అన్వేషించండి

Ammayi garu Serial Today October 29th: అమ్మాయి గారు సీరియల్: సూర్యప్రతాప్‌ ఫ్యామిలీ కిడ్నాప్‌.. మావోయిస్టుల దాడిని రాజు అడ్డుకుంటాడా!

Ammayi garu Today Episode జీవన్ సూర్యప్రతాప్‌ని చంపాలని మావోయిస్టులా తన వాళ్లని పంపి బాంబులు వేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విజయాంబిక, దీపక్ సూర్యప్రతాప్ దగ్గరకు వచ్చి మీ కోసం మొక్కుకున్నాం గుడికి వెళ్దామని చెప్తారు. రూప మనసులో వీళ్లు ఎందుకు నాన్న గురించి మొక్క కున్నారు. వీళ్లు మొక్కుకున్న ప్రతీ సారి ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుందని అనుకుంటుంది. ఎలా అయినా నాన్నని ఆపాలి అనుకుంటుంది. ఇక విజయాంబిక అందరం కలిసి గుడి వెళ్దామని అంటుంది.

రూప: ఇప్పుడేం అవసరం లేదు అత్తయ్య. ఇప్పుడు నాన్న సీఎం కదా ఇలా గుడులు అంటే కుదరదు. నాన్నని సీఎం ఆఫీస్‌కి వెళ్లనిద్దాం.
విజయాంబిక: రూప తమ్ముడు రేపటి నుంచి ఐదేళ్లు ప్రజాపాలనలో ఉంటాడు అందుకే ఇప్పుడు వెళ్దాం అనంత పద్మనాభ స్వామి అంటే చాలా పవర్ ఫుల్.
దీపక్: అమ్మా వద్దమ్మా నువ్వు అడిగి మామయ్య కాదు అంటే నువ్వు బాధ పడతావ్
సూర్యప్రతాప్: సరే వెళ్దాం.
విజయాంబిక: అందరూ బయల్దేరండి పింకీ మీరు రండి.
జీవన్: మీరు మమల్ని మీ అని అనుకుంటేనే మేం వస్తాం మామయ్య గారు. 
చంద్ర: మాకు రూప ఒక్కర్తే కూతురు ఇంకెవరకూ లేరు. 
సూర్యప్రతాప్: అలా అనకు చంద్ర పిల్లలు తప్పు చేశారని మనం వదిలేస్తే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. అసలు జరిగింది ఏంటో తెలికుండా నిర్ణయం తీసుకోకూడదు. అక్క వీళ్లు కూడా వస్తారు ఏర్పాట్లు చేయండి.
జీవన్: చెప్పా కదా పింకీ మీ నాన్న ఒప్పుకోకపోయినా మీ పెద్దనాన్న చేస్తారు. 

 అందరూ గుడికి బయల్దేరుతారు. జీవన్ విజయాంబికతో సూర్యప్రతాప్ ఈజీగా దొరికాడని అంటాడు. దానికి విజయాంబిక నా కొడుకు రాజకీయ జీవితం కోసం నా తమ్ముడి బలి తప్పదనిపిస్తుందని అంటుంది. ఇక రూప రాజుకి గుడికి వెళ్తున్నాం అని రాజుతో చెప్తుంది. విజయాంబిక మొక్కుకుందని అందుకే వెళ్తున్నాం అని చెప్తుంది. రూప మాట్లాడటం విన్న రాజు జాగ్రత్తగా వెళ్లండని చెప్తాడు. కానీ రాజుకి డౌట్ వస్తుంది. సూర్యప్రతాప్ పింకి సైలెంట్‌గా ఉండటం చూసి ఎందుకు మాట్లాడటం లేదని అనుకుంటాడు. తానే పింకీతో మాట్లాడి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావో నాకు తెలీదు కానీ వాడు నీ మీద ప్రేమతో చేసుకోలేదు ఏదో కారణంతో పెళ్లి చేసుకున్నాడని అంటాడు. దానికి ప్రీతి మనసులో వాడు మిమల్ని పదవి నుంచి తొలగించడానికే నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ అది చెప్పలేనని పింకి అనుకుంటుంది.

ఇక దీపక్ జీవన్‌కి పెళ్లి చేసుకోవడానికి కారణం అడిగితే తర్వాత చెప్తా అని జీవన్ అంటాడు. ఇక దీపక్ పింకిని బ్లాక్ మెయిల్ చేస్తే ఇప్పుడు ఒంటరిగా ఉన్నందుకు చెప్తేస్తుందని అంటే జీవన్‌కి భయం మొదలవుతుంది. పింకీ నిజం చెప్పేస్తుందేమో అని టెన్షన్ పడతాడు. పింకికి రూప, సూర్యలు నిజం చెప్పమని అడుగుతారు. పింకీ కూడా చెప్పాలని అనుకుంటుంది. ఇంతలో జీవన్ పింకికి మెసేజ్ చేస్తాడు. పింకికి ఫొటోలు పంపిస్తాడు. దాంతో పింకి నిజం చెప్పకుండా మాట దాటేస్తుంది. ఇక జీవన్ మావోయిస్ట్‌లుగా ఉన్న తన వాళ్లకి అప్డేట్స్ ఇస్తుంది. ముగ్గురు రూపని, సూర్యప్రతాప్‌ని చంపేయాలి అనుకుంటారు.

శ్వేత, రేణుకలు రాజు నాకు కావాలి అంటే నాకు కావాలి అనుకుంటారు. గౌతమ్‌ ఇద్దరినీ వారిస్తాడు. సూర్య ప్రతాప్ కారుకి అడ్డంగా రాళ్లు పెడతారు. బాంబులు కూడా ఫిక్స్ చేస్తారు. మిగతా వాళ్లు గన్‌లతో రెడీగా ఉంటారు. ఓ పోలీస్ అధికారం కిందకి దిగడంతో అతన్ని కాల్చేస్తారు. సెక్యూరిటీ మీద బాంబులతో గన్‌లతో దాడి చేస్తారు. అందరూ భయంతో పరుగులు తీస్తారు. మరోవైపు విరూపాక్షి టీవీ చూస్తుంటుంది. ఇంతలో సూర్యప్రతాప్ ఫ్యామిలీ కిడ్నాప్ అనే వార్త వస్తుంది. దాంతో విరూపాక్షి సూర్య అని అరుస్తుంది. రాజు, ముత్యాలు అందరూ కంగారుగా వస్తారు. న్యూస్ చూసి అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సంజయ్ చెంప పగలగొట్టిన సత్య.. దెబ్బకు మాయం.. ఫుల్ జోష్‌లో క్రిత్య!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 7th:మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
నువ్వులేక నేను లేను: మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
Podarillu Serial Today August 7th: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ
పొదరిల్లు: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget