అన్వేషించండి

Ammayi garu Serial Today September 14th: అమ్మాయి గారు సీరియల్: రూపని కిడ్నాప్ చేసిన గౌతమ్.. రేణుకని బెదిరించి నిజం తెలుసుకున్న రాజు!

Ammayi garu Today Episode రేణుక దగ్గరకు వెళ్లిన రాజు గౌతమ్‌కి కాల్ చేయించి రూప గురించి తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప కనిపించడం లేదని సూర్యప్రతాప్ ఇంటికి వచ్చి గొడవ చేశాడని ముత్యాలు శ్వేతకి ఫోన్‌లో చెప్తుంది. రూపని వెతకడానికి రాజు కూడా గన్ తీసుకొని వెళ్లాడని చెప్తుంది. శ్వేత, హర్ష షాక్ అవుతారు. ఇక తర్వాత మాట్లాడుకుందామని శ్వేత ఫోన్ పెట్టేస్తుంది. రూప కనిపించడం లేదంటున్నారు కాబట్టి మనం కూడా వెతుకుదామని హర్ష చెల్లితో చెప్తాడు. రూపని వెతికి పట్టుకొని శాశ్వతంగా అడ్డు రాకుండా చేయాలని అంటాడు. 

హర్ష: మన చేతికి మట్టి అంటకుండా రూపని లేపేస్తే. 
శ్వేత: ఇంతకు ముందు ఆ ప్రయత్నం కూడా చేశాను కానీ రాజు, సూర్యప్రతాప్ ఉన్నంత వరకు రూపని టచ్ కూడా చేయలేం.
హర్ష: అయితే రూపని కిడ్నాప్ చేయిద్దాం.
శ్వేత: ఐడియా రూపని దక్కించుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఎప్పటికైనా రూప దక్కుతుందనే ఆశతో బతుకుతున్న అమర ప్రేమికుడు గౌతమ్ ఉన్నాడు. రూప పరిస్థితి గౌతమ్‌కి తెలిస్తే మనకి సాయం చేస్తాడు.
గౌతమ్: చెప్పండి శ్వేత గారు.
శ్వేత: గౌతమ్ నువ్వు ఎగిరి గంతేసే ఒక విషయం చెప్తాను. రాజు, రూపలు విడిపోవాలని చూసే నీ కోరికను ఆ సూర్య ప్రతాప్ నెరవేర్చాడు. 
గౌతమ్: విడిపోవడం కలిసి పోవడం వాళ్లకి అలవాటే కదా. 

రూప మిస్ అయిందని వాళ్ల కంటే ముందే నువ్వు సొంతం చేసుకో అని అంటే గౌతమ్‌ రూపని వెతికిపట్టుకొంటానని అంటాడు. మన ప్లాన్ సక్సెస్ అవుతుందని శ్వేత అన్నతో చెప్తుంది. మరోవైపు రాజు కూడా రూప కోసం వెతుకుతుంటాడు. రూప మిస్ అవ్వడంతో రేణుక హస్తం ఉంటుందని రాజు అనుకుంటాడు. రూప నడుచుకుంటూ వెళ్తుంది. రూపని గౌతమ్ చూస్తాడు. కారు ఆపి రూప దగ్గరకు పరుగులు తీస్తాడు. రూప తన జీవితం రోజుకో మలుపు తిరుగుతుందని అనుకుంటుంది. తండ్రి ప్రేమ కోసం వెతికినప్పుడు తండ్రి దూరం అయ్యాడని భర్త ప్రేమ కోరుకుంటున్నప్పుడు భర్తని దూరం అవుతున్నాడని అనుకుంటుంది. తన భర్త తనకు కావాలని కోరుకుంటుంది. ఇక రూప దగ్గరకు గౌతమ్ వస్తాడు. రూపని లాక్కెళ్తాడు. బలవంతంగా తన కారు ఎక్కించి తీసుకెళ్తుంటాడు.

మరోవైపు రేణుక దొరికి పోయానని తన ముఖం రాజుకు ఎలా చూపించాలో తెలీడం లేదని అనుకుంటుంది. ఇంతలో రాజు రేణుక దగ్గరకు వస్తాడు. రేణుక రాజు అని ప్రేమగా మాట్లాడి ఇప్పటికైనా నా దారికి వచ్చావని అంటే అమ్మాయి గారు ఎక్కడ అని రాజు రేణుకని అడుగుతాడు. ఇక సూర్య ప్రతాప్ ఇంటికి ఆవేశంగా వెళ్లి సాయంత్రంలో రూప ఇంటికి వస్తుంది ఆ రాజే తీసుకొస్తాడని అంటారు. ఇక రాజు రేణుకతో అమ్మాయి గారు లేరని ఏమైందని రేణుకని అడుగుతాడు. రేణుక తనకు తెలీదని చెప్తుంది. రాజు రేణుకకు గన్ గురి పెడతాడు. దాంతో రేణుక ఏడుస్తూ తన మీద ఒట్టు పెట్టుకొని తనకు తెలీదని సీమంతంలోనే చివరి సారిగా చూశానని అంటుంది. 

మరోవైపు గౌతమ్ రూపని ఓ స్టోర్‌ రూంలో పెడతాడు. రాజుకి ఈ విషయం తెలిస్తే నీ ప్రాణం తీసేస్తాడని రూప గౌతమ్తో రూప అంటుంది. దానికి గౌతమ్ రాజు వచ్చే టైంకి నిన్ను నా సొంతం చేసుకుంటానని అంటాడు. కడుపు పోయింది కదా పోయిన ఆ కడుపు నేను ఇస్తానని అంటాడు. రూప చెప్పు తెగుతుందని తిడుతుంది. మరోవైపు రాజు గౌతమ్ మీద అనుమానంతో రేణుకకి గౌతమ్‌కి కాల్ చేయమని చెప్పి స్పీకర్ పెట్టిస్తాడు. గౌతమ్ రూప తన దగ్గరే ఉందని చెప్తాడు. అది విన్న రాజు షాక్ అయిపోతాడు. రూపని సొంతం చేసుకునే పనిలో ఉన్నానని అంటాడు. ఎక్కడున్నావని రేణుక అడిగితే గౌతమ్ లొకేషన్ పంపిస్తాడు. దాంతో రాజు ఆ లొకేషన్‌కి బయల్దేరుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: ఇంట్లో ఇద్దరు విశాల్‌లు అందరి ఫ్యూజులు అవుట్.. గాయత్రీ నువ్ సూపర్ తల్లీ!

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget