అన్వేషించండి

Brahmamudi Serial Today August 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి స్పాట్ పెట్టిన స్వప్న – రౌడీకి బుద్ది చెప్పిన అప్పు

Brahmamudi Today Episode: కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్లిపోయాడు ఇక రాజ్ ను కూడా వెళ్లగొట్టాలని రాహుల్ , రుద్రాణి ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  ఎవరెన్ని చెప్పినా కళ్యాణ్‌ వినడు. అప్పును తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతాడు. తర్వాత కళ్యాణ్‌ కు అవమానం జరగకుండా ఆపలేకపోయానని రాజ్‌ బాధపడుతుంటాడు. తర్వాత ఆటో దిగుతున్న అప్పు పక్కనుంచి ఒకడు రాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ వెళ్తుంటే వాణ్ని పట్టుకుని బుద్ది చెప్తుంది అప్పు. దీంతో వాడు సారీ చెప్పి వెళ్లిపోతాడు.

అప్పు: ఇంకోసారి ఈ రోడ్‌లో కనిపిస్తే.. బండి ఇనుపసామానులో అమ్ముకోవాలే.. నీ బాడీ హాస్పిటల్‌లో అతుకులు వేయించుకోవాలే..

కళ్యాణ్‌: థ్యాంక్స్ అప్పు

అప్పు: ఎందుకు వాడిని కొట్టినందుకా

కళ్యాణ్‌: కాదు.. ఒక్క మాట కూడని పడని నువ్వు నాకోసం ఇవాళ అన్ని మాటలు పడినందుకు.

అప్పు: నీకు మాట ఇచ్చాను కదా. మీ అమ్మను అంటే నువ్వు బాధపడతావు. ఆ పడేదేదో నేనే పడదామని. అయినా ఇవాళ మీ అమ్మ కొత్తగా ఏమంది.

 అని అప్పు చెప్పగానే కళ్యాణ్‌ మరోసారి సారీ చెప్తాడు. దీంతో మన తప్పుకు మనమే సారీ చెప్పుకోవాలి. వాళ్లు చేసిన తప్పుకు మనమే సారీ చెప్పుకోవాలా? అంటుంది అప్పు. ఇంతలో రాజ్ కాల్ చేసి జరిగినదానికి చాలా ఫీల్ అవుతున్నట్లు చెబుతాడు. దాంతో కల్యాణ్ నవ్వుతాడు.  అక్కడ జరిగింది అక్కడే దులిపేసుకుని వచ్చింది అన్నయ్య అప్పు అంటాడు కళ్యాణ్‌. అలాగే నువ్వు వదినను ఏమీ అనకు అని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తాడు. తర్వాత రాజ్‌ దగ్గరకు కావ్య వస్తుంది.

రాజ్: నీకు మంచి స్టఫ్ దొరికింది కదా..  నీవు చెప్పినట్లు ఓడిపోయాను కదా! ఇప్పుడు నీకు అడ్డంగా దొరికిపోయాను కదా!

కావ్య: నేను ఏం అనలేదు. అన్నీ మీరే అనుకుంటున్నారు.

రాజ్‌: నీకు అనే ఛాన్స్ ఇవ్వలేదు. నాకు నేనే అనుకుంటున్నాను. దటీజ్ స్వరాజ్

కావ్య: పోనిలేండి ఇన్నాళ్లు మీరెంత ఫూలిష్‌గా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకున్నారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నారు.

రాజ్‌: ఏంటే నేను ఇన్ని అనుకున్నా నువ్వు సెటైర్లు వేస్తున్నావ్

కావ్య: దటీజ్ కళావతి.. డాటర్ ఆఫ్ కనకం.

 అని కావ్య అనగానే రాజ్‌ వెళ్లిపోతుంటాడు. కావ్య ఆపి మీ అంచనాలన్నీ చెల్లాచెదురయ్యాయి కదా? అంటుంది. అవునని కానీ కళ్యాణ్‌ ఇక్కడే ఉంటే సమస్య పరిష్కారం అవుతుందనుకున్నాను కానీ సమస్య ఇంట్లోనే ఉంది. ఇంట్లో వాళ్లు మారితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటాడు రాజ్‌. తర్వాత తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు రుద్రాణి, రాహుల్ మందు తాగుతుంటారు.

రుద్రాణి:  మొదటిసారి విజయం దక్కింది. ధాన్యలక్ష్మీ పిచ్చిది కాకపోతే నేను చెప్పిన మాటలు విని కొడుకును దూరం చేసుకుంది.

రాహుల్‌: అవును మామ్‌ కల్యాణ్ ఇక ఇంటికి రాడు. కల్యాణ్ వచ్చేదాక రాజ్ కంపెనీ జోలికి రాడు.

రుద్రాణి: కానీ, కావ్య ఉంది. అది ఏదోటి చేస్తుంది కాబట్టి. రాజ్ ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేయాలి. వాడు ఒంటరివాడై డిప్రెషన్‌లోకి వెళ్లాలి. అప్పుడే మనకు ఈ కంపెనీ దక్కుతుంది.

  అప్పుడే అటువైపుగా వెళ్తున్న స్వప్న వాళ్లను చూస్తుంది.

స్వప్న: నా చెల్లిని అవమానించి సిగ్గులేకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నారా..?  మీ సంతోషమే మీకు శాపంగా మారేలా చేస్తాను చూడండి.

 అనుకుంటూ వెళ్లిపోతుంది స్వప్న. తర్వాత అపర్ణ, ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్లి కన్వీ్న్స్‌ చేయాలని చూస్తుంది. తాను కావ్య విషయంలో మొదట్లో ఎంతలా అపార్థం చేసుకున్నదో.. తర్వాత ఎంతగా గిల్టీగా ఫీలవుతుందో చెప్తుంది. నీ కోపం ఖరీదు నీ కన్నకొడుకును శాశ్వతంగా దూరం చేసుకోవడమే అని అపర్ణ చెప్పగానే ధాన్యలక్ష్మీ సీరియస్‌ అవుతుంది. పొలిటికల్‌ లీడర్‌ లాగా మాటలు బాగానే చెప్తున్నావు అంటుంది. నీ కోడలు నిన్ను తన గుప్పిట్లో పెట్టుకున్నట్లే ఆ అప్పు చేత నన్ను గుప్పిట్లో పెట్టుకోవడానికి నిన్ను రాయబారానికి కావ్య పంపిందా? అంటూ ప్రశ్నిస్తుంది. ఎప్పటికీ ఆ అప్పును కోడలిగా ఒప్పుకోనని ధాన్యలక్ష్మీ చెప్పడంతో అపర్ణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

    మరోవైపు రుద్రాణి బెడ్ రూమ్‌లో లాఫింగ్‌ గ్యాస్‌ నింపిన బెలూన్స్ పెడుతుంది స్వప్న.  ఇంతలో రాహుల్‌ బెడ్‌ రూంలోకి వచ్చి ఒక బెలూన్‌ పగులగొట్టి హ్యాపీ బర్తుడే మామ్‌ అంటాడు. ఇంతలో లాఫింగ్‌ గ్యాస్‌ బయటకు రావడంతో రుద్రాణి, రాహుల్‌ పిచ్చి పట్టినవాళ్లలా నవ్వుతుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget