అన్వేషించండి

Brahmamudi Serial Today December 6th:  ‘బ్రహ్మముడి’ సీరియల్:  కుప్పకూలిపోయిన సీతారామయ్య – అప్పుకు నిజం చెప్పిన అనామిక

Brahmamudi Today Episode: ఆస్థులు పంచాలని ధాన్యలక్ష్మీ ఉరి వేసుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  కళ్యాణ్‌ ఆఫీసుకు వెళ్తుంటే అనామిక వస్తుంది. కళ్యాణ్‌ను అవమానిస్తుంది. పదివేల చెక్కు తీసుకొని వచ్చి నా దగ్గర బిల్డప్‌ కొట్టావు ఆరోజు కానీ ఆ పదివేలు మీ ఆయన ఊడిగం చేస్తే వచ్చాయి అని అప్పును తిడుతుంది. నీకున్న గుడ్డి నమ్మకమే కళ్యాణ్‌ నిన్ను తిక్కదాన్ని చేసి ఆడుకునేలా చేసింది అంటుంది.

అప్పు: ఇంకోసారి తిక్క గిక్క అన్నావంటే మర్యాదగా ఉండదు. మోసం చేయడాలు.. వెన్నుపోటు పొడవడాలు నీలాంటి దానికి అలవాటు.

అనామిక: అంతలేదు ఇక్కడ లిరిక్‌ రైటర్‌ దగ్గర కాళ్లు పట్టి టీ పెడితే వచ్చిన చెక్కు అది. ఇప్పుడు చెప్తున్నాను కదా..? నువ్వు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటావు. నిన్ను చూసి నేను ఎప్పుడూ జాలి పడుతూనే ఉంటాను. ఇంకెప్పుడు చిల్లర రాతల చెక్కులు తీసుకొని వచ్చి టెక్కులు పడకు

అని చెప్పి  అనామిక వెళ్లిపోతుంది. ఏంటిది కూచి అని అప్పు అడగ్గానే నువ్వు బాధపడతావని నిజం చెప్పలేదు అంటాడు కళ్యాణ్‌. ఇంకోసారి ఇలా చేయకు ఎవరో వచ్చి చెప్పే కన్నా ఏదైనా నువ్వు చెబితేనే నాకు సంతోషం అంటుంది అప్పు. సరేనంటాడు కళ్యాణ్‌. ధాన్యలక్ష్మీ ఆలోచిస్తుంటే రుద్రాణి వచ్చి చావు నాటకం ఆడమని చెప్తుంది. ఇంతలో కావ్యను తీసుకుని అపర్ణ, ఇందిరాదేవి, సీతారామయ్య వస్తారు. వాళ్లు ఇంట్లోకి అడుగుపెట్టగానే ధాన్యలక్ష్మీ ఉరి వేసుకోవడానికి ట్రై చేస్తుంది. అందరూ కంగారు వెళ్తారు. ఎందుకిలా చేస్తున్నావని అడుగుతారు.

ధాన్యలక్ష్మీ: నాకు న్యాయం కావాలి. ఈ ఇంటి వారసుడైన నా కొడుక్కి అన్యాయం జరిగింది. ఈ ఇంటి పెద్దలు ఈ కుటుంబ సభ్యులు వాడికి ఎప్పటికీ న్యాయం చేయరని అర్థమైంది. కనీసం నా చావుతోనైనా మీరు మీ నిర్ణయం మార్చుకుంటారని అప్పుడైనా నా కొడుక్కి న్యాయం చేస్తారని..

 అంటూ ఉరి వేసుకోబోతుంటే అపర్ణ వెళ్లి ధాన్యలక్ష్మీని కిందకు లాగి చెంప పగులగొడుతుంది.

అపర్ణ: ఎవరు నీ కొడుక్కి అన్యాయం చేస్తున్నారు. వాడికి అన్యాయం జరిగిందంటే దానికి కారణం నువ్వు.. వాడు బయటకు అడుగుపెట్టాడు అంటే దానికి కారణం నువ్వు.. ఇంత ఆస్థిని వాడు పూచిక పుల్లతో తీసిపడేశాడు అంటే దానికి కారణం నువ్వు.

ఇందిరాదేవి:  అవును నువ్వు నీ కోడలిని కోడలిగా ఒప్పుకుని ఉంటే వాడు బయటకు ఎందుకు వెళ్తాడు. నీ దగ్గర తప్పు పెట్టుకుని నీ అర్థం లేని షరతులు ఒప్పుకోలేదని చచ్చి ఎవరిని సాధించాలి అనుకుంటున్నావు.

రుద్రాణి: అన్ని అపూర్వ వదినకే చేస్తూ… ధాన్యలక్ష్మీకి, చిన్ననయ్యకు ఎవ్వరూ సపోర్టుగా లేకపోతే చావకపోతే ఏం చేస్తుంది.

అపర్ణ: రుద్రాణి నువ్వు ఇంకొక మాట మాట్లాడావు అంటే ఇదే ఉరి నీకు వేసి చంపేస్తాను.. అసలు నువ్వు ఆడదానివేనా..? మేము తిరిగి వచ్చేలోపే ధాన్యలక్ష్మీని ఎంత రెచ్చగొట్టి ఉంటావో మేము ఊహించలేము అనుకుంటావా..? నిజంగానే ధాన్యలక్ష్మీ ప్రాణం పోయుంటే…?

అని అపర్ణ తిట్టగానే ప్రకాష్‌ కూడా ధాన్యలక్ష్మీని తిడతాడు. నువ్వు ఏమైనా చేసుకో కానీ ఆస్థులు పంపకం అనేది జరగదు అంటాడు. ఇందిరాదేవి, రుద్రాణిని తిడుతుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ అయితే నాకు చావే గతి అనుకుంటూ ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందరూ ధాన్యలక్ష్మీని పక్కకు లాగడానికి ప్రయత్నిస్తుంటారు. వెనక నుంచి అంతా గమనిస్తున్న సీతారామయ్య స్ర్టోక్‌ రావడంతో కింద పడిపోతాడు. అందరూ కంగారు పడుతూ సీతారామయ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
Podarillu Serial Today August 10th: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget