Prema Entha Madhuram June 21th: రౌడీలను చితక్కొట్టిన అను-మాన్సీ చేసిన నాటకాన్ని బయటపెట్టిన నకిలి జోగమ్మ?
అనుని చంపడానికి రౌడీలు రావడంతో వెంటనే అను వారిని తిరిగి చితకొట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram June 21th: మాన్సీ జోగమ్మ గురించి సపోర్టుగా మాట్లాడటంతో వెంటనే అంజలి.. ఏ కుట్ర వెనుక ఎవరి హస్తముందో అని అంటుంది. అప్పుడే ఆర్య ఎదురింటి వాళ్ళ సిసి ఫుటేజ్ తీసుకొని రమ్మని జెండాకు చెబుతాడు. ఇక మాన్సీ కి టెన్షన్ మొదలవుతుంది. మరోవైపు అను బిడ్డతో ఆడుకుంటూ ఉండగా అప్పుడే బొమ్మలమ్మ వ్యక్తి దగ్గర ఒక బొమ్మ తీసుకొని పిల్లలతో ఆడుకుంటుంది.
అదే సమయంలో రౌడీలు వచ్చి గట్టిగ డోర్ కొట్టడంతో అన్ని వేరే గదిలోకి వెళ్లి కిటికీలో నుండి చూసి రౌడీ లని తెలుసుకుంటుంది. వాళ్లని చూసి భయపడుతుంది. ఇక జెండే సిసి ఫుటేజ్ తీసుకురావటంతో అందులో మాన్సీని సైగల్ చూసి ఆర్యకు అనుమానం వస్తుంది. తనను గట్టిగా అడగటంతో మాన్సీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది.
మాన్సీ వెనుకాల పని మనిషి గంగా ఉండటంతో ఆర్య తను పిలిపిస్తాడు. మాన్సీ మేడం నేను సైగల్ చేస్తుంటే చూస్తున్నాను అని అంటుంది. జెండే గట్టిగా బెదిరించడంతో ఆ జోగమ్మ మా వీధిలోనే ఉంటుంది అని చెప్పటంతో మాన్సీ మరింత భయపడుతుంది. వెంటనే ఆర్య ఆ జోగమ్మ ఇక్కడ ఉండాలి అనటంతో జండే గంగని తీసుకొని వెళ్తాడు. ఇక అను రౌడీలను చూసి భయపడి పిల్లలను బామ్మ కి ఇచ్చి ఒక గదిలో దాచిపెడుతుంది. ఇక డోర్ తీయటంతో రౌడీలు లోపలికి వస్తారు.
వాళ్లు పిల్లలు ఎక్కడ అని అడగటంతో వెంటనే అను తన వెంట తెచ్చుకున్న కారంను వారిపై చల్లి.. వారిని వైరు తీసుకొని గట్టిగా కొడుతుంది. అంతేకాకుండా వాళ్ళ దగ్గరికి లీక్ అవుతున్న సిలిండర్ ని విసిరి అగ్గిపుల్ల వెలిగించడంతో రౌడీలు భయపడి పారిపోతాడు. ఇక అను గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఇంట్లో అందరూ జోగమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
అదే సమయంలో మాన్సీ టెన్షన్ పడుతున్న విషయాన్ని గమనించి.. ఆవిడ వచ్చి దీనికి అంత కారణం నువ్వే అని చెబితే.. అని అంటుండగా మాన్సీ భయపడిపోతుంది. ఇక జెండా నకిలీ జోగమ్మని తీసుకొని రావటంతో.. భర్త లేనందుకు పిల్లల కోసం ఇలా వేషాలు వేస్తున్నాను అని చెప్పింది. మరోవైపు మాన్సీ ఏమి చెప్పొద్దు అని బెదిరిస్తూ ఉంటుంది.
వెంటనే ఆర్య అది చూసి ఎవరికోసం భయపడదు అని చెప్పి.. పిల్లల కోసమే ఇలా చేస్తున్నట్టున్నావ్ కాబట్టి పిల్లల భవిష్యత్తు నేను చూసుకుంటాను అని మాట ఇవ్వటంతో.. వెంటనే ఆవిడ మాన్సీ వైపు చూపించి ఈమెనే అలా నటించమని చెప్పింది అని అంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక మాన్సీ మరింత భయపడిపోతుంది. వెంటనే నీరజ్ మాన్సీ పై ఫైర్ అవుతాడు. వదినమ్మని దూరం చేయడానికి ఇలా చేసావా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. అప్పుడే అంజలి అనుకూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవటానికి ఈవిడే కారణం ఉండొచ్చు అని అనుమానం పడుతుంది. దాంతో మాన్సీ మరింత భయపడుతూ కనిపిస్తుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial