అన్వేషించండి

Ammayi garu Serial Today October 8th: అమ్మాయి గారు సీరియల్: కూతురిని అల్లుడి దగ్గరకు పొమ్మన్న సూర్యప్రతాప్.. చివరిలో ట్విస్ట్‌కి బిత్తరపోయిన రూప!

Ammayi garu Today Episode ముత్యాలు మారి రూపని క్షమించమని కాళ్ల మీద పడినా సూర్య ప్రతాప్ క్షమించకుండా రూపని తీసుకెళ్లిపోవడం రాజు నీకు కరెక్ట్ కాదు అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode అమ్మాయిగారు చాలా మంచిదని ముత్యాలుకి రాజు, అప్పలనాయుడు చెప్తారు. నీకు కిడ్నీ దానం చేసిన అమ్మాయి గారు కంటే శ్వేత ఏం గొప్పదో ఆలోచించమని రాజు అంటాడు. రాజు మాటలకు ముత్యాలు తన తప్పు తెలుసుకొని రూప దగ్గరకు వెళ్లి రెండు చేతులు జోడించి తనని క్షమించమని అంటుంది. 

ముత్యాలు: నన్ను క్షమించండి అమ్మాయి గారు. నేను ఏదో దెయ్యం పట్టినట్లు ప్రవర్తించాను. ఆ రోజు మీరు మీ నాన్న గారితో వెళ్లిపోయారనే కోపం తప్ప ఇంకేం లేదు. తనని క్షమించమని చెప్పి రూప కాళ్ల దగ్గర కూర్చొంటుంది.
సూర్యప్రతాప్: అమ్మా రూప ఈమె మాటలకు నువ్వు లొంగిపోవద్దు అవసరాలకు ఊసరవెళ్లిలా రంగులు మార్చుతుంది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు. నిన్ను వాళ్ల దగ్గరకు పంపితే నిన్ను ఏం చేస్తారనే భయం ఉందమ్మా వీళ్లని నమ్మడానికి వీళ్లేదు. అమ్మా రూప వెళ్దాం పద.
విరూపాక్షి: అదేంటి సూర్య నీకు ఎవరి మీద కోపమో వాళ్లు కూడా మోకాలి మీద పడి క్షమాపణ చెప్తే ఇంకా నీ పంతం ఏంటి. ఇది మన కూతురి జీవితం.
సూర్యప్రతాప్: మన కాదు నా కూతురి జీవితం. నా కూతురి జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు ముఖ్యంగా నువ్వు చెప్తే వినే పరిస్థితిలో నేను లేను. పద రూప.
రాజు: అమ్మా నువ్వు బాధ పడకు అమ్మాయి గారు మనల్ని వదిలి ఎక్కడికీ వెళ్లరు. నువ్వు పెద్దయ్య వల్ల నిజం తెలుసుకున్నావ్ అది చాలు..
ముత్యాలు: నేను మారడం కాదురా పెద్దయ్యగారు నిన్ను అమ్మాయి గారిని కలపాలి. అయ్యగారు, పెద్దమ్మ గారు కలవాలి. అమ్మగారు మీరు ఏమీ అనుకోకపోతే మాతోనే ఉండండి. మనందరం ఒకటి అయి ఈ రెండు కుటుంబాలు కలిసేలా చేద్దాం. పదండి అమ్మగారు ఇంటికి వెళ్దాం.

విజయాంబిక మరోసారి రాఘవని కట్టి పడేస్తుంది. రాఘవ అయ్యగారికి నిజం చెప్తా అంటే దీపక్ చంపడానికి వెళ్తాడు దాంతో విజయాంబిక కొడుకుని ఆపుతుంది. ఈసారి ఎలక్షన్‌లలో జీవన్ సీఎం అయితే నీకు ఎమ్మెల్సీ ఇస్తాడని మీ మామయ్య ఓడిపోయిన తర్వాత వీడు నిజం చెప్పినా వినడని అంటుంది. ఇక సూర్యప్రతాప్ ఇంటికి వచ్చే సరికి మనం ఇంట్లో ఉంటే ఎవరికీ అనుమానం రాదని వెంటనే వెళ్లిపోదాం అంటుంది. ఇక సూర్యప్రతాప్ రూపని తీసుకొని ఇంటికి వస్తాడు. 

రూప: నాన్న టైంకి తినడం పడుకోవడం ఇదేనా నాన్న నా జీవితం ఇదేనా నాన్న నా భవిష్యత్. నా భవిష్యత్ నుంచి నన్ను ఎందుకు నాన్న దూరం చేశారు. 
సూర్యప్రతాప్: నీకు భవిష్యత్ లేని చోట భవిష్యత్ వెతుకుతున్నావ్.
రూప: నన్ను రాజు నుంచి దూరం చేయొద్దు నాన్న. 
సూర్యప్రతాప్: వాడితో నీకు భవిష్యత్ లేదు రూప. ఆ మూర్ఖుడి దగ్గరకు నిన్ను పంపించడం ఏంటి. 

విజయాంబిక సూర్య ప్రతాప్‌ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటే రూప అత్తని కొంపలు కూల్చొద్దని వార్నింగ్ ఇస్తుంది. మీరు తోడు లేకపోవడం వల్ల మా అమ్మ చాలా ఇబ్బందులు పడిందని అమ్మ అంటే మీకు ఎందుకు అంత కోపం అని అడుగుతుంది. అమ్మ నిజంగా తప్పు చేసిందే అయితే మీ చుట్టూ ఇన్నాళ్లు తిరగాల్సిన అవసరం లేదని ఏదో ఒక రోజు మీకు నిజం తెలుస్తుందని అప్పుడు మీరు ఎంత రియలైజ్ అవ్వాలి అనుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోతుందని అంటుంది. ఇక శ్వేత, జీవన్‌ల వల్లే ఆర్ ఆర్ కంపెనీ కూలిపోయిందని ఇంట్లో వాళ్లకి రూప చెప్తుంది.. అత్తయ్య కాళ్లు కూడా పట్టుకున్నా మీ పంతం ఏంటి అని అడుగుతుంది. నా విషయంలో మీరు పొరపాటు చేశారని అంటుంది. క్షమించకుండా తప్పు చేశారని అంటుంది. తనకు రాజు కావాలని అమ్మ కూడా మనతోనే ఉండాలని అంటుంది.

సూర్య ప్రతాప్ దానికి ఇంతకాలం నాకు నువ్వే ఒక్కదానివే తోడు అనుకున్నా కానీ నీకు వాళ్లే ముఖ్యం అని అర్థమైంది. నీ ఇష్టాన్ని కాదని నేను ఏం చేయలేనని నీ ఇష్టప్రకారమే చేయ్ అని రూపతో సూర్యప్రతాప్ అంటాడు. నీకు నచ్చినట్లు ఉండు అని చెప్తాడు. రూప సంతోషంతో ఆ విషయం అత్తింట్లో చెప్తానని పరుగులు తీస్తుంది. సూర్య కూడా వెళ్లమని అంటాడు. రూప గుమ్మం దాటి అడుగు బయట పెట్టే టప్పుడు సూర్య ఆపి నీ ఇష్టాన్ని నువ్వు గౌరవిస్తున్నట్లే నా ఇష్టాన్ని గౌరవిస్తానని మాట ఇవ్వు అంటాడు. దానికి రూప సరే అంటుంది. ఏ రాజు కోసం ఈ ఇంటి గడప దాటుతున్నావో మళ్లీ ఎప్పుడూ ఈ గుమ్మంలోకి రాను అని అదే రాజు మీద ఒట్టు వేసి వెళ్లు అని అంటాడు. రూప షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ కోసం జ్యోత్స్న పోరాటం.. తాత నిర్ణయం విన్న జ్యోత్స్న నిజంగానే చనిపోతుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget