అన్వేషించండి

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: సుభాష్‌ను రెచ్చగొట్టిన రుద్రాణి – కళ్యాణ్‌ను నిలదీసిన ఇందిరాదేవి

Brahmamudi serial today episode September 22nd:  రాజ్‌, సుభాష్‌ ను తిట్టి వెళ్లడంతో సుభాష్‌ను రెచ్చగొట్టాలని చూస్తుంది రుద్రాణి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: తనను ఆఫీసుకు వెళ్లమని తండ్రి సుభాష్‌ను ఇష్టమొచ్చినట్టు తిడతాడు రాజ్‌. అసలు కంపెనీ ఉంటే నాకేంటి పోతే నాకేంటి అంటూ మాట్లాడతాడు. దీంతో సుభాష్‌ కోపంగా రాజ్‌ ను తిడతాడు.

సుభాష్‌: అసలు ఏం మాట్లాడుతున్నావురా.. నీకేమైనా పిచ్చి పట్టిందా..?  వందల కోట్ల ప్రాజెక్టురా అది

రాజ్‌: అసలు పిచ్చి పట్టింది నాకు కాదు మీకు.. మీకు పట్టింది డబ్బు పిచ్చి వేలు కోట్లు సంపాదించారు కదా ఇంకా సాటిఫై అవ్వలేదా.. ఇంకా ఎంత సంపాదిస్తే సాటిఫై అవుతారు.. ఈ భూమ్మీద పుట్టినందుకు కొద్దిరోజులైనా మన అన్న వాళ్ల కోసం బతకండి.. అన్నానికి బదులు డబ్బులు తింటామా..?

అని తిట్టి రాజ్‌ వెళ్లిపోతాడు. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు.

రుద్రాణి: ( మనసులో) రాజ్‌ ఏంటి నాన్న మీద ఈగ కూడా వాలనిచ్చే వాడు కాదు. అలాంటి వాడే ఇన్నేసి మాటలు అనేసి వెళ్లిపోయాడు.. ఏదైతే ఏమీ ఈ అవకాశం వాడుకుందాం. ( సుభాష్‌ దగ్గరకు వెళ్తుంది) అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అని ఊరికే అన్నారా..? పెళ్లి అవగానే పేరెంట్స్‌ అల్లం అయ్యారు. పెళ్లాం బెల్లం అయింది. ఇప్పుడు నువ్వు ఏమన్నావు అన్నయ్య రాజ్‌ అంత హార్స్‌ గా మాట్లాడి వెళ్లాడు. పెళ్లాం కడుపుతో ఉంది కేర్‌ఫుల్‌ గా చూసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్లను అని చెప్పాలి కానీ ఇంతలా తిట్టి వెళ్లాలా..? చూడండి అన్నయ్య ఎంతలా బాధపడతున్నాడో..  నువ్వేం బాధపడకు అన్నయ్యా పెళ్లాం వస్తే అంతే..

ఇందిరాదేవి: నువ్వు నోరు మూయ్‌ చాన్స్‌ దొరికితే సరి దూరిపోతావు..

రుద్రాణి: ఇప్పుడు నేను ఏమన్నాను అమ్మా..

ఇందిరాదేవి: నువ్వు ముందు నోర్మూయ్‌.. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో (రుద్రాణి వెళ్లిపోతుంది.) నాన్న సుభాష్‌ వాడు ఏదో ఆవేశంలో తిట్టాడు నాన్న  నువ్వేమి పట్టించుకోకు

సుభాష్‌ మౌనంగా బయటకు  వెళ్లిపోతాడు. వెనకే అపర్ణ వెళ్తుంది.

కావ్య:  కవి గారు అసలేం జరిగింది. ఆయన ఎందుకు అలా ఉన్నారు.

కళ్యాణ్‌: అది నాకు తెలియదు వదిన

ఇందిరాదేవి: ఇద్దరూ కలిసే కదా బయటకు వెళ్లి వచ్చారు..తెలియదు అంటావేంటి..?

కళ్యాణ్‌: ఇందాక ఫోన్‌ వచ్చింది నాన్నమ్మ ఆ ఫోన్‌ వచ్చిన దగ్గర నుంచి ఆలాగే కోపంగా ఉన్నాడు.

ఇందిరాదేవి: అమ్మా కావ్య వెళ్లు వెళ్లి వాడికి ఏమైందో తెలుసుకుని రా

అని చెప్పగానే కావ్య రూంలోకి వెళ్తుంది. రాజ్‌ మరో డాక్టర్‌తో మాట్లాడుతుంటాడు కావ్య రావడం చూసి కాల్‌ కట్‌ చేస్తాడు.

కావ్య:  ఏమైందండి..? ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు. కవిగారేమో మీకు ఫోన్‌ వచ్చినప్పుడే ఇలా చేస్తున్నారు అని చెప్పారు అసలు మీ ప్రాబ్లం ఏంటండి చెప్పండి.

రాజ్‌: ( మనసులో) చెప్పలేను కళావతి నా ప్రాబ్లం నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డే అని చెప్పలేను

కావ్య: ఏంటండి ఆలోచిస్తున్నారు. నాతో చెప్పాలా వద్దా అనా..? సరే నాకు చెప్పకపోయినా పర్వాలేదండి మామయ్య గారికి మాత్రం మీరు కచ్చితంగా సారీ చెప్పి తీరాలి. మీరు ఆయన మీద అకారణంగా కోప్పడి వచ్చేస్తే.. అయిపోయింది అనుకున్నారా..? ఆ తర్వాత ఆయన ఎంత బాధపడి ఉంటారు. ఎప్పుడూ తండ్రిని ఒక్క మాట అనని మీరు ఇలా సడెన్ గా అన్నేసి మాటలు అంటే ఆయన ఎలా తట్టుకుంటారు అనుకున్నారు. నాన్నే కదా భరిస్తారు అనుకున్నారా..?

రాజ్‌: సారీ కళావతి ఏదో ప్రెస్టేషన్‌లో ఉండి ఆలోచించలేదు. అసలు నేను అలా మాట్లాడే రోజు వస్తుందని నేను అనుకోలేదు. పాపం నాన్న మనసు ఎంత హర్ట్‌ అయి ఉంటుందో నేను ఊహించగలను.. పద కళావతి నాన్న దగ్గరకు వెళ్దాం పద నేను చేసిన తప్పుకు నాన్నకు క్షమాపణ చెప్పాలి పద

ఇద్దరూ కలిసి గార్డెన్‌ లో ఉన్న సుభాష్‌ దగ్గరకు వెళ్తారు. రాజ్‌, సుభాష్‌ కాళ్ల మీద పడబోతుంటే సుభాష్‌ పైకి తీసుకుని హగ్ ఇస్తాడు. ఇద్దరూ ఎమోషనల్ అవుతారు. ఇప్పుడు చెపండి ఏంటి మీ ప్రాబ్లమ్‌ అని కావ్య అడుగుతుంది. సుభాష్‌, అపర్ణ కూడా అడగడంతో రాజ్‌ చెప్పలేనని టైం వచ్చినప్పుడు చెప్తానని అప్పటి వరకు తనను విసిగించొద్దని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత రాజ్‌ హాస్పిటల్స్‌ చుట్టూ తిరుగుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
Meghasandesam Serial Today October 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
Godavari Serial Today October 17th: 'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
Podarillu Serial Today Oct 17: జమునను చంపబోయిన నారాయణ..అడ్డుపడి తండ్రిని తిట్టి పంపించిన కన్నా
పొదరిల్లు: జమునను చంపబోయిన నారాయణ..అడ్డుపడి తండ్రిని తిట్టి పంపించిన కన్నా

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget