అన్వేషించండి

Brahmamudi Serial Today November 29th: టిప్పు ఇచ్చిన రాజ్‌పై టిప్పుసుల్తాన్‌లా రెచ్చిపోయిన కావ్య- అమ్మ సెంటిమెంట్‌తో స్ట్రాంగ్ కౌంటర్

Brahmamudi Today Episode: బిర్యానీ నచ్చకపోవడంతో ఒక్కొక్కరుగా రాజ్‌ పార్టీ నుంచి కావ్య పార్టీలోకి జంప్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: కావ్య భోజనం తీసుకురావడం ఇష్టం లేని రాజ్‌, కావ్యను తిడతాడు. మళ్లీ ఎందుకొచ్చావని అడుగుతాడు. అమ్మమ్మ, తాతయ్యల కోసం వచ్చానని చెప్తుంది కావ్య. దీంతో ఏ  హక్కుతో భోజనం తీసుకొచ్చిందే అడుగు నాన్నమ్మ అంటాడు రాజ్‌.  కావ్య మా మనవరాలురా అందుకే భోజనం తీసుకొచ్చింది అని చెప్తూ.. అమ్మా కావ్య త్వరగా భోజనం వడ్డించు అంటుంది. సరే అమ్మమ్మా అంటూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్లి కావ్య వడ్డిస్తుంది. ఇంతలో రాజ్ కూడా డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వచ్చి అందరినీ పిలుస్తాడు.  రాజ్‌ పిలవగానే అందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వస్తారు.

ఇందిరాదేవి: ఇక్కడ ఏముందని పేరంటానికి వచ్చినట్టు కూర్చున్నారు. పైగా వాళ్లను ఎందుకు పిలుస్తున్నావు. ఉత్తి గిన్నెలు ఉన్నాయి ఇక్కడ.

ధాన్యలక్ష్మీ: నా వంట నేను తెచ్చుకున్నాను.

ప్రకాష్‌ : మరి నాకేదే…?

ధాన్యలక్ష్మీ: మీరెంతైనా రాజ్‌ పార్టీ కదా..?

ప్రకాష్‌: ఏరా రెంటికి చెడ్డ రేవడిలా మారుస్తావా..? ఏంటి.  ఇక్కడ నిజంగా తినడానికి ఏముందిరా..?

రాజ్‌:  అందరూ కుళ్లుకునేలాగా స్పెషల్‌ బిర్యానీ ఆర్డర్‌ చేయించి మరీ తెప్పించాను. స్పైసీ బిర్యాని.

రుద్రాణి: నువ్వు సూపర్‌ రా..

స్వప్న: కొపందీసి కారం తెప్పించావా..?

అనగానే వెటకారమా..? అంటూ రాజ్‌ బిర్యానీ ఓపెన్‌ చేస్తాడు. రాజ్‌ స్వయంగా అందరికీ బిర్యానీ వడ్డిస్తాడు. కావ్య కూడా బామ్మా, తాతయ్యలకు వడ్డిస్తుంటే అందరూ కావ్య వంటల వైపు ఆశగా చూస్తారు.

కావ్య: ఆహా గుమగుమలాడిపోయే పప్పు తాతయ్యగారు తినండి.

ప్రకాష్‌: ఓరేయ్‌ పప్పు  అంటరా..?

రాజ్:  బాబాయ్‌ ఇక్కడ బిర్యానీ..

కావ్య: అమ్మమ్మగారు చోలే కర్రి మీకోసం స్పెషల్‌ గా చేశాను. ఒకసారి టేస్ట్‌ చూడండి

ప్రకాష్‌: ఓరేయ్‌ చోలే కర్రి అంటరా..? మసాలారా..

రాజ్:  చోలే అన్నావంటే నువ్వు పోయేదాకా నీకు పాటలు వినిపిస్తాను. ఇందులో మసాలా ఉంది తిను.

ఇందిరాదేవి: అబ్బా ఎంత బాగుందో కావ్య.. నీ చేతి వంట తిని ఎన్ని రోజులు అయిందో

కావ్య: అమ్మమ్మగారు కడుపు నిండా తినండి వడ్డిస్తాను.

అని వడ్డిస్తుంది కావ్య. ఇక రాజ్‌ తెచ్చిన బిర్యానీ తిన్నవాళ్లందరూ కారంగా ఉండటంతో ఒక్కొక్కరుగా కావ్యతో భోజనం వేయించుకుని తిటుంటారు. రాహుల్‌ కూడా సారీ మమ్మీ అంటూ కావ్య తెచ్చిన భోజనమే తింటాడు. రాజ్‌, రుద్రాణి మాత్రం ఇజ్జత్‌ పోతుందని అదే బిర్యానీ తింటారు. ఇక కారం తట్టుకోలేక ఇద్దరూ కిచెన్‌ లోకి వెళ్లి పంచదార తీసుకుని తింటారు. వాళ్ల తిప్పలు చూసిన మిగతా వాళ్లు నవ్వుకుంటారు. తర్వాత కావ్య కిచెన్‌ లో ఉంటే రాజ్‌ వస్తాడు.

రాజ్:  ఏయ్‌ ఏం చేస్తున్నావు…?

కావ్య: పాత్రలకు పట్టిన దుమ్ము దులుపుతుంటే ఎంతకీ వదలడం లేదు. అది వదిలించే పనిలో ఉన్నాను. 

రాజ్: ఈ ఇంట్లో పనిమనిషి ఉంది.

కావ్య: కానీ ఇంటి మనిషి లేరు ఒక్కోక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు

రాజ్:  బయటకు వెళ్లే వాళ్లు వెళ్తారు. లోపలికి వచ్చే వాళ్లు వస్తారు. వంట మనిషిగా ఎత్తిన అవతారం చాలు.. పనిమనిషిలా మారిపోయి మా నాన్నమ్మ తాతయ్యల దగ్గర మార్కులు కొట్టేయాలనుకుంటున్నావా..?

కావ్య: పరీక్షే రాయని వాళ్లు మార్కుల కోసం ఎలా ఎదురుచూస్తారు. డిజైన్స్‌ వేయకుండానే వేసినట్టు నాటకం ఆడి సీఈవో సీటు కొట్టేసినట్టు అందరూ మీలాగా నాటకం ఆడరు.

రాజ్: నీ ఆటలు నా దగ్గర సాగవు.

కావ్య: సాగుతున్నాయి కదా..? ఇంకా ఏం చేస్తారు.

అంటూ అమ్మమ్మ, తాతయ్య భోజనానికి ఇబ్బంది పడకూడదని రాత్రికి కూడా బోజనం చేసి వెళ్తాను. మీకు అభ్యంతరం ఉంటే వెళ్లి వాళ్లతో మాట్లాడుకోండని చెప్తుంది కావ్య. కావ్యను ఎలాగైనా ఇంట్లోంచి పంపించేయాలని రాజ్‌ ప్లాన్‌ చేస్తాడు. తర్వాత అపర్ణ,  ఇందిరాదేవికి ఫోన్‌ చేసి కావ్య మీద మీకు ఇసుమంత జాలి. కొసరంత కరుణ  ఏమైనా ఉన్నాయా..? అని  అడుగుతుంది. ఇంట్లో ఇలాంటి పరిస్థితులు పెట్టుకుని మీకు ఎలా భోజనం చేయాలనిపిస్తుందండి అని నిలదీస్తుంది.

భోజనం విషయంలో మమ్మల్ని కడుపు చంపుకుని ఉండమని చెప్పకు అంటూ ఫోన్‌ కట్‌ చేస్తుంది ఇందిరాదేవి. తర్వాత కావ్య ఇంటికి వెళ్తుంటే రాజ్‌ వచ్చి ఈరోజు మా ఇంటికి నువ్వు తీసుకొచ్చిన ఫుల్‌ మీల్స్‌కు డబ్బులు అంటూ ఇస్తాడు. దీంతో కావ్య కోపంగా రాజ్‌ను తిడుతూ మీకు నిలువెల్లా అహంకారం నిండిపోయిందని.. మీ తలతిక్క నిర్ణయాల వల్ల మీ కన్నతల్లే మిమ్మల్ని అసహ్యించుకుని మా ఇంటికి వచ్చి ఉంటున్నారని తిడుతుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
Embed widget