News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Prema Entha Madhuram September 8th: ద్యావుడా! ముసలోడికి మూడో పెళ్లి ఆఫర్ - అను ఊహల్లో ఆర్య!

అప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకున్న ఆర్యను ఛాయాదేవి పెళ్లి చేసుకోమని అడగడం ఒక వింత అనే చెప్పాలి.. అలా అడిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

Prema entha madhuram september 8th: ఈరోజు ఎపిసోడ్ లో ఛాయాదేవి మాన్సిని అక్కడి నుంచి వెళ్ళిపోమని సైగ చేస్తుంది.

మాన్సి: నన్ను ఎందుకు రమ్మన్నది మళ్ళీ తనే ఎందుకు పంపించేస్తుంది అని మనసులో అనుకుంటుంది. మాన్సి వెళ్లిపోయిన తర్వాత జెండే తో కూడా ఐ నీడ్ ప్రైవసీ అని అంటుంది.

ఆర్య: జెండే ఇక్కడే ఉంటాడు. చెప్పాలనుకున్నది ఏదో చెప్పు.

ఛాయాదేవి: అయితే మీ ఇష్టం. నా దగ్గర ఒక ప్రపోజల్ ఉన్నది. ఈ గొడవలన్నీ ఆగి ప్రశాంత రావాలంటే ఒకేఒక మార్గం ఉంది. అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం. నువ్వే కానీ నన్ను పెళ్లి చేసుకుంటే ఈ గొడవ లేదు ఉండవు.

ఆర్య: షట్ అప్!

ఛాయాదేవి: నువ్వు ఇదే మాట అంటావు అని నాకు తెలుసు. కానీ సొసైటీలో వర్ధన్ ఇంటికోడలుకి, ముఖ్యంగా ఆర్య వర్ధన్ భార్యకి ఉండే విలువ ఏంటో నాకు తెలుసు. అయినా నువ్వు అను గురించి ఆలోచిస్తున్నావు కదా తను ఎలాగ రాదు.

ఆర్య: నా జీవితం నా మనసు అంతా అనుదే. తను వచ్చినా రాకపోయినా తనే నా భార్య, తనే వర్ధన్ ఇంటికోడలు. నా భార్య అయ్యే హక్కు కేవలం తనకి మాత్రమే ఉంది. నౌ షట్ అప్ అండ్ గెట్ అవుట్. అని ఛాయాదేవి మీద గట్టిగా అరుస్తాడు.

ఛాయాదేవి: నాకు నీ జీవితంలోకి ఎలా రావాలో నాకు తెలుసు అయినా నీ ఆస్తి ఏమీ అడగలేదు కదా కేవలం నీ జీవితంలో భాగమవుతానని అన్నాను.

జెండే: నువ్వు ఇన్ని మాటలు అన్నా సరే ఇంకా బతికున్నావంటే నీ టైం బాగుంది. వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా ఉంటాడు. ఛాయాదేవి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఆర్య తనని ఆపుతాడు.

ఆర్య: నీ బుర్ర కొచ్చిన ఆలోచన ఎంత త్వరగా తీస్తే నీకు అంత మంచిది. అని చెప్పి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఛాయాదేవి వెళ్ళిపోయిన తర్వాత జెండే ఆర్యతో మాట్లాడుతాడు.

Also Read: అక్షర కోసం షవర్ తయారు చేసిన అభయ్ - ఆర్యని దెబ్బ కొట్టేందుకు ఛాయా కొత్త ప్లాన్

జెండే: తను ఈ దారిలో వస్తుందంటే ఏదో కొత్త ప్లానే వేస్తుంది.

ఆర్య: ఇంకా ఈ టాపిక్ గురించి నా ముందు డిస్కస్ చేయొద్దు అని అనగా జెండే అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఆర్య అనుతో గడిపిన క్షణాల్ని గుర్తుతెచ్చుకుంటూ తను అనుని ఎలా కలిశాడో, ఇద్దరికీ పెళ్లి ఎలా అయిందో ఆ క్షణాలు అన్ని గుర్తుతెచ్చుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత సీన్లో నీరజ్, అంజలీలు ఇంటి గడపకి పూలు అలంకరణ చేస్తూ ఉంటారు. ఇంతలో పువ్వు రేకలు అంజలి కళ్ళ మీద పడగా నీరజ్ వెంటనే వచ్చి ఏమైంది అని అడుగుతాడు. అలాగ వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో శారదమ్మ అటువైపుగా రాగా వాళ్ళిద్దరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్లిపోతారు.

శారదమ్మ: అంజలి, పనులు ఎంతవరకు వచ్చాయి?

అంజలి: డెకరేషన్ ఇప్పుడే మొదలుపెట్టాం ఆంటీ. సింపుల్ గానే చేసేస్తున్నాము అయిపోతుంది.

శారదమ్మ: చుట్టుపక్కల వాళ్ళని తాంబూలానికి పిలవాలి, నేను మర్చిపోయాను.

అంజలి: పర్వాలేదు ఆంటీ నేను ఈ పనయ్యాక వెళ్లి పిలుస్తాను.

Also Read: Trinayani September 7th Episode: నిజం తెలుసుకున్న నయని, సుమన దగ్గర నుంచి తెలివిగా పాలు కాజేసిన పెద్ద బొట్టమ్మ

శారదమ్మ: అను ఉన్నప్పుడు ఇవేవీ నేను పట్టించుకునే దాన్నే కాదు. అన్ని అను నే చూసుకునేది ఇంట్లో లక్ష్మీదేవిలా తిరుగుతూనే ఉండేది. ఒకప్పుడు పండగలు అయితే ఆర్య ని ఇంట్లో ఉంచడానికి చాలా ప్రయత్నించే దాన్ని కానీ అను వచ్చిన తర్వాత ఆర్య పండగల పూట ఇంటి గడపని దాటే వాడే కాదు. అని బాధపడుతూ ఉంటుంది.

నీరజ్: బాధపడకు అమ్మ.

అంజలి: ఈ పూజలన్నీ ఫలించి అను తిరిగి వస్తుంది ఆంటీ. అని అనగా ఇంతలో ఆర్య జెండేలు అక్కడికి వస్తారు.

శారదమ్మ: ఏమైంది ఆర్య లేటుగా వస్తాను అని చెప్పావు ఇంత త్వరగా వచ్చేసావు?

ఆర్య: పని అయిపోయింది అమ్మ.

నీరజ్: త్వరగా లోపలికి వెళ్లి పడుకోండి దాదా. మళ్లీ రేపు పూజ ఉంది కదా

ఆర్య: నా గురించి వెయిట్ చేయొద్దు మీ పనులు మీరు కానిచ్చేయండి. అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

శారదమ్మ: ఆర్య ఎందుకు అలాగా ఉన్నాడు?

జెండే: ప్రతి పండగకి అను వస్తుందేమో అని ఆశగా చూడడం అలవాటే కదా. అందుకే అను గురించి ఆలోచిస్తూ ఉండి కొంచెం డిస్టర్బ్ గా ఉన్నాడు. మరేమీ లేదు.

శారదమ్మ: ప్రతి పండక్కి అలా ఆశపడమే కాని అను మాత్రం ఎప్పటికీ రావడం లేదు అని బాధపడుతుంది. ఆ తర్వాత సీన్లో అను పిల్లలు ఇద్దరికీ క్యారేజ్ కడుతుంది. ఇంతలో పక్కింటి ఆవిడ అక్కడికి వస్తుంది.

అను: రండి ప్రసన్న గారు ఏంటి ఇలా వచ్చారు?

ప్రసన్న: ఏమీ లేదు రాధ గారు, మీరు వరలక్ష్మీ వ్రతం కోసం పూజ సామాగ్రి కొనేశారా?

అను: ఇంకా లేదు పిల్లల్ని స్కూల్లో దింపి అటు నుంచి అటే మార్కెట్ కి వెళ్తాను.

ప్రసన్న: హమ్మయ్య అయితే వస్తున్నప్పుడు నాకు కూడా కొన్ని సామాన్లు తెచ్చి పెట్టరా. ప్రతి సంవత్సరం మా ఆయన సామాగ్రి అంతా తెస్తారు. కానీ ఈ సంవత్సరం ఆయన ట్రిప్ కి వెళ్లారు.

అను: మరేం పర్వాలేదు నేను తెస్తాను. ఏం కావాలో లిస్ట్ రాసి ఇవ్వండి.

ప్రసన్న: హమ్మయ్య. మీకు భర్త లేరు కదా వరలక్ష్మి వ్రతం చేయరేమో అని భయపడ్డాను. సరే స్టవ్ మీద పాలు పెట్టి వచ్చాను అని చెప్పి లిస్ట్ అనుకి ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ప్రసన్న. అను బాధపడుతూ దేవుడి దగ్గరికి వెళ్తుంది.

అను: ఏంటి స్వామి నా తలరాత ఇలాగున్నాది. అందరూ ఉన్నా ఎవరూ లేని మనిషిలో బతకాల్సి వస్తుంది అయినా సరే నాకు ఏ బాధ లేదు. మా పిల్లలు బాగుండాలి, ఆర్య సార్ బాగుండాలి, వర్ధన్ కుటుంబం క్షేమంగా ఉండాలి. అంతే చాలు నాకు ఇంక ఏ కోరికలు లేవు అని అంటుంది. ఇంతలో పిల్లలు ఇద్దరు స్కూల్ కి రెడీ అయి హాల్లోకి వస్తారు.

అను: మీరు త్వరగా బయలుదేరితే నేను అట్నుంచి అంటే మార్కెట్ కి వెళ్ళాలి.

అభయ్: ఏంటమ్మా ఈరోజు పండగ ఏమైనా ఉన్నదా?

అను: ఈరోజు వరలక్ష్మి వ్రతం.

అక్షర: అయితే ఏం చేస్తారమ్మా?

అను: అమ్మవారికి పూజ చేసి, ఇష్టమైన పదార్థాలు అన్ని పెట్టి కోరికలు అడుగుతాము. మీరు అందరూ బాగుండాలని, అలాగే మీకు ఎక్కువ పాకెట్ మనీ వచ్చేలా బోలెడంత డబ్బు కావాలని అడుగుతాము.

అక్షర: అయితే నేను స్కూల్కి వెళ్ళను అమ్మ. ఈరోజు ఇంట్లో ఉండి నీకు నేను సహాయం చేస్తాను.

అభయ్: నువ్వు స్కూల్ ఎగ్గొట్టడానికి ఇలాగ తప్పించుకుంటున్నావు. ఈ విషయం నేను టీచర్ కి చెప్తాను

అక్షర: చూడు అమ్మ వీడు క్లాస్ లీడర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు

అను: అన్నయ్య చెప్పింది నీ మంచి కోసమే కదా. ఎప్పుడు స్కూల్ అనేసరికి తప్పించుకుని తిరుగుతావు. అని చెప్పి పిల్లలు ఇద్దరికీ క్యారేజ్ ఇస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Published at : 08 Sep 2023 10:39 AM (IST) Tags: Prema Entha Madhuram serial Prema Entha Madhuram telugu serial Prema Entha Madhuram zee telugu serial Prema entha madhu September 8th

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్

Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!

Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ

Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ

Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు

Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు