అన్వేషించండి

Ammayi garu Serial Today November 5th: అమ్మాయి గారు సీరియల్: పింకీ, జీవన్‌లకు పెళ్లి జరగలేదని అనుమానపడ్డ సూర్య.. అంతుచూస్తానంటోన్న రాజు!

Ammayi garu Today Episode రాజుకి ఇంట్లో వాళ్లు అల్లుడు భోజనం పెట్టడం జీవన్ వచ్చి గొడవ పెట్టి పింకీతో తాను తినిపించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విజయాంబిక ఏర్పాటు చేసిన పెద్ద అరటి ఆకులో రకరకాలు వంటలను రాజు కోసం రూప వడ్డిస్తుంది. రాజు ఆ వంటకాలను చూసి ఉబ్బితబ్బిబవుతాడు. అందరూ సంతోషంగా ఉంటారు. ఇక రూప కూడా రాజు పక్కన కూర్చొంటుంది. రాజుని ఒక్కటి కూడా మిగల్చకుండా తినమని సూర్యప్రతాప్ చెప్తాడు. ఇక అక్కడ జరిగిన ఆ సంఘటనని ఫోటో తీసి మందారం విరూపాక్షికి పంపిస్తే విరూపాక్షి ముత్యాలు వాళ్లకి చూపించి చాలా సంతోషపడతారు. నా కొడుకు కోడలు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఇద్దరూ సంతోషంగా కనిపిస్తున్నారని అప్పలనాయుడు, ముత్యాలు సంతోషిస్తారు.

అప్పలనాయుడు: రాజు, రూపలు సంతోషంగా ఉన్నారు కానీ పింకీ గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది.  ఆ జీవన్ అంత మంచోడు కాదమ్మా. మనిషి రూపంలో ఉన్న తోడేలు. 
విరూపాక్షి: ఆ ఇంట్లోకి రాజు అడుగు పెట్టాడు కదా పింకీ జీవితమే కాదు అందరి జీవితాలను ఒక గాడిలో పెడతాడు.
విజయాంబిక: రాజు తింటుంటే.. ఆగు రాజు. అదేంటి రాజు జీవన్ కోసం తీసుకొచ్చిన అరటి ఆకులో నువ్వు భోజనం చేస్తున్నావ్.
సూర్యప్రతాప్: అదేంటి అక్క అల్లుడికి అన్నావ్ కదా.
విజయాంబిక: అవును తమ్ముడు జీవనే కదా ఈ ఇంటికి వచ్చిన కొత్త అల్లుడు. 
చంద్ర: అక్కా వాడు పింకీకి తాళి కట్టిన వాడు మాత్రమే. తాళి కట్టిన వాడు ఈ ఇంటికి అల్లుడు మాత్రం కాలేడు. ఈ ఇంటికి అల్లుడు అంటే అది రాజు మాత్రమే.
జీవన్: పింకీ మెడలో నేను తాళి కట్టినట్లే రాజు కూడా రూప మెడలో తాళి కట్టాడు రాజు అల్లుడు అయితే నేను ఎందుకు అల్లుడు కాకూడదు. నేను కూడా అల్లుడినే నేను అల్లుడి భోజనం చేయాల్సిందే. ఆంటీ నాకు అల్లుడిగారి భోజనమే కావాలి.
విజయాంబిక: దీపక్ నువ్వు వెళ్లి ఇంకో అరటి ఆకు చాప తీసుకురా.

దీపక్ తీసుకురాగానే పింకీకి మీ ఆయనకు వడ్డించని విజయాంబిక చెప్తుంది. ఇబ్బంది పడుతూనే పింకి వెళ్తుంది. చంద్ర లేచి వెళ్లిపోబోతే సూర్యప్రతాప్ ఆపుతాడు. పింకీ జీవన్‌కి వడ్డిస్తుంది. పింకీకి జీవన్‌కి తినిపించమని విజయాంబిక చెప్తుంది. దానికి చంద్ర పింకీకి లేనిపోనివి నేర్పించాలి అని చూడకు అని అంటాడు. ప్రేమించిన వాడిని ఇంటికి తీసుకొచ్చిన పింకీ ఏ రకంగా చిన్నపిల్లలా కనిపిస్తుందని విజయాంబిక అడుగుతుంది. దానికి రాజు పింకీని చూస్తే ఇష్టంతో పెళ్లి చేసుకున్నట్లు ఉందా అని అడుగుతాడు. దానికి జీవన్ ఇన్‌డైరెక్ట్‌గా పింకీని బెదిరించి తనకి తినిపించమని అంటాడు. పింకీ జీవన్ పక్కన కూర్చొగానే సూర్యప్రతాప్, చంద్రలు లేచి వెళ్లిపోతారు. పింకీ జీవన్‌కి తినిపిస్తే రాజు, రూపలు వెళ్లిపోతారు. పింకీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ నటన చాలా బాగుందని జీవన్ పింకీతో అంటాడు.

పింకీ ఒంటరిగా ఉంటే రాజు రూపలు వెళ్లి దేనికి భయపడుతున్నావ్ అని అడుగుతారు. ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా మేం సాల్వ్ చేస్తామని అంటారు. ఇంట్లో అందరూ నిన్నే నమ్ముతున్నారని ఏం అయిందో చెప్పమని అడుగుతారు. పింకీ చెప్పే టైంకి జీవన్ ఫోన్ చూపించి బెదిరిస్తాడు. దాంతో పింకీ కవర్ చేస్తుంది. జీవన్ మంచోడని చెప్తుంది. దాంతో రూప పింకీని లాగిపెట్టి కొడుతుంది. ఇంతలో జీవన్ వచ్చి మీ పింకీ డ్రగ్స్‌కి అడిక్ట్ అయినట్లు నాకు అడిక్ట్ అయిందని పింకీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. 

గౌతమ్ దగ్గరకు రేణుకని ముందు పెళ్లి చేసుకున్న గొర్రె వచ్చి గౌతమ్‌ని ఢీకొడుతుంది. రేణుక జీవితం నుంచి వెళ్లిపోమని అంటుంది. అంటే నువ్వు అని గౌతమ్ అడిగితే నువ్వు తాళి కట్టిన రేణుక మొదటి భర్తని అని చెప్తుంది గొర్రె. రేణుక కోసం గౌతమ్‌తో గొర్రె పొట్లాడుతుంది. ఇంతలో రేణుక అక్కడికి వచ్చి నీతో జరిగింది పెళ్లి కాదు. నువ్వు పో అని తిడుతుంది. ఇక సూర్యప్రతాప్ దగ్గరకు చంద్ర, సుమలు వచ్చి జీవన్ అంత చేస్తున్నా ఎందుకు  మౌనంగా ఉన్నారని అడుగుతారు. దానికి సూర్యప్రతాప్ పింకీ జీవితం కోసం మీ కంటే నాకు ఎక్కువ బాధ్యత ఉందని పింకీ నోరు తెరిచి జీవన్‌ గురించి నిజం  చెప్తేనే జీవన్‌ని శిక్షిస్తానని అంటాడు. పింకీకి జీవన్‌కి పెళ్లి జరగలేదని అనిపిస్తుందని సూర్యప్రతాప్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్యని ఇబ్బంది పెట్టడానికి భైరవి ప్లాన్.. భైరవి గెటప్‌కి పడిపడి నవ్వుకున్న తండ్రీకొడుకులు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఏపీలో నామినేటెడ్ పదవులు రెండో జాబితా విడుదల- పార్టీ కోసం పని చేసిన బిసిలకు గుర్తింపు
ఏపీలో నామినేటెడ్ పదవులు రెండో జాబితా విడుదల- పార్టీ కోసం పని చేసిన బిసిలకు గుర్తింపు
Seaplane In Andhra Pradesh: మోడల్‌ సీప్లేన్‌ పర్యాటకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు- ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శ్రీశైలానికి ప్రయాణం
మోడల్‌ సీప్లేన్‌ పర్యాటకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు- ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శ్రీశైలానికి ప్రయాణం
Pawan Kalyan: పవన్‌తో సురేందర్ రెడ్డి సినిమా - అసలు విషయం చెప్పేసిన నిర్మాత!
పవన్‌తో సురేందర్ రెడ్డి సినిమా - అసలు విషయం చెప్పేసిన నిర్మాత!
YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఏపీలో నామినేటెడ్ పదవులు రెండో జాబితా విడుదల- పార్టీ కోసం పని చేసిన బిసిలకు గుర్తింపు
ఏపీలో నామినేటెడ్ పదవులు రెండో జాబితా విడుదల- పార్టీ కోసం పని చేసిన బిసిలకు గుర్తింపు
Seaplane In Andhra Pradesh: మోడల్‌ సీప్లేన్‌ పర్యాటకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు- ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శ్రీశైలానికి ప్రయాణం
మోడల్‌ సీప్లేన్‌ పర్యాటకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు- ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శ్రీశైలానికి ప్రయాణం
Pawan Kalyan: పవన్‌తో సురేందర్ రెడ్డి సినిమా - అసలు విషయం చెప్పేసిన నిర్మాత!
పవన్‌తో సురేందర్ రెడ్డి సినిమా - అసలు విషయం చెప్పేసిన నిర్మాత!
YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
TG TET 2024: తెలంగాణ టెట్‌లో ఏ పేపర్‌కు ఎవరు అర్హులు? పరీక్షఎలా ఉంటుంది?
తెలంగాణ టెట్‌లో ఏ పేపర్‌కు ఎవరు అర్హులు? పరీక్షఎలా ఉంటుంది?
Nirmal District News: నిర్మల్ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి- మహారాష్ట్ర దాటిందనుకుంటే కుంటాలలో ప్రత్యక్షం
నిర్మల్ జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి- మహారాష్ట్ర దాటిందనుకుంటే కుంటాలలో ప్రత్యక్షం  
Embed widget