Ammayi garu Serial Today November 27th: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షిని ఇంటికి తీసుకొచ్చిన రూప.. రాఘవని కాపాడిన రాజు.. తలపట్టుకున్న తల్లీకొడుకులు!
Ammayi garu Today Episode రాజు రాఘవని కాపాడటం రూప విరూపాక్షిని ఇంటికి తీసుకురావడం సూర్య భార్యని రానివ్వకుండా ఆపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode విరూపాక్షి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రూప ముత్యాలు ఇంటి దగ్గరకు వస్తుంది. ముత్యాలు రూపని అపడానికి ప్రయత్నిస్తుంది. దాంతో రూప ఎందుకు మీరు మమల్ని దూరం పెడుతున్నారని అంత తప్పు ఏం చేశాం అని అడుగుతుంది.
రూప: అమ్మా వాళ్లు రాజుని దూరం పెట్టడానికి వాళ్ల కారణాలు వాళ్లకి ఉన్నాయి. కానీ నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు నేను ఏం తప్పు చేశాను అమ్మా.
విరూపాక్షి: నా కారణాలు నాకు ఉన్నాయి ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు వచ్చిన పని ఏంటో చెప్పేసి వెళ్లమను ముత్యాలు.
రూప: మీరు మమల్ని దూరం పెట్టినా మేం మాత్రం మీకు దగ్గరవ్వాలనే ప్రయత్నిస్తున్నాం అమ్మా. మమల్ని వదిలి బతికే ధైర్యం మీకు ఉందేమో కానీ మిమల్ని వదిలేసి బతికే ఆలోచన కూడా మాకు లేదు. అమ్మా నిన్నూ నాన్నని కలపడానికి ఓ మంచి అవకాశం దొరికింది. రాఘవ ఎక్కడున్నాడో తెలిసిందమ్మా. రాజు రాఘవని తీసుకురావడానికి వెళ్లాడు. నువ్వు ఇంటికి వస్తే అన్నీ సమస్యలు తొలగిపోతాయమ్మా రామ్మ ఇంటికి వెళ్దాం.
విరూపాక్షి: మనసులో ఇష్టం ఉన్నా పైకి మాత్రం విరూపాక్షి మాటలు.. రూప నాకు సూర్యని కలిసే ఉద్దేశం లేదు. జరిగిన వన్నీ మీరు గమనిస్తే మీరు హ్యాపీగా ఉన్నప్పుడు నేను మీతో లేను. మీరు దూరంగా ఉన్న ప్రతీ సారి మీ దూరానికి కారణం నేను. నువ్వు రాజు దగ్గరవుతారన్న మొదటి సారి మిమల్ని దూరం చేసింది విరూపాక్షి అన్న పేరు. సూర్య నీ మీద కోప్పడటానికి మీరు ఇంత కాలం దూరంగా ఉండటానికి కారణం నేను. రాఘవ వచ్చి నిజం చెప్పినా ఏదో మాయ చేసి సూర్యని మార్చేస్తుంది ఆ విజయాంబిక. రాజు, నువ్వు బాగున్నారు కదా కనీసం మీరు అయినా బాగుండండి. సూర్య లేకుండా 20 ఏళ్లు బతికేశాం ఇకపై బతకలేనా.
రూప: అమ్మా నాన్నకి నీ మీద కోపానికి కారణం రాఘవ. రాఘవ నిజం చెప్తే నాన్న నిన్ను అంగీకరించకపోవచ్చు కానీ నాన్న నువ్వు ఏ తప్పు చేయలేదు అని తెలుసుకుంటారు. ఆ క్షణం ఇన్నేళ్లు నిన్ను అనవసరంగా శిక్షించానని కదా అని అనుకుంటారు ఆ టైంలో నువ్వు నాన్న ఎదురుగా ఉండాలి. రామ్మా.
మరోవైపు రఘు సూర్య వాళ్లతో గంటలో విజయాంబిక లేస్తుందని ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని అంటాడు. దీపక్ విజయాంబిక దగ్గరకు వెళ్లి తల్లిని లేపుతాడు. విజయాంబిక దీపక్‌తో మన కొంప మునిగిపోయిందని రాఘవ ఎక్కడున్నాడో చెప్పేశానని అంటుంది. దీపక్ షాక్ అయిపోతాడు. కొంప ముంచేశావ్ అని దీపక్ రాఘవని దాచిన రౌడీలకు ఫోన్ చేస్తాడు. రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయరు. రాజుని అడ్డుకోవడానికి రాఘవ దగ్గరకు దీపక్ బయల్దేరుతాడు. మరోవైపు ముత్యాలు, అప్పలనాయుడు విరూపాక్షిని ఇంటికి వెళ్లమని చెప్తారు. దాంతో విరూపాక్షి సరే అంటుంది. పిల్లల ఆనందం కోసం అయ్యగారి దగ్గరకు వెళ్లే అవకాశం కూడా వదులు కోవడానికి అమ్మగారు సిద్ధపడ్డారు ఎంత గొప్పోళ్లో అని ముత్యాలు, అప్పలనాయుడు అనుకుంటారు.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపకి మల్లెపూలు ఇచ్చిన కార్తీక్.. దీపని చంపడానికి జ్యోత్స్న ప్లాన్!
ఇక రాజు రాఘవ ఉన్న చోటుకి వెళ్లి రౌడీలను చితక్కొడతాడు. రాఘవని విడిపించి వెళ్లిపోమని చెప్తాడు. మరోవైపు దీపక్ హడావుడిగా వస్తుంటాడు. రాఘవ బయటకు వచ్చి ఆటోలో పారిపోతాడు. రాఘవ వెళ్లగానే దీపక్ అక్కడికి వస్తాడు. రౌడీలకు రాజు చితక్కొట్టడం విషయం తెలుసుకుంటాడు. ఏం చేయాలో తెలీక తల పట్టుకుంటాడు. ఇక రాజు కూడా ఇంటికి బయల్దేరుతాడు. మరోవైపు రూప విరూపాక్షిని తీసుకొని ఇంటికి వెళ్తుంది. రాఘవ ఇంటికి వస్తే పరిస్థితి ఏంటి అని విజయాంబిక అనుకుంటుంది. ఇక సూర్యప్రతాప్ విరూపాక్షిని చూసి గుమ్మం బయటే ఆపేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్య ఉచ్చులో మహదేవయ్య పడతాడా.. డీఎన్‌ఏ టెస్ట్‌కి ఒప్పుకుంటాడా!