News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Brahmamudi July 7th: కావ్య తప్పేం లేదన్న రాజ్- కోడలికి థాంక్స్ చెప్పిన అపర్ణ, అప్పుని జైలుకి వెళ్ళకుండా కాపాడేదేవరు?

స్వప్న దుగ్గిరాల ఇంటి కోడలు కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

కావ్య కళ్యాణ్ కి ఫోన్ చేసి మీ అన్నయ్యకి బాగోలేదు ఆస్తమా ఎక్కువైందని చెప్పి ఏడుస్తుంది. వెంటనే ఫోన్ రిసెప్షన్ వాళ్ళతో మాట్లాడి బిల్ పే చేస్తాడు. ఇంకేం కంగారు పడొద్దని ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కంపెనీ కారు కూడా వస్తుందని ధైర్యం చెప్తాడు. వదిన చాలా కంగారు పడుతుంది అప్పుకి ఫోన్ చేసి చెప్తే తను తోడుగా ఉంటుందని అనుకుని కాల్ చేస్తాడు కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. డబ్బులు కట్టిన తర్వాత డాక్టర్ రాజ్ కి ట్రీట్మెంట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్ లోనే ఉండి కాలం వృధా చేయడం అనవసరం. సీతారామయ్య దగ్గరకి వెళ్దాం. జరిగింది మొత్తం చెప్పి అప్పుని కాపాడమని అడుగుదామని చెప్తుంది. కానీ కృష్ణమూర్తి ఒప్పుకోడు. ఈరోజు కష్టం వచ్చిందని ఆలోచించకుండా అడగాలని అంటున్నావ్ కానీ మనం వాళ్ళకి వియ్యంకులం ఎలా అయ్యామో ఆలోచించావా? మీ కూతుళ్లని ఇలాగేనా పెంచేదని మాటలు అంటారు. ఇప్పుడిప్పుడే కావ్యతో అల్లుడు బాగుంటున్నాడు మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళ మధ్య గొడవలు జరుగుతాయని చెప్తాడు.

Also Read: తాగేసి రచ్చ రచ్చ చేసిన మురారీ- డైరీ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు గీతికని కలిసిన కృష్ణ

రాజ్ కళ్ళు తెరిచేసరికి కావ్యకి ప్రాణం లేచివచ్చినట్టు అవుతుంది. ఎలా ఉందని అడుగుతుంది. మీ ఆవిడ ట్రీట్మెంట్ కాస్త లేట్ అయ్యేసరికి మాతో ఒక ఆట ఆదుకున్నారని డాక్టర్ రాజ్ కి చెప్తుంది. హాస్పిటల్ నుంచి రాజ్ వాళ్ళు ఇంటికి వస్తారు. రాజ్ కోసం గబగబా వంట చేసి తీసుకొస్తుంది. తినమని అంటే వద్దని అంటాడు. ఇంత జరిగినా మీకు పంతం పోలేదా అంటే పంతం కాదు ఓపిక లేదని చెప్తాడు. బతిమలాడి అన్నం తినేలా చేస్తుంది. కనకం వాళ్ళు స్టేషన్ దగ్గరే ఉంటారు. ఒక కానిస్టేబుల్ వచ్చి అప్పుకి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని అంటుంది. తప్పకుండా శిక్ష పడుతుంది. పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కేసు వెనక్కి తీసుకునేలా చేయమని అది కూడా కోర్టుకి అప్పుని తీసుకెళ్ళేలోపు తీసుకురమ్మని చెప్తుంది. ఒకసారి జైలుకి వెళ్తే జీవితం అయిపోయినట్టేనని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం విని కృష్ణమూర్తి దంపతులు మరింత కంగారుపడతారు.  

సీతారామయ్య తప్ప ఎవరూ లేరని ఆయన్నే బతిమలాడుకుందామని కనకం వాళ్ళు బయల్దేరతారు. కావ్య రాజ్ మంచం పక్కన కూర్చుని అలాగే నిద్రపోతుంది. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వస్తారు. రాజ్ కి ఎలా ఉందని అడుగుతారు.

అపర్ణ: ఎంత ధైర్యం నీకు నా కొడుక్కి ఇంత జరిగినా మాలో ఎవరికీ ఒక్క ఫోన్ కూడా చేయకుండా ఉన్నావ్. ఎవరు ఇచ్చారు నీకు ఆ హక్కు

కావ్య: ఈ తాళి నాకు ఆ హక్కు అధికారం ఇచ్చాయి

అపర్ణ: నోర్ముయ్ రాజ్ దుగ్గిరాల వారసుడు తన వెనుక ఇంత పెద్ద కుటుంబం ఉంది. మేమంతా ఏమైపోయాం అనుకున్నావ్? చెప్పాలసిన అవసరం లేదా

కావ్య: చెప్పాలి కానీ చెప్పే టైమ్ నాకు లేదు

రుద్రాణి: నీ లిమిట్స్ లో నువ్వు ఉండు మా రాజ్ కి అంత సీరియస్ గా ఉంటే మాతో చెప్పాలి కదా

ఇంద్రాదేవి: ఆగండి ఎందుకు అందరూ కట్టకట్టుకుని తన మీద అరుస్తున్నారు. అసలు ఏం జరిగింది

కావ్య: నా భర్త పరిస్థితి చూసి విలవిల్లాడిపోయాను. అప్పుడు ఎవరికైనా చెప్పాలని అనిపించడం కాదు ఆయన్ని కాపాడుకోవడమే నా బాధ్యత అనుకున్నా

Also Read: భర్తని చూసి గుండెలు పగిలేలా ఏడ్చిన కావ్య- కోడలిని అపార్థం చేసుకుని నోటికొచ్చినట్టు తిట్టిన అపర్ణ

అపర్ణ: ఒక్కరోజు ఊర్లో లేకపోతే వాడిని హాస్పిటల్ పాలు చేశావ్. ఇక నిన్ను నమ్మి నా కొడుకుని నీ చేతుల్లో ఎలా ఉంచాలి. వాడికి అన్ని జాగ్రత్తలు తెలుసు నువ్వే అజాగ్రత్తగా ఉన్నావ్ అందుకే వాడికి ఈ పరిస్థితి వచ్చింది. మీ కుటుంబమే ఇంత మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ జీవితాలు నాశనం అవ్వాల్సిందే. మీ వల్ల మాకు ఏనాడూ మనశ్శాంతి లేకుండ పోయిందని అంటుండగా కనకం వాళ్ళు వచ్చి ఆ మాటలు వింటారు. నీలాంటి దాన్ని నమ్మి ఇల్లు అప్పగించి పోతే మొత్తం సర్వనాశనం చేశావ్ ఏం కుటుంబం మీది

కావ్య: చేయని తప్పుకి నన్ను అంటున్నారు మా కుటుంబాన్ని ఎందుకు అంటారు

అపర్ణ: నీ కుటుంబం ఎలాంటిదో మీ అక్క సాక్ష్యం అనేసరికి కనకం వాళ్ళు బాధగా గుమ్మంలో నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోతారు. 

సీతారామయ్య: వాళ్ళ కుటుంబం ఎలాంటిది అయినా ఇప్పుడు వాళ్ళు ఈ ఇంటి కోడళ్ళు అలా మాట్లాడితే తప్పు

రాజ్ కిందకి వచ్చి చూస్తాడు. అందరూ ఎలా ఉన్నావని ఆరా తీస్తారు. ఎందుకు కళావతిని నిందిస్తున్నావని అడుగుతాడు. నీకు ఇలా అవడానికి కారణం కళావతే కదా అంటుంది.

రాజ్: లేదు చేయని తప్పుకి ఎవరినీ నిందించకూడదు మమ్మీ. నేనే వద్దని వినకుండా ఐస్ క్రీమ్ తిన్నాను. సమయానికి తనే సెక్యూరిటీ స్కూటీ మీద నన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళింది

Published at : 07 Jul 2023 08:31 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial July 7th Episode

ఇవి కూడా చూడండి

Nindu Noorella Saavasam November 29th Episode: చిత్రగుప్తుడి మాటలకు కంటతడి పెట్టుకున్న అరుంధతి.. మనోహరికి చీవాట్లు పెట్టిన అమరేంద్ర!

Nindu Noorella Saavasam November 29th Episode: చిత్రగుప్తుడి మాటలకు కంటతడి పెట్టుకున్న అరుంధతి.. మనోహరికి చీవాట్లు పెట్టిన అమరేంద్ర!

Naga panchami November 28th Episode : నన్ను కాటేసి చంపేది నువ్వే.. పంచమికి షాక్ ఇచ్చిన మోక్ష!

Naga panchami November 28th Episode : నన్ను కాటేసి చంపేది నువ్వే.. పంచమికి షాక్ ఇచ్చిన మోక్ష!

Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!

Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!

Brahmamudi Promo: కావ్య రాజ్ ముందు అడ్డంగా బుక్కైనా రాహుల్.. రేపటి ఎపిసోడ్​లో రుద్రాణికి చుక్కలే!

Brahmamudi Promo: కావ్య రాజ్ ముందు అడ్డంగా బుక్కైనా రాహుల్.. రేపటి ఎపిసోడ్​లో రుద్రాణికి చుక్కలే!

Guppedantha Manasu Promo: రిషిధార అభిమానులకు పండుగలాంటి ఎపిసోడ్.. రిషి వసు మధ్య సూపర్ సీన్!

Guppedantha Manasu Promo: రిషిధార అభిమానులకు పండుగలాంటి ఎపిసోడ్.. రిషి వసు మధ్య సూపర్ సీన్!

టాప్ స్టోరీస్

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి