Prema Entha Madhuram July 10th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: అదిరిపోయే షాకిచ్చిన వసుంధర.. మాన్సీకి తన ఆస్తి పేపర్లు ఇచ్చేసిన అంజలి?
మాన్సీ వచ్చి నిజం చెప్పటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram July 10th: అంజలి, నీరజ్ ల రిసెప్షన్ కి వచ్చి మాన్సీ రచ్చ చేయడం మొదలు పెడుతుంది. అంతేకాకుండా అంజలి పై నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటుంది. దాంతో వసుంధర కి కోపం వచ్చి ఎవరు నీవు అంటూ.. ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నావ్ ఏంటి అని అడుగుతుంది. ఎక్కడ నిజం చెబుతుందో అని అందరూ భయపడుతూ ఉంటారు. వెంటనే మదన్ వసుంధరతో అది వాళ్ళ ఆఫీస్ కి సంబంధించిన ఇష్యూ ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం అని అంటాడు.
కానీ వసుంధర వినిపించుకోకుండా గట్టిగా నిలదీస్తుంది. అంజలి మాత్రం భయపడుతూ కనిపిస్తుంది. దాంతో మాన్సీ తను మాన్సీ వర్ధన్ అంటూ నీరజ్ భార్య అని చెప్పటంతో వసుంధర తో పాటు అందరి షాక్ అవుతారు. ఇక నీ కూతురు నా భర్తను పెళ్లి చేసుకుందని చెప్పటంతో మదన్ ఇక అంజలి పని అయిపోయినట్లే అని అనుకుంటాడు. మాన్సీ మాత్రం బాగా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది.
ఇక పెళ్లి జరగడానికి కారణం మదన్ మొత్తం వివరిస్తాడు. మాన్సీ మాట్లాడుతూ నీ కూతురు నా భర్తను వలలో వేసుకుంది అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడి తనని తీసుకెళ్ళు అని అంటుంది. దాంతో వసుంధర తీసుకెళ్తాను.. నా కూతుర్ని నా అల్లుడితో వాళ్ళ ఇంటికి పంపించి.. వర్ధన్ కుటుంబంతో సంతోషంగా ఉంటుందన్న నమ్మకాన్ని తీసుకెళ్తాను అంటుంది. దాంతో మాన్సీ, మదన్ షాక్ అవుతారు. ఇక అంజలి వాళ్ళు వసుంధర మాటలకు ఫిదా అవుతారు. అలా ఎలా ఒప్పుకుంటున్నారు నీ కూతురు రెండో బార్యక వెళ్లడం నీకు ఇష్టమా అని అనడంతో.. అంజలి ఏది చేసిన కరెక్ట్ చేస్తుంది అని వర్ధన్ ఫ్యామిలీ గురించి గొప్పగా మాట్లాడుతుంది.
అర్థం చేసుకున్నందుకు ఆర్య కూడా మాట్లాడుతాడు. వెంటనే మాన్సీ ఇంకా కోర్టులో కేసు నడుస్తూనే ఉంది విడాకులు తీసుకోక ముందే ఎలా ఈ పెళ్లికి ఒప్పుకుంటారు అని మాట్లాడుతుంది. వెంటనే ఆర్య నీరజ్ ఫోన్ కి.. ఆస్తి పేపర్లపై మ్యాజిక్ పెన్నుతో సైన్ చేసి మాన్సీ కి ఇవ్వండి అనటంతో వెంటనే నీరజ్ ఆ మెసేజ్ అంజలికి చూపిస్తాడు. ఇక అంజలి నీకేం కావాలో నాకు తెలుసు ఇటు రా అంటూ మాన్సీ ని లోపలికి తీసుకెళ్లి తన ఆస్తి పేపర్లతో పాటు వర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి షేర్స్ డాక్యుమెంట్లను సంతకం చేసి ఇస్తుంది.
దాంతో మొదట మాన్సీ కాస్త డౌట్ పడినట్లు కనిపించగా ఆ తర్వాత ఆ పేపర్లు తీసుకొని బయటికి వచ్చి నీరజ్ కి కంగ్రాట్స్ చెప్పి వెళ్తుంది. దాంతో ఏం జరిగింది అని అంజలిని శారదమ్మ అడగడంతో.. తనకు కావలసింది ఇచ్చేశాను అని చెబుతుంది. ఆ తర్వాత అంజలి తన తల్లికి థాంక్స్ చెబుతుంది. ఇక మాన్సీ బయలుదేరుతూ ఆ డాక్యుమెంట్లు చూసి మురిసిపోతుంది. ఇక ఈ ఆస్తి పేపర్లు ఇస్తే నేను కోర్టుకు రాను అని అనుకుంటున్నారేమో కానీ కోర్టుకు వస్తాను నేనే గెలుస్తాను అని ఫోన్లో లాయర్ తో చెబుతుంది.
ఇక పార్టీ అయిపోయిన తర్వాత.. ఆర్య వెళుతుండగా అను అక్కడ వచ్చి చూస్తుంది..వెంటనే ఆర్య వెనక్కి రావటంతో అను అక్కడి నుంచి వెళ్తుంది. ఆర్య ఏదో వెతుకుతున్నట్లు లోపలికి వస్తుండగా అప్పుడే ప్రీతి ఎదురుపడి ఆటోగ్రాఫ్ అడుగుతుంది.
ఆ తర్వాత ఆర్య కూడా ఈవెంట్ తక్కువ సమయంలో బాగా చేశారు అని అనటంతో అను గురించి చెప్పి అనుని ఆర్యతో మాట్లాడిపిస్తుంది. ఇక తమ కంపెనీకి సంబంధించిన ఈవెంట్ కూడా మీరే చేయాలి అని అంటాడు. త్వరలో తన భార్య బర్త్డే ఉందని ఆ ఈవెంట్ కూడా మీరే చేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. దాంతో ప్రీతి సార్ వాళ్ళ భార్య ఎంతో అదృష్టవంతురాలు అనటంతో అను తన మనసులో బర్త్డే చేయాలని ఫిక్స్ అయ్యాడు అంటే అంతలోపే నన్ను వెతికి పట్టుకోవాలని చూస్తున్నాడేమో అని అనుకుంటుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial