అన్వేషించండి

Ammayi garu Serial Today September 16th: అమ్మాయి గారు సీరియల్: రూపని కాపాడిని రాజు.. శ్వేత, హర్షలు సీఎంని చంపేస్తారా!

Ammayi garu Today Episode గౌతమ్‌ని రాజు చితక్కొట్టి రూప తీసుకొచ్చి సూర్య ప్రతాప్‌కి అప్పగించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూపని గౌతమ్ కిడ్నాప్ చేశాడని రాజు రేణుక ద్వారా తెలుసుకుంటాడు. గన్ తీసుకొని గౌతమ్ రేణుకకు చెప్పిన అడ్రస్‌కి వెళ్తాడు. మరోవైపు గౌతమ్ రూపని పట్టుకొని నాలోని రాక్షసుడిని చూపిస్తానని అంటాడు. ఇంతలో రాజు వచ్చి గౌతమ్‌ని కొట్టి రూపని సేవ్ చేస్తాడు. అమ్మాయి గారు నా భార్య నా భార్య మీద చేయి వేస్తే ఏం చేస్తానో నాకే తెలీదని రాజు అంటాడు. రాజు గౌతమ్‌ని చంపాలని గన్ తీస్తే రూప అడ్డుకుంది. రాజు రూపని తీసుకొని వెళ్లిపోతాడు. 

గౌతమ్ శ్వేతకి కాల్ చేసి రూపని రాజు తీసుకెళ్లిపోయాడని చెప్తాడు. శ్వేత డిసప్పాయింట్ అవుతుంది. హర్ష, శ్వేతలు రూపని మనం అయితే కిడ్నాప్ చేసి ఉంటే చంపేసేవాళ్లమని అంటుంది. ఇక రూపని రాజు కంటికి రెప్పలా కాపాడుతున్నాడని హర్ష అంటాడు. వేరేలా ప్లాన్ చేయాలని అంటాడు. 

శ్వేత: ఎంత ఆలోచించినా రూపని ఏం చేయలేకపోతున్నాం అన్నయ్య. ముత్యాలు ఆంటీ సాయంతో రాజుని పెళ్లి చేసుకోవడమే నాకు ఉన్న ఏకైక దారి.
హర్ష: దానికి రాజు ఒప్పుకోవాలి కదా శ్వేత. డాడీ ఈరోజు ఇలా ఉండటానికి కారణం అయిన రాజుని పెళ్లి చేసుకొని డాడీని ఇబ్బంది పెట్టడం కంటే డాడీని మళ్లీ సీఎంని చేసి అప్పుడు రాజుని పెళ్లి చేసుకుంటే డాడీకి గౌరవంగా ఉంటుంది.
శ్వేత: అది నిజమే అన్నయ్య కానీ సూర్యప్రతాప్ సీఎంగా ఉండగా డాడీని సీఎం చేయడం కష్టం. ఆయనకు ప్రజాధరణ ఉంది. సీఎం కుర్చీ నుంచి దించడం కష్టం.
హర్ష: దించడం కష్టం కానీ లేపేయడం ఈజీ కదా. నువ్వు అడిగితే విజయాంబిక ఆంటీ వాళ్లు సాయం చేస్తారు వాళ్లని పిలు మాట్లాడుదాం. 

రాజు రూపని తీసుకొని సీఎం ఇంటికి వస్తాడు. విజయాంబిక రూపతో ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్లాలి కదా మేం టెన్షన్ పడ్డాం అని అంటుంది. సూర్య ప్రతాప్ కూడా కిందకి వస్తాడు. రూపని రాజే తీసుకెళ్లాడని వార్నింగ్ ఇవ్వడం వల్లే ఇప్పుడు తీసుకొచ్చాడని విజయాంబిక అంటుంది. దానికి రూప షాక్ అయిన వార్నింగ్ ఏంటి అని అంటుంది. వార్నింగ్ కాదని పెద్దయ్యగారు నీ మీద ప్రేమ చూపించారని రాజు అంటాడు. రూపని తాను తీసుకెళ్లలేదని చెప్తాడు. నేను మీ అల్లుడిని అని చీకటి పడక ముందే మీకు చెప్పినట్లు అమ్మాయిగారిని ఇంటికి తీసుకొచ్చానని రూప చేతిని ఆమె తండ్రి చేతిలో పెడతాడు. రూప తనని తీసుకెళ్లడానికి రాలేదా ఇంట్లో అప్పగించడానికి వచ్చావా అని అంటుంది. రూపని మేం జాగ్రత్తగా చూసుకుంటాం అని విజయాంబిక అంటే అందుకేనా రూపని గౌతమ్ ఎత్తుకెళ్లాడని అంటాడు. ఇక రాజు ఎంత చెప్పినా సూర్య ప్రతాప్ అని రాజుని వెళ్లిపోమని అంటాడు. 

రాజు వెళ్తూ వెళ్తూ ఏదో ఒక రోజు నేను ఏ తప్పు చేయలేదని విజయాంబిక తప్పు చేసిందని తెలుసుకొని ఆమెను గెంటేసి నన్ను అల్లుడిగా స్వీకరిస్తారని అంటాడు. రాజు ఇంటికి వెళ్తే ముత్యాలు కొడుకుని కోప్పడుతుంది. రూప వాళ్లకంటే శ్వేత మంచిదని శ్వేతని పెళ్లి చేసుకోమని అంటాడు. దానికి రాజు నేను పెళ్లి చేసుకోనని చెప్పి వెళ్లిపోతాడు. ఇక రాజు తండ్రితో అమ్మాయి గారిన గౌతమ్ పాడు చేయబోయాడని నేను సమయానికి వెళ్లకపోతే అమ్మాయి గారి జీవితం నాశనం అయిపోయేదని అంటాడు. అప్పలనాయుడు రాజుకి ధైర్యం చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కాశీ దాసు కొడుకని తెలుసుకున్న శ్రీధర్.. ఇక స్వప్న పెళ్లి అయినట్లే.. పారు, శౌర్యల ఫన్నీ ఫైట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
Rains Update: అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
Asha Worker Protest: సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
MLC By Poll: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
Embed widget