్న ఇంట్లో వాళ్లతో చెప్తుంది. ఇక చిట్టి స్వప్న బాధలో అర్థముందని చెప్తుంది. దీంతో రుద్రాణి ఇప్పుడు ఏం చేయమంటావు అమ్మా అని చిట్టీని అడుగుతుంది. దీంతో స్వప్న తనకు ఇంట్లో సేవలు చేయాలి అని, ఒంట్లో బాగోలేకపోతే మీ అబ్బాయి హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి అని అంటుంది. దీంతో రుద్రాణి సరే అని అంటుంది. ఇక రుద్రాణికి స్వప్న జూస్ తీసుకొని రమ్మని చెప్తుంది. ఇక రాహుల్ ఫోన్ వచ్చినట్లు అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు.
రాజ్: లాయర్‌గారు శ్వేత అంతా చెప్పింది కదా..
లాయర్: చెప్పారు సార్ విడాకులు రెండు రకాలు సార్.. భార్యకో భర్తకో ప్రాబ్లమ్ వచ్చి ఎవరో ఒకరు విడాకులకు అప్లై చేయడం. రెండు భార్య భర్తలు ఇద్దరూ మ్యూచువల్ అండర్ స్టాండింగ్‌తో డివోర్స్ తీసుకోవడం.
రాజ్: మా కేసులో ఇద్దరికీ విడాకులు తీసుకోవడం ఇష్టమే.
కావ్య: ఆటోలో వస్తూ.. ఆయన నా దగ్గర అబద్ధం ఎందుకు చెప్పారు. ఇదే మొదటి సారా లేక గతంలోనూ చెప్పారా.. ఆయనకు ఆ అమ్మాయికి ఏంటి సంబంధం.
రాజ్: చెప్పడానికి పెద్ద కారణం ఏం లేదు. నచ్చలేదు విడిపోవాలి అంతే.
లాయర్: మరి భరణం లాంటిది.
రాజ్: అవన్నీ రూల్స్ ప్రకారం మీరు చేయండి.
లాయర్: అయితే కోర్టులో అప్లై చేయమంటారా..
రాజ్: అదే కదా చెప్తున్నాం.
లాయర్: అది కాదు సార్ చాలా కేసుల్లో అంతా ఓకే చేశాకా వద్దు అని చెప్తుంటారు. అలా మీరు ఏమైనా.
శ్వేత: రాజ్ ఒకసారి ఆలోచించు. మనం ఏం తప్పు చేయడం లేదు కదా..
రాజ్: నీకు తప్పు అనిపిస్తోందా.. దీనికి ఇదే పరిష్కారం.
ఇక కావ్య అప్పుడే ఆఫీస్‌కు వస్తుంది. లాయర్ వెళ్లడం చూస్తుంది. మరోవైపు రాజ్ శ్వేత చేతిలో చేయి వేసి నువ్వేం బెంగ పెట్టుకోకు. నీకు ఎలాంటి అన్యాయం జరగదు. అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది అని భరోసా ఇస్తాడు. అది కావ్య చూసేస్తుంది. దీంతో అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తుంది. ఇక రాజ్ శ్వేత భుజం మీద చేయి వేసుకొని ఆమెను పట్టుకొని బయటకు రావడం కావ్య చూసి అలాగే ఉండిపోతుంది. ఇక శ్వేత వెళ్లిపోయిన తర్వాత రాజ్ కావ్యను చూస్తాడు.
రాజ్: నువ్వేప్పుడు వచ్చావు.
కావ్య: నేను ఇక్కడ ఉన్నాను అని మీరు గమనించలేదు చూశారా అప్పుడు వచ్చాను.
రాజ్: ఇక్కడి నుంచే ఫోన్ చేశావా..
కావ్య: ఇక్కడికి వచ్చి ఎందుకు ఫోన్ చేస్తాను. మీరు ఆఫీస్‌లో ఉన్నారా లేక బయట ఎక్కడో ఉండి అలా చెప్పారా అని టెస్ట్ పెట్టడానికా..
రాజ్: ఏ ఏంటి ఆ జవాబులు.
కావ్య: మీకోసం టిఫిన్ తీసుకొచ్చా.. మీకు బయట తిండి అలవాటు లేదు అని అనుకున్నాను. కానీ మీరు కూడా బయట తిండికి అలవాటు పడ్డారు అని ఊహించలేకపోయాను పిచ్చిదాన్ని.
మరోవైపు కల్యాణ్ అప్పుకు కాల్ చేస్తాడు. అప్పు కల్యాణ్ వాళ్ల అమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఫోన్ రిసీవ్ చేయదు. ఒక అనామిక ఎవరికి ఫోన్ చేశావ్ అని కల్యాణ్‌ని అడుగుతుంది. దీంతో కల్యాణ్ బ్రోకి కాల్ చేశా లిఫ్ట్ చేయడం లేదు అంటాడు. దానికి అనామిక అంటే నిన్ను అవాయిడ్ చేస్తుంది అనే కదా అర్థమని అంటుంది. అందుకు కాల్ చేయకు అని చెప్తుంది. ఇక అనామిక మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉంటే నేను ఏం అనుకోను కానీ అప్పు మనసులో ఏం ఉందో తెలిశాక నేను ఎలా మాట్లాడితే ఒప్పుకుంటాను అంటుంది. దీంతో కల్యాణ్ అప్పు మనసులో నా మీద అలాంటి అభిప్రాయం రావడానికి నేను కాబట్టి నేను అప్పునీ మాములు మనిషిని చేయాలి అంటాడు. ఇక అనామిక అప్పుతో నువ్వు మాట్లాడటం నాకు ఇష్టంలేదు అని చెప్తుంది.
మరోవైపు కావ్య రాజ్ ఎందుకు అబద్ధం చెప్పాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కావ్య వెళ్తున్న ఆటోకి అప్పు ఎదురుగా వస్తుంది. దీంతో డ్రైవర్ ఆటో ఆపి అప్పుని తిడతాడు. అప్పుని చూసిన కావ్య అప్పుని పిలిచి ఏంటి ఆ పరధ్యానం అని తనని ఆటో ఎక్కిస్తుంది. ఇంటికి తీసుకెళ్తుంది.
కనకం: ఒకప్పుడు నా కూతుళ్లు ఐశ్వర్య వంతుల ఇంటికి కోడళ్లుగా వెళ్లాలి అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం కేవలం అప్పు ప్రేమను గెలిపించాలి అనుకున్నాను. ఆ ప్రయత్నం లాగే ఈ ప్రయత్నం కనిపించడంలో తప్పు లేదు. అది అర్థం చేసుకోవడంలో వాళ్ల తప్పు కూడా లేదు. కానీ దీని బాధ చూడలేకపోతున్నాను.
అప్పు: అమ్మా నేను ఇప్పుడు బాధలో ఉన్నాను అని నీకు ఎవరు చెప్పారు. ఎందుకు మాట మాటకి నాకు అన్నీ గుర్తుచేస్తావ్. నాకు ఏం కాలేదు. అక్కా నీకు సంబంధం లేకపోయినా మధ్యలోకి నిన్ను లాగారు. నా వల్ల మీ ఇంట్లో నిన్ను తప్పుగా చూస్తున్నారు.
కావ్య: మా ఇంట్లో వాళ్ల గురించి మర్చిపోండి వాళ్లు నన్ను శత్రువులా చూడటం లేదు. ఎవరికి కోపం వచ్చినా ఆలోచనల వరకే. నా సమస్య వదిలేయండి నేను చూసుకుంటాను. కానీ అప్పు నువ్వు ఇలా ఉండటం కరెక్ట్ కాదు. నీకు ఏదైనా ప్రమాదం జరిగితే మేమంతా బాధ పడతాం.
మరోవైపు స్వప్న రుద్రాణి జూస్ ఇమ్మని, ఏసీ ఆపమని పరుగులు పెట్టిస్తుంది. ఇక రాహుల్ ఫైర్ స్టేషన్‌కు కాల్ చేసి ఇక్కడ మాకు బాగా కాలిపోతుంది వచ్చి కూల్ చేసి వెళ్తారా అని తన తల్లి దగ్గర సెటైర్లు వేస్తాడు. ఇక రుద్రాణి స్వప్నను వదిలించుకోవడానికి ఓ ఐడియా వచ్చింది అంటే నీ ఐడియాలు అన్నీ మనకే రివర్స్ అవుతున్నాయి కొన్ని రోజులు నీ ఐడియాలకు బ్రేక్ ఇవ్వు అని అంటాడు. ఇక స్వప్న తన అత్తకి పిలిచి నీ కొడుకు ఎక్కడ కనిపించడం లేదు అంటే చచ్చి చాలా సేపు అయింది అని పారిపోతాడు. మరోవైపు కనకం కావ్య, అప్పులకు తినిపిస్తుంది. ఇక అప్పుడే కావ్య తండ్రి వచ్చి మా ఇంటికి ఎందుకు వచ్చావమ్మా అని కావ్యను అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.