అన్వేషించండి

Ammayi garu Serial Today October 15th: అమ్మాయి గారు సీరియల్: తనని మోసం చేశాడని దీపక్‌ ఇంట్లో హారతి.. రూపని తీసుకొస్తానని మాటిచ్చిన రాజు!

Ammayi garu Today Episode ముత్యాలు, అప్పలనాయుడు పెళ్లి రోజుకి కోడలు రూపని తీసుకొస్తానని రాజు మాటివ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode హారతిని తన కడుపు చేసి పెళ్లి చేసుకోకుండా తన బాయ్ ఫ్రెండ్ వదిలేశాడని న్యాయం కోసం సూర్యప్రతాప్ దగ్గరకు తీసుకొస్తుంది మందారం. హారతి వచ్చిన టైంకి దీపక్‌కి వేరే ఫోన్ రావడంతో వెళ్లిపోతాడు. విజయాంబిక వాళ్లతో మాట్లాడి ఇలాంటి పంచాయితీలు ఎందుకని మందారాన్ని ప్రశ్నిస్తుంది. ఇక హారతి వాళ్లు లోపలకి వెళ్లడంతో దీపక్ తల్లి దగ్గరకు వచ్చి ఏమైందని అడుగుతాడు. మందారం చాలా ఓవర్ చేస్తుందని వేరే వాళ్ల ముందు పరువు తీస్తుందని అంటుంది. ఇక అది హారతి కాదు కదా అని దీపక్ అనుకుంటాడు. ఎవరో చూద్దాం పద మమ్మీ అని వెళ్తారు.

మందారం సూర్య ప్రతాప్‌ని పిలిచి హారతిని పరిచయం చేస్తుంది. సూర్యప్రతాప్‌ని చూసిన హారతి ఈయన దీపక్ మామయ్య కదా మందారానికి ఈయన తెలుసా అనుకుంటుంది. ఇక హారతిని ఎవరో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని చెప్తుంది. దానికి సూర్యప్రతాప్ అలా ఎలా నమ్మేస్తారమ్మ అని అతను ఎవరో చెప్పమని అడుగుతారు.

హారతి: అతనెవరో కాదండీ మీ దీపక్‌ అని చెప్పబోతే ఇంతలో దీపక్ వస్తాడు.
దీపక్: మామయ్య ఈమె నా ఫ్రెండ్. హారతి నువ్వేంటి ఇక్కడ.
విజయాంబిక: కొంపతీసి దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి వీడు కాదు కదా. 
మందారం: మీకు దీపక్ బాబు ముందే తెలుసా. 
హారతి: నేను ప్రేమించింది..
దీపక్: హా.. హారతి ప్రేమించిది నా ఫ్రెండ్‌నే మామయ్య. 
సూర్యప్రతాప్: ఫ్రెండా అయినా అలాంటి వాడితో నీకు ఫ్రెండ్‌షిప్ ఏంట్రా. 
దీపక్: మామయ్య నాకు తెలిసినంత వరకు వాడు మోసగాడు కాదు మామయ్య ఏదో ప్రాబ్లమ్ వల్ల రెస్పాండ్ అయింటాడు. ఏం హారతి అంత వరకు ఇక్కడికి రావాలా నాకు చెప్పాల్సింది కదా.

ఇక సూర్యప్రతాప్ ఆ బాధ్యత దీపక్‌కే అప్పగిస్తాడు. హారతిని దీపక్ కంగారుగా బయటకు తీసుకెళ్లి ఇలా ఎందుకు వచ్చావ్ ఎలక్షన్ తర్వాత పెళ్లి చేస్తానని అంటే ఇలా వచ్చి నన్ను మోసం చేసినవాడిలా చేయాలనుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది. ఇక మీ అమ్మగారిని పరిచయం చేయమని అంటుంది హారతి. దానికి తర్వాత మంచి ముహూర్తం చూసి చేస్తానని చెప్పి పంపేస్తాడు. విజయాంబిక వచ్చి ఎవరు అని అడుగుతుంది. దీపక్‌ ఫ్రెండ్ అని అంటే లాగి పెట్టి ఒక్కటిస్తుంది. నేను అంతా విన్నానురా అని ఈ అమ్మాయిల పిచ్చి ఏంట్రా అని తిడుతుంది. ఈ విషయం మీ మామయ్యకి తెలిస్తే నట్టింట్లోనే నిన్ను కాల్చి పడేసేవాడని అంటుంది. మందారం నీ పెళ్లాం మందారానికి హారతి గురించి తెలిసినా ఆ పిల్లకి మందారం గురించి తెలిసినా నిన్ను ఒకరికి ఒకరు చంపేస్తారని అంటుంది. ఇక మందారాన్ని ఆ అమ్మాయికి దూరంగా ఉంచమని అంటుంది. 

ఇంతలో మందారం అక్కడికి వస్తుంది. హారతి జీవితం నాశనం చేసిన వాడికి బుద్ధి చెప్పి వాడితో పెళ్లి చేయమని అంటుంది. ఇక ఆ విషయంలో మందారాన్ని ఇన్వాల్వ్ అవ్వొద్దని దీపక్ చెప్తాడు. ఇక విజయాంబిక దీపక్‌తో ఈ రోజు నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నిన్ను మర్చిపోవాల్సి వస్తుందని అంటుంది. మరోవైపు రేపు ముత్యాలు పెళ్లి రోజు కావడంతో వాళ్లు సెలబ్రేట్ చేసుకోమని అంటారు. ఇక విరూపాక్షి కూడా చేసుకోమని అంటుంది. దానికి ముత్యాలు నా కొడుకు భార్యకి దూరంగా ఉంటే నేను ఎలా పెళ్లిరోజు చేసుకోగలని అంటుంది. రాజు, రూప కలిసే వరకు ఇలాంటివేమీ వద్దని అంటుంది. దానికి విరూపాక్షి అప్పలనాయుడు, ముత్యాలుతో రాజు, రూప విడిపోలేదని ఇద్దరూ దూరంగా ఉన్నారని ఈ విధంగా అయినా అందరూ సంతోషంగా ఉంటారని అంటుంది. రాజుకి పెళ్లి రోజు చేయమంటే మా కోడలు వస్తేనే మాకు పండగని అప్పటి వరకు మమల్ని వదిలేయండని అంటుంది. ఇక రూప ఇంట్లో అడుగు పెట్టినప్పుడే పెళ్లి రోజు జరుపుకుంటామని అంటారు. దానికి విరూపాక్షి రాజుతో వెళ్లి రేపే నీ భార్యని తీసుకురా అంటుంది. రాజు తీసుకొని వస్తా అంటాడు. 

ఇక రాజు రూపకి కాల్ చేసి రేపు మిమల్ని బయటకు తీసుకెళ్తానని అంటాడు. చిన్న సర్‌ఫ్రైజ్ ఉందని అంటాడు. రూప ఏంటా అని ఆలోచిస్తుంది. ఇక సూర్యప్రతాప్ ఇంటి దగ్గర కార్యకర్తలు సందడి చేస్తుంటారు. సూర్యప్రతాప్ ప్రచారానికి బయల్దేరుతాడు. రూప రాజు సర్‌ఫ్రైజ్ గురించి ఆలోచిస్తుంది. నాన్న బయటకు వెళ్లే వరకు రాజు రాకపోతే బాగున్ననని అనుకుంటుంది. ఇంతలో రాజు అక్కడికి వస్తాడు. రూపకి కాల్ చేసి బయటకు రమ్మని పిలుస్తాడు. నాన్న ఉన్నారు రాను అని రూప అంటే మీరు తలచుకుంటే రాగలరు రండి అమ్మాయిగారు అంటారు. నాన్న బయటకు వెళ్లేంత వరకు ఆగండి అని రూప అంటే పెద్దయ్యగారు ఆయనతో పాటు మిమల్నీ తీసుకెళ్లిపోతారని అంటాడు రాజు. రూప తన పిన్నిని చాటుగా పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read:  సత్యభామ సీరియల్: సత్యకి గన్ గురి పెట్టిన రుద్ర.. నందినిని గదిలో లాక్ చేసి హర్షతో మైత్రి రొమాన్స్!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget