అన్వేషించండి

Prema Entha Madhuram August 23rd: పరాయి మొగుడితో రోడ్డుపై సరసం ఆడటానికి కాస్తైన సిగ్గు ఉండాలి - అంజలి వ్యాఖ్యలపై నీరజ్ ఎలా స్పందించాడు?

అనుకి అగ్ని ప్రమాదం జరుగుతుండగా వెంటనే ఆర్య వచ్చి కాపాడటంతో సీరియల్ ఆసక్తిగా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema Entha Madhuram August 23rd: అను నుంచి వచ్చిన లెటర్ ను భానుతో చదివించి ఆ మాటలు వింటూ తనను బాగా గుర్తుకు చేసుకుంటాడు ఆర్య. అందులో అను ఆర్య క్షేమం గురించి.. ఆయన విజయం గురించి ధైర్యం చెప్పే మాటలు మాట్లాడుతుంది. అంత విన్నాక అను తనతోనే ఉందని ఆ లెటర్ చదవగానే అను తన దగ్గరికి వచ్చి నిలబడి మాట్లాడినట్టు ఉందని.. త్వరలోనే తను ఇంటికి వస్తుందని.. తనని ఎలాగైనా ఇంటికి తీసుకొస్తానని అంటాడు.

మరోవైపు ఛాయాదేవి జరిగిన విషయాన్ని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఫ్యామిలీని అడ్డు పెట్టుకొని బెదిరిస్తే భయపడలేదని ఆర్యను తలచుకొని కోపంగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే మదన్ వచ్చి ఆర్య ఆలోచనలు అంచనా వేయలేమని చెప్పాను కదా అని అంటాడు. భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉన్న వారిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందని అంటాడు.

ఇక ఛాయాదేవి ఆర్యను దెబ్బ కొట్టాలంటే పగ ఒక్కటే కాదు అని ఇంకా ఏం చేయాలో అదే చేస్తానని పొగరుగా అనుకుంటుంది. తన పని అయ్యే వరకు వదిలిపెట్టనని అంటుంది. ఆర్య ఇంటి బయటికి అను వచ్చి ఆర్య మాట్లాడిన మాటలు తలుచుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఆర్యకు తన మీద ఉన్న ప్రేమ గురించి చెబుతూ ఉంటుంది. అదే సమయంలో నీరజ్ రావడాన్ని గమనించి సైలెంట్ అవుతుంది.

మాన్సీ పార్టీలో ఉన్న ఒక అమ్మాయికి ఫోన్ చేసి తొందరగా పని పూర్తి చేసి ఫోన్ చేయమని చెబుతుంది.  ఇక ఆ అమ్మాయి వెలుగుతున్న క్యాండిల్ తీసుకొని అను కాళ్ల దగ్గర పెడుతుంది. ఇక మాన్సీ అగ్నిప్రమాదం జరుగుతుందని సంతోషపడుతుంది. జిండే ఆర్యతో అను నుంచి వచ్చిన లెటర్ ని ట్రేస్ చేద్దాము అని అనటంతో కచ్చితంగా చేద్దాము కానీ తను కేర్ గా ఉండొచ్చు అని అంటాడు.

ఇక ఆర్య ఇంట్లో నుండి అను డ్రెస్ కాలిపోతున్న దానిని గమనించి వెంటనే భాను అంటూ బయటికి పరిగెత్తి ఆ మంటను ఆపి తనను ఒక దగ్గర కూర్చోబెడతాడు. ఇక అందరూ వచ్చి నిజం తెలుసుకొని షాక్ అవుతారు. ఇక అందరూ అనుని ఈ ఒక్క పూటకు అక్కడే ఉండమని అనటంతో పిల్లలు ఉన్నారని చెబుతుంది. ఇక నీరజ్ దంపతులు వాళ్లని డ్రాప్ చేయడానికి వెళ్తారు.

అను వాళ్ళని డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వస్తుంటారు. ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కార్ ట్రబుల్ ఇస్తుంది. ఇక ఇద్దరు కారు దిగుతారు. నీరజ్ కార్ చెక్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో.. ఒక కారు వచ్చి అంజలి పైపు లైట్ కొడుతూ ఆఫ్ చేస్తూ ఉంటారు.  వెంటనే నీరజ్ ఎవరు అని కోపంగా అరవడంతో కార్లో నుండి మాన్సీ దిగుతుంది. మాన్సీని చూసి వారిద్దరూ షాక్ అవుతారు.

ఇక మాన్సీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు.. మీ రొమాంటిక్ మూడ్ ను డిస్టర్బ్ చేసినట్లు ఉన్నాను..  పరాయి మొగుడితో రోడ్డుపై సరసం ఆడటానికి కాస్తైన సిగ్గు ఉండాలి అని అంజలిని అనటంతో వెంటనే నీరజ్  తనపై ఫైర్ అవుతాడు. అంజలి తన భార్య అని.. నాతో జీవితాంతం కలిసి ఉండే నా భార్య అని తన దగ్గరికి తీసుకొని గట్టిగా చెబుతాడు.

మరి నేనెవరిని అంటూ పొగరుగా అడుగుతుంది మాన్సీ. నీరజ్ ను తక్కువ చేసి మాట్లాడటంతో అంజలి మాన్సీకి వార్నింగ్ ఇస్తుంది. అతడు నా భర్త అంటూ గట్టిగా చెబుతుంది. ఇక మాన్సీ మళ్ళీ కోర్టులో కేసు పెడతాను అని బెదిరిస్తుంది. దాంతో నీరజ్ నీ అదృష్టాన్ని పరీక్షించుకో అంటూ అక్కడినుంచి అంజలిని తీసుకొని వెళ్తాడు. ఇక అను గదిలో ఒంటరిగా కూర్చుని గతాన్ని తలుచుకుంటూ భయపడుతూ కనిపిస్తుంది.

 

also read it : Intiki Deepam Illalu serial: ఆ సీరియల్‌లో నెల ముందే వినాయక చవితి సంబరాలు - అంత తొందరేలా అంటోన్న నెటిజన్స్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Embed widget