(Source: ECI/ABP News/ABP Majha)
Prema Entha Madhuram July 15th: దోష పూజ చేయించుకుంటున్న అను, ఆర్య.. నిప్పు పెట్టడానికి సిద్ధమైన మాన్సీ?
దోష నివారణ కోసం అను, ఆర్య చెరొక్కవైపు పూజ చేయడం వల్ల సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram July 15th: అను ప్రీతి వాళ్ళతో ఆర్య, తను కలిసినప్పుడల్లా ఏదో ఒక ప్రమాదం ఎదురవుతుంది.. అంటే ఆయనకు గండం ఉందేమో అని.. ఇక ఆయనకి ఇంకా దూరంగా ఉంటాను అని అనుకోని చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రీతి తనను ఓదార్చి నువ్వికవిడ ఉండలేవు పద మా ఇంటికి వెళ్దాం అని తీసుకెళ్తుంది.
మౌనంగా కూర్చొని ఉంటాడు. అప్పుడే జెండే వచ్చి అమ్మ చాలా డిప్రెషన్ లో ఉంది అని.. అందులో నుండి బయటపడటం కోసం దోష నివారణ పూజ చేయించాలి అని.. అలాగే యాగం కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి వచ్చాను అని.. అలా అయితే కాస్త అమ్మ మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి వచ్చాను అని అంటాడు. ఇక నువ్వు కూడా ఒప్పుకోవాలి అని ఆర్యను అడగటంతో.. నీకు తెలుసు కదా జెండే అను వచ్చేవరకు ఏమి చెయ్యలేను అని అంటాడు.
ఇక అప్పుడే నీరజ్ అమ్మ కోసం ఒప్పుకోమని అంటాడు. అంజలి కూడా ఒప్పుకోమని చెప్పి ఏ పూజలో ఏ మహత్యం ఉంటుందో.. పూజ చేయడం వల్ల అను ఇంటికి కూడా తిరిగి వస్తుందేమో అని అంటుంది. దాంతో ఆర్య మీ ఇష్టమని ఒప్పుకోవటంతో అందరూ సంతోషపడతారు. ఇక నీరజ్ పూజ ఏర్పాట్ల గురించి అంజలి వాళ్లకు చెబుతూ ఉంటాడు.
మరోవైపు ప్రీతి అనుని ఇంటికి తీసుకెళ్లి ఇక్కడే ఉండమని అంటుంది. రేష్మను కూడా అక్కడే ఉండమని అంటుంది. ఇక అను ఆర్యని తలుచుకొని బాధపడుతుంది. ఆయనకు ఏమైనా జరిగితే నా గుండె ఆగిపోయేంత పని అయిపోయేది అని ఆర్య గురించి వాళ్లతో చెప్పుకుంటూ బాధపడుతుంది. ఇక ప్రీతి మీ ఇద్దరి మధ్య మంచి ప్రేమ ఉంది. త్వరలోనే మీరు కలుస్తారు. ఇప్పుడే మా నాన్నమ్మ కి ఫోన్ చేసి దోష నివారణ పూజ గురించి అడుగుతాను అని ఫోన్ చేస్తుంది.
ఫోన్ మాట్లాడి ఆ తర్వాత దోష నివారణ పూజ చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని.. ఈ పూజ రేపే చేద్దాము అని అంటుంది. మరుసటి రోజు ఆర్య వాళ్ళు గుడికి వస్తారు. ఇక ఆర్యపై సీతాకోకచిలుక వచ్చి వాలుతుంది. దాంతో అనుని తలుచుకుంటాడు ఆర్య. గతంలో అనుని సీతాకోకచిలుకలతో పోల్చిన సందర్భాన్ని గుర్తుకు చేసుకొని బాధపడతాడు. ఆ తర్వాత గుడి లోపలికి వెళ్తారు.
అప్పుడే అను వాళ్ళు కూడా గుడికి వస్తారు. ఇక ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురు పడకుండా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఆర్య అడుగుజాడల్లోనే అను కూడా వెళ్తుంది. ఇక గుడికి వస్తున్న నీరజ్ కు మాన్సీ ఎదురుపడి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. నీరజ్ కు బాగా కోపం వస్తుంది. దయచేసి నువ్వు మా ఫ్యామిలీ జోలికి రాకు మేము ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాము.. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుందాము అని అంటాడు.
కోర్టులో తేల్చుకుందామని అనుకుంటున్నాను కానీ మీరు అలా ఉండనివ్వటం లేదు కదా అని అంటుంది మాన్సీ. ఇక నీరజ్ అక్కడ్నుంచి కోపంగా వెళ్తాడు. దాంతో మాన్సీ ఈ ఆస్తినే కాదు మీ అందర్నీ సొంతం చేసుకుంటాను అని.. ఇప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకుంటారా.. నేను వచ్చాక ఎలా జరుగుతుందో చూద్దాం అని.. పూజ ఆపడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. మరోవైపు అను పూజలో కూర్చుంటుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial