అన్వేషించండి

Prema Entha Madhuram August 8th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఆర్య చేతుల మీదుగా పిల్లల అన్నప్రసన్న వేడుక, బయటపడ్డ మదన్ అసలు రూపం?

పిల్లల అన్న ప్రసన్న వేడుక ఆర్య చేతుల మీదుగా జరగటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema Entha Madhuram August 8th: ఆర్య శత్రువైన ఒక ఆవిడ ఫోన్ చేసి ఆ బిజినెస్ కోడ్ తనే తెలుసుకున్నాను అని.. ఆ టెండర్ తనకే దక్కింది అన్నట్లుగా చెబుతుంది. అంతేకాకుండా భవిష్యత్తు గురించి కూడా చెప్పి భయపెట్టిస్తూ ఉంటుంది. దాంతో ఆర్య ఫోన్ కట్ చేసి తను ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. అప్పుడే ప్రీతీ ఫోన్ చేసి ఫంక్షన్ కి రమ్మని చెబుతుంది.

ఇక ఆర్య తాము రాలేమో అని బిజీగా ఉన్నామని చెప్పటంతో ప్రీతి బ్రతిమాలుతుంది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని.. అందరి వాళ్ళు ఆఫీసు వర్క్ లో బిజీగా ఉన్నారని చెప్పు సరేలే వస్తాను అని అంటాడు. దాంతో ప్రీతి సంతోషపడుతుంది. ఇక జిండే కు పిల్లల ఫంక్షన్ కి వెళ్దామని చెబుతాడు. ఈ సమయంలో ఎందుకు అని జిండే అనటంతో పిల్లల ఫంక్షన్ కాబట్టి వారిని బాధ పెట్టొద్దు అని అంటాడు.

మరోవైపు రౌడీలు పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడే వాటర్ బబుల్ తీసుకెళ్తున్న ఒక అతనిని ఆపి ఒక రౌడీ ఆ బబుల్ తీసుకొని లోపలికి వెళ్తాడు. ఇంట్లో ఆర్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు.  అప్పుడే ఆర్య రావటంతో అను వాళ్ళు టెన్షన్ పడతారు. వెంటనే డ్రెస్ మార్చుకోమని అనుని పంపిస్తుంది. ఇక అను పైకి టెన్షన్ గా వెళ్లి ఆర్యను   కిటికీ నుండి చూస్తుంది.

అప్పుడే రేష్మ వచ్చి అను తీసుకొని వెళ్తుంది. ఇక అను  బుర్కా వేసుకొని ఆర్య ముందు నిలబడుతుంది. అందరూ వస్తే బాగుండేది అని అను ఆర్యతో అంటుంది. వెంటనే జిండే శారదమ్మ వీడియో కాల్ చేయమని చెప్పింది అని వీడియో కాల్ చేసి మాట్లాడిస్తాడు. ఇక పిల్లలచే వస్తువులు పట్టించే కార్యక్రమం చేస్తారు. మొదట బాబు వెన్న పట్టుకోవటంతో మంచి మనసున్న వ్యక్తిగా మారుతాడు అని అంటారు.

ఆ తర్వాత పాప బుక్ పట్టుకోవడంతో మంచి బిజినెస్ వుమెన్ అవుతుందని ప్రీతి అంటుంది. ఇక మా కోసం ఇంత చేశారు కాబట్టి  ప్రసాదం తినిపించండి అని అను ఆర్యతో అంటుంది. ఇక ఆర్య తన చేతికున్న ఉంగరం తీసి శుభ్రంగా కడగమని రేష్మను పంపిస్తాడు. మరోవైపు అవకాశం కోసం చూస్తున్న రౌడీ రేష్మను చూసి నీళ్లు పారబోసి తుడుస్తున్నట్లు నటిస్తాడు.

ఇక రేష్మ ఉంగరం శుభ్రం చేసి ఆర్యకి ఇవ్వటంతో ఆర్య ఇద్దరు పిల్లలకు తినిపిస్తాడు. ఇక అను ఆర్య ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఓ వైపు రౌడీలు అవకాశం కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళ బాస్ ఫోన్ చేసి పని తొందరగా కానివ్వండి అని అంటాడు. ఇక మయూర్ జిండే కి ఫోన్ చేసి టెండర్ కోడ్ స్కాన్ చేసింది అంజలి వాళ్ళ అన్నయ్య మదన్ అని చెప్పటంతో అదే విషయం ఆర్యకు చెబుతాడు జిండే. గతంలో అంజలి ఆఫీస్ కి వెళ్ళిన మదన్ అంజలి లేనిది చూసి ఆ కోడ్ ఫోటో దింపుకుంటాడు. ఇక వెంటనే ఆర్య ఆ ఫిమేల్ విలన్ కు మదన్ ద్వారా తెలిసింది ఏమో అని ఆలోచనలో పడతాడు. మన వైపే ఉండి మనకే వెన్నుపోటు పొడిచాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు.

also read it : Janaki Kalaganaledhu August 7th: 'జానకి కలగనలేదు' సీరియల్: జానకి మనసు గెలుచుకున్న కిషోర్, టెర్రరిస్టులను చంపేసిన ఐపీఎస్ ఆఫీసర్?

 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget