అన్వేషించండి

Prema Entha Madhuram September 9th: ఆర్య ఇంటికి బయలుదేరిన ఛాయాదేవి-తిరిగి వచ్చిన చైత్ర!

చైత్ర తిరిగి రావడం తో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema entha madhuram september 9th: ఎపిసోడ్ ప్రారంభంలోనే ఛాయాదేవి వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటుంది. మరోవైపు మాన్సి గది బయట నుంచి పూజ చూస్తుంది.

మాన్సి: అక్కడ అంత పెద్ద బాంబు పేల్చి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఎలా పూజలు చేసుకుంటున్నారో? బయట నాకు కంగారు వచ్చేస్తుంది. అని అనుకుంటుంది. పూజ అయిపోయిన తర్వాత ఛాయాదేవి మాన్సికి హారతి ఇస్తుంది. భయంగా హారతి తీసుకుంటుంది మాన్సి.

ఛాయాదేవి: ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు?

మాన్సి: మరి ఏం చేయమంటారు? మీరు ఇచ్చిన షాక్ ఇలాంటి అలాంటిదా? మీరు ఆ విషయం చెప్పిన తర్వాత కూడా బ్రో ఇన్ లా వార్నింగ్ ఇచ్చి పంపించారంటే మీ టైం చాలా బాగుంది. ఆయన కలియుగంలో రాముడు. తన సీతను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోరు. మీరు పగ అని అన్నారని ఆస్తి కోసం నేను మీతో చేతులు కలిపాను. పగ, ప్రేమగా ఎలా మారుతుంది?

ఛాయాదేవి: పూర్వం ఒక సామెత ఉండేది. కోపంతో అమృతాన్ని కూడా పెట్టలేము కానీ ప్రేమతో విషయాన్ని కూడా పెట్టొచ్చు.

మాన్సి: అయితే ఇది ప్రేమ కాదా? ప్రేమను నటిస్తున్నారా?

ఛాయాదేవి: అవును ఇంక మనం బయలుదేరుదామా?

మాన్సి: ఎక్కడికి షాపింగ్ కా?

Also Read: ద్యావుడా! ముసలోడికి మూడో పెళ్లి ఆఫర్ - అను ఊహల్లో ఆర్య!

ఛాయాదేవి: లేదు. కాబోయే అత్తగారింటికి. పెళ్లి విషయం అందరికీ తెలియాలి కదా. వెళ్లి పెద్ద కోడలి స్థానం నేను సంపాదించుకొని అంజలిని గెంటేసి నిన్ను ఆ స్థానంలోకి తెస్తాను అప్పుడు తోటి కోడళ్ళం ఇద్దరం కలిసి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు తోడేయోచ్చు. ఆర్య వద్దన్నాడు అని మానేస్తే నేను ఛాయాదేవిని ఎందుకు అవుతాను.

మాన్సి: మీరు చెప్తుంటే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. కానీ మీరే ఆ ఇంటికి వెళ్ళి రండి. అంతా మీరు అనుకున్నట్టు జరిగితే అప్పుడు నేను వస్తాను ఆల్ ది బెస్ట్. అలాగే వెళ్తున్నప్పుడు వట్టి చేతులతో కాకుండా ఏమైనా పట్టుకొని వెళ్ళండి.

ఛాయాదేవి: అన్ని రెడీ అయ్యే ఉన్నాయి ఇంక నేను బయలుదేరుతాను. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఛాయాదేవి.

మరోవైపు రోడ్డు మీద అను సామాన్లు తెచ్చి ఇంటికి వెళుతూ ఉండగా వెనకాతల నుంచి ఒక కార్ ఫాలో అవుతూ ఉంటుంది. ఎవరు అని అను కార్ దగ్గరికి వెళ్తుంది.

అను: ఎవరండీ మీరు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? ఇందాకట్నుంచి చూస్తున్నాను. అని కోపంగా అంటుంది. తీరా కార్లో ఉన్న వారిని చూసి, చైత్ర నువ్వా అని ఆనందపడుతుంది అను.

చైత్ర: ఎస్ నేనే. అని నవ్వుతూ చెప్పి కార్ దిగుతుంది చైత్ర.

అను: ఎన్ని రోజులైంది చైత్ర నిన్ను చూసి. 

చైత్ర: ఇంకా చెప్పు లావుగా ఇయ్యనా? సన్నంగా ఉన్నానా? లేకపోతే మీడియంగా ఉన్నానా?

అను: ఎప్పటిలాగే అందంగా ఉన్నావు.

చైత్ర: నువ్వు కూడా అందంగానే ఉన్నావు. కానీ నీ ముఖంలో నవ్వు మాత్రం తగ్గింది. ఒకప్పుడు మనస్ఫూర్తిగా నవ్వే దానివి ఇప్పుడు అది కనిపించడం లేదు.

అను: నా సంగతి తర్వాత కానీ నువ్వు ఎప్పుడు బెంగళూరు నుంచి వచ్చావు?

చైత్ర: నిన్ననే వచ్చాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా వర్ధన్ ఫ్యామిలీ లో పూజ ఘనంగా చేస్తారు అని అక్కడికే సర్ప్రైజ్ గా వెళ్తుంటే దారిలో నువ్వు కనిపించావు. ఇంతకీ నీ కారు ఎక్కడ అని కార్ కోసం వెతుకుతుంది చైత్ర.

అను: ముందు ఇంటికి పదా అక్కడికి వెళ్లి అన్ని మాట్లాడుకుందాము అని చైత్ర కార్ ఎక్కుతుంది అను.

Also Read: రిషి మిస్సింగ్, జగతి-మహేంద్రకి యాక్సిడెంట్, సంబరాల్లో దేవయాని-శైలేంద్ర!

ఆ తర్వాత సీన్ లో, స్కూల్లో అక్షరా తన ఫ్రెండ్ తో హోంవర్క్ రాస్తూ ఉండగా వెనకనుంచి ఒక అబ్బాయి చూస్తాడు. మొన్న నన్ను నడుస్తున్నప్పుడు కింద పారేసావు కదా అని అనుకుంటూ ఎవరూ చూడకుండా అక్షర వెనకాతల రెండు కోతి బొమ్మలను పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 

హోంవర్క్ అయిపోయిన తర్వాత అక్షర అక్కడి నుంచి లెగిసి వెళ్తున్నప్పుడు వెనుక నుంచి బొమ్మను చూసి అక్కడ ఉన్న అబ్బాయిలు కోతి కోతి అని నవ్వుతారు. ఇంతలో ఆ బొమ్మ అంటించిన వాడు కూడా వాళ్ళ మధ్యలోకి చేరి అక్షరని ఏడిపిస్తాడు. అటువైపు వస్తున్న అభయ్ ఆ దృశ్యాన్ని చూసి వెళ్లి ఆ అబ్బాయిలని కొట్టి అక్షర వెనుక ఉన్న ఆ కోతి బొమ్మ ఉన్న పేపర్లను తీసి చింపేస్తాడు.

అభయ్: నా చెల్లిని కోతి అని ఏడిపిస్తావారా. అని వాళ్ళని గట్టిగా కొట్టి కింద పడేస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి నేను టీచర్ కి చెప్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

అక్షర: ఎందుకు అన్నయ్య గొడవల్లోకి వెళ్తావు? ఇప్పుడు టీచర్ కి చెప్తే టీచర్ నిన్ను తిడుతుంది కదా.

అభయ్: తప్పు చేసింది వాళ్ళు. నేను కూడా టీచర్ కి నిజం చెప్తాను. అయినా పర్లేదు మరి ఎప్పుడైనా వాళ్ళు నిన్ను ఇలా చేస్తే ఊరుకోవద్దు తిరిగి గట్టిగా కొట్టు.

అక్షర: సరే అన్నయ్య నేను అంటే నీకు ఎంత ప్రేమో. థాంక్యూ. అని చెప్పి వెళ్లి అభయ్ నీ హద్దుకుంటుంది.

ఆ తర్వాత సీన్లో అను చైత్ర నీ తన ఇంటికి తీసుకొని వస్తుంది.

చైత్ర: అదేంటి అను నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి? నువ్వు ఆర్య సార్ కలిసి ఉండటం లేదా?

అను: విధి మమ్మల్ని విడదీసింది చైత్ర.

Also Read: వరలక్ష్మి స్థానంలో కొలువైన విశాలాక్షి.. సుమన మెడను చుట్టుకున్న పాము?

చైత్ర: నాకేం అర్థం కావడం లేదు అసలు ఏం జరిగింది అను?. అని అడగగా జరిగిన విషయం అంతా చైత్ర కి చెప్పుకొని వస్తుంది అను.

చైత్ర: నువ్వు ఇలాంటివన్నీ నమ్మి ఆర్య సార్ కి దూరంగా ఉంటున్నావంటే ఇది సరైన పని కాదనిపిస్తుంది అను. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు మాత్రమే. రా నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాను ఇప్పుడే వెళ్దాం.

అను: దయచేసి ఆ ఆలోచన కూడా నీ లోపలికి రానివ్వొద్దు చైత్ర. పిల్లల దగ్గర ఉంటే ఆర్య సార్ కి జరిగిన ప్రమాదాలు ఏంటో నా కల్లారా నేను చూశాను. ఆర్య సార్ క్షేమంగా ఉండాలంటే పిల్లలు ఆయనకి దూరంగా ఉండాలి.

చైత్ర: ఆర్య సార్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆయన సహాయం నాకు ఎంతో ఉంది. అలాంటి ఆయనకు ఈ పరిస్థితి వచ్చింది అంటే నేను చూడలేను రా వెళ్దాం. అని అనగా అను చైత్ర చేత వొట్టు వేయించుకుంటుంది.

అను: ఈ విషయం ఆర్య సార్ వాళ్లకి చెప్తే నా మీద ఒట్టే చైత్ర.

చైత్ర: సరే. మీ పెళ్లయిన కొత్తలో వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటున్నప్పుడు మీ ఇద్దరిని చూసి ఎంతో ఆనందపడ్డాను. అదే సంతోషాన్ని చూద్దాము అని తిరిగి వస్తే నా ఆశలు అన్ని తారమారయ్యాయి.

అను: ఆర్య సార్ బావుండాలి అని నేను వ్రతం చేద్దాం అనుకుంటున్నాను. నావల్ల ఆయన బాధకు గురైతే నేనే ఆయనకి ఆనందం కలగాలని వ్రతం చేస్తున్నాను. వీధి నాతో ఎలా ఆటలు ఆడిస్తుందో చూడు. అన్ని బాగుంటే ఈపాటికి ఆర్య సార్ ఇంట్లో అత్తమ్మ సాయంతో వ్రతం చేసి ఇల్లంతా అలంకరించి ఆర్య సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకునే దాన్ని. కానీ ఇప్పుడు ఇలాగా దూరంగా ఉండాల్సి వస్తుంది అని ఏడుస్తూ బాధపడుతుంది అను.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
PV Sindhu Marriage Latest Photos: పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
Embed widget