News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు- చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్

బిగ్ బాస్ మూడో పవర్ అస్త్ర కోసం ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చాడు. అందులో కూడ చివరికి గొడవలతో ముగిసింది.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ ఇంట్లో పవర్ అస్త్ర కోసం గాలా పార్టీ జరుగుతోంది. ఇప్పటి వరకు ఫిజికల్ గా టాస్క్  లు ఇచ్చి గొడవలు పెట్టిన  బిగ్ బాస్ మూడో కంటెస్టెంట్ కోసం మంచి ఎంటర్ టైన్మెంట్ ఏర్పాటు చేశారు. గాలా పార్టీలో ఎవరు క్రియేటివ్ గా తయారై మెప్పిస్తారో వారిలో ఒకరిని పవర్ అస్త్ర కోసం పోటీ పడేందుకు మూడో కంటెస్టెంట్ గా నిలుస్తారని బిగ్ బాస్ వెల్లడించారు. దీంతో అందరూ తమలోని క్రియేటివిటీని బయటకి తీశారు. ప్రియాంక జైన్ దెయ్యం పిల్లలాగా రెడీ అయిపోయి భయపెట్టేందుకు ట్రై చేసింది కానీ తనని చూస్తే మాత్రం ప్రేక్షకులకి వాంతులు అయ్యే విధంగా అనిపించింది. భయంకరమైన మేకప్ వేసుకుని ప్రేక్షకుల్ని ఇరిటేట్ చేశారు. దీనికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు.

Also Read: మైఖేల్ బెండు తీసిన కనకం- ఇంటికి తిరిగొచ్చిన స్వప్న, రాహుల్ మైండ్ బ్లాక్!

ఈ గాలాలో శుభశ్రీ కాస్త విభిన్నంగా రెడీ అయ్యింది. శుభశ్రీ ఇంటి పనులు చేయడం లేదని రొటీలు చేస్తూ కనిపించిందని అమర్ పలు సార్లు ప్రస్తావించేవాడు. దీంతో తనే రోటీ మేకర్ గా రెడీ అయిపోయింది. చపాతీ కర్రలు చెవులకి జూకాలుగా తగిలించుకుని మెడలో చపాతీ చేసే పాన్ అన్నీ వేసుకుని విచిత్రంగా రెడీ అయ్యింది. జిగేల్ రాణి పాటకి డాన్స్ వేసి మంచి ఎంటర్ టైన్మెంట్ అందించింది. తన డాన్స్ చూస్తుంటే హార్ట్ మెల్ట్ అయిపోతుందని సందీప్ అనడంతో తెగ సిగ్గుపడిపోతుంది. ఈ రోటీ కోసమే కదా నామినేట్ అయ్యింది అందుకే రోటీ మేకర్ లాగా రెడీ అయ్యాయని వయ్యారాలు పోతూ చెప్తుంది. ఇక డాక్టర్ బాబు రేమో మాదిరిగా మారిపోయి డాక్టరమ్మతో డాన్స్ చేసేస్తాడు. అబ్బాయిల నుంచి రక్షించమన్నారు కదా అని మోనిత మీద చేయి వేసి మాట్లాడేసరికి సందీప్ సరదాగా చేయి తియ్యి అని మాట్లాడతాడు.

Also Read: కన్నీళ్లతో జగతికి ప్రామిస్ చేసిన రిషి, శైలేంద్రకి మొదలైన కౌంట్ డౌన్!

సగం ఆడ, సగం మగవాడిగా వేషం వేసుకున్న అమర్ తన వంతుగా పెర్ఫామెన్స్ ఇచ్చేశాడు. ఇక ఈ గాలాకి సంచాలకుగా ఉన్న శివాజీ, శోభా శెట్టి, సందీప్ తమ నిర్ణయాన్ని చెప్పారు. అందరి కంటే క్రియేటివ్ గా సుబ్బు(శుభశ్రీ) ఉందని అనిపించిందని సందీప్ చెప్తాడు. ఆ మాటకి అమర్ దీప్ సీరియస్ అయిపోతాడు. ఎంటర్ టైనమెంట్ తను ఏం ఇవ్వలేదని అక్కడ ఏం అనిపించిందని గట్టిగా నిలదీశాడు. కావలసిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళడం కరెక్ట్ కాదని అరిచాడు. సుబ్బు ఇన్నోవేటివ్ గా అనిపించిందని శివాజీ చెప్పినా కూడ అమర్ వినిపించుకోకుండా సీరియస్ అరిచేసి వెళ్ళిపోతాడు.

అంతకుముందు ఇచ్చిన బిగ్ బ్యాంక్ టాస్క్ లో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ గెలిచారు. ఈ సందర్భంగా బిగ్ బాస్.. ‘గ్లాస్ ఈజ్ షార్ట్.. ఫిల్ ఇట్ ఫాస్ట్’ అనే టాస్క్ ఇచ్చాడు. ఎవరైతే ఎక్కువగా ఏడ్చి కన్నీటిని ఆ గ్లాసులో నింపుతారో.. ఆ టీమ్ విన్ అయినట్లని బిగ్ బాస్ తెలిపాడు. అయితే, ఈ టాస్క్‌ను పూర్తిగా చూపించలేదు. ఇప్పటికే లైవ్‌లో ఈ టాస్క్ చూసిన మీమర్స్ ట్రోల్ చేయడంతో ఎక్కువ ఫూటేజ్‌ను టెలికాస్ట్ చేయలేదు. ఈ టాస్క్‌లో యావర్, పల్లవి ప్రశాంత్‌లు విజేతలుగా నిలిచారని బిగ్ బాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌లు.. అమర్ దీప్, గౌతమ్ వద్ద ఉన్న కాయిన్స్ మొత్తం తీసుకుని విజేతలుగా నిలిచారు. ఇద్దరూ పవర్ అస్త్ర కంటెస్టెంట్‌లుగా నిలిచారు.

Also Read: ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా - వింత అవతారాల్లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు, దెయ్యం పిల్లగా ప్రియాంక!

View this post on Instagram
 
A post shared by STAR MAA (@starmaa)

Published at : 29 Sep 2023 11:58 AM (IST) Tags: Bigg Boss Telugu Bigg Boss Telugu Updates amardeep Bigg boss daily Updates Bigg Boss season 7 Shubhasree

ఇవి కూడా చూడండి

Shobha Shetty: బిగ్ బాస్: 14 వారాలకు శోభా శెట్టి అందుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?

Shobha Shetty: బిగ్ బాస్: 14 వారాలకు శోభా శెట్టి అందుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?

Krishna Mukunda Murari Serial December 11th Episode నా భర్త ఇక్కడే, నా పక్కనే ఉన్నారు.. మురారికి హింట్‌ ఇచ్చిన కృష్ణ!

Krishna Mukunda Murari Serial December 11th Episode నా భర్త ఇక్కడే, నా పక్కనే ఉన్నారు.. మురారికి హింట్‌ ఇచ్చిన కృష్ణ!

Bigg Boss 7 Telugu: అమర్, అలా అడిగేశావ్ ఏమిటీ? నాగార్జున ధరించిన ఆ స్వెటర్ ధర ఎంతో తెలుసా?

Bigg Boss 7 Telugu: అమర్, అలా అడిగేశావ్ ఏమిటీ? నాగార్జున ధరించిన ఆ స్వెటర్ ధర ఎంతో తెలుసా?

Bigg Boss 7 Telugu: అమర్‌కు ‘బిగ్ బాస్’ సర్‌ప్రైజ్ - చూస్తుంటే బాధగా ఉందంటూ వ్యాఖ్యలు

Bigg Boss 7 Telugu: అమర్‌కు ‘బిగ్ బాస్’ సర్‌ప్రైజ్  - చూస్తుంటే బాధగా ఉందంటూ వ్యాఖ్యలు

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

టాప్ స్టోరీస్

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే  ఏప్రిల్‌లోనే అవకాశం !

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు