Ammayi garu Serial Today November 25th: అమ్మాయి గారు సీరియల్: శ్వేతని పెళ్లి చేసుకున్న పింకీ లవర్.. అదిరిపోయిన రాజు, రూపల ప్లాన్!
Ammayi garu Today Episode శ్వేతని రాజు బయటకు పిలిచి పింకీని జీవన్ పెళ్లి చేసుకున్నట్లు శ్వేతని గోపీ పెళ్లి చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode పర్సనల్‌గా మాట్లాడాలి రమ్మని రాజు శ్వేతకి కాల్ చేస్తాడు. దాంతో శ్వేత రాజు చెప్పిన హొటల్‌కి వెళ్తుంది. రాజు పక్కన రూపని చూసిన శ్వేత ఒంటరిగా రమ్మని రూపని తీసుకొచ్చాడేంటి అని అనుకుంటుంది. ఇక రాజు ఆరెంజ్ జ్యూస్ తీసుకురమ్మని చెప్తాడు. విషయం ఏంటి అని శ్వేత అడుగుతుంది.
రాజు: శ్వేత నువ్వు అమ్మాయిగారి ఇంట్లో గొడవ పడటం నాకు ఇష్టం లేదు. ఆ గొడవ అడ్డుపెట్టుకొని మీరు పింకీని ఇబ్బంది పెడతారేమో అని అమ్మాయి గారు టెన్షన్ పడుతున్నారు.
శ్వేత: మనసులో ఓహో కాళ్లబేరానికి వచ్చారన్నమాట
రూప: శ్వేత మాకు మా లైఫ్తో పాటు పింకీ లైఫ్ కూడా ముఖ్యం.
ఇంతలో జ్యూస్ తీసుకొస్తే ముగ్గురూ తాగుతారు. శ్వేత జ్యూస్ తాగిన కొద్ది సేపటికి శ్వేత మైకంతో పడిపోతుంది. మరోవైపు జీవన్ ఇంట్లో శ్వేత కోసం వెతుకుతాడు. అందరినీ అడుగుతాడు. ఎవరూ చూడలేదని అంటారు. జీవన్ ఇళ్లంతా వెతికి రాజు రూపల గదిలో కూడా చూసి వీళ్లు ఏమైనా తీసుకెళ్లారా అనుకొని ఫోన్ చేస్తాడు. ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇక రాజు, రూపలు శ్వేత ముఖం మీద నీళ్లు చల్లుతారు. శ్వేత మెడలో తాళి ఉంటుంది. తనకు ఏమైందా అని శ్వేత అనుకుంటుంది. అయితే బేరర్‌గా వచ్చిన రాజు తమ్ముడు గోపీ శ్వేతకి ఇచ్చిన జ్యూస్‌లో మత్తు మందు కలుపుతాడు. శ్వేత తన మెడలో తాళి చూసి షాక్ అయిపోతుంది. ఏడుస్తుంది. ఎవరు తాళి వేశారని అడుగుతుంది. రూప ఆ తాళికి ముడులు వేసి శ్వేత మెడలో వేసుంటుంది.
రూప: ఎవరు వేశారని కాదు శ్వేత ఎవరు కట్టారని అడగాలి.
గోపీ: మాస్క్ తీసి నేనే కట్టాను.
శ్వేత: రేయ్ నా మెడలో నువ్వు తాళి కట్టడం ఏంట్రా అని గోపీని కొడుతుంది. తాళిని తెంపేయబోతుంది.
రూప: ఆగు తాళి తెంపేస్తే పెళ్లి పెళ్లి కాకుండా పోదు శ్వేత.
శ్వేత: పెళ్లి అంటే మీకు తెలుసా రెండు మనసులు కలవాలి వీడు నేను మనుషులమే కలలేదు. ఇంకా పెళ్లి ఏంటి. పెళ్లి అంటే మంగళవాయిద్యాలు, బంధువులు అన్నీ ఉండాలి ఇది పెళ్లి ఎలా అవుతుంది.
రూప: మరి పింకీ, జీవన్‌ల పెళ్లి ఎలా పెళ్లి అయింది శ్వేత. అది పెళ్లి అయితే ఇదీ పెళ్లే.
శ్వేత: అంటే ఇదంతా మీరు కావాలనే చేశారా రేయ్ నేను నీకు ఏం అన్యాయం చేశానురా నా జీవితం ఎందుకు నాశనం చేశావురా. అని గోపీని కొడుతుంది.
గోపీ: హలో మీ అన్నయ్యకి నేను ఏం అన్యాయం చేశానని నాకు అన్యాయం చేశాడు నా పింకీ మెడలో మీ అన్నయ్య తాళి కట్టాడు కదా నా పింకీ అనుభవిస్తున్న బాధ నువ్వు అనుభవించాలి. నేను పడే బాధ మీ అన్నయ్యకి అర్థం కావాలి.
శ్వేత తాళి తెంచేస్తా అప్పుడు నాకు పెళ్లే కానట్లు అని అంటే నీకు పెళ్లి అయినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని శ్వేత గోపీని ఎందుకు తాళి కట్టావ్ అని మాట్లాడిన మాటల వీడియో చూపిస్తారు. తాళి తెంచితే వీడియోలు మీడియాకు పంపిస్తామని అంటారు. శ్వేత విషయం అర్థమైందని రాజు వాళ్లని తీసుకెళ్లిపోతాడు. ఇక శ్వేత పింకీకి అన్యాయం చేసినందుకు రేణుక, గౌతమ్‌లకు ఇష్టం లేని పెళ్లి జరిగిందని ఈ గోపీకి నాకు పెళ్లి జరిగిందని మా అన్నయ్యకి ఏం శిక్ష పడుతుందో అని అనుకుంటుంది. ఇక ఇంటికి వచ్చిన రాజు, రూపలను జీవన్ శ్వేత గురించి అడుగుతాడు. రూప, రాజులు వెటకారంగా మాట్లాడి వెళ్లిపోతారు. శ్వేత ఏడుస్తూ నన్ను అడ్డుపెట్టుకొని పింకీని కాపాడాలని అనుకుంటున్నారని అనుకుంటుంది. ఇక జీవన్ శ్వేత కోసం టెన్షన్ పడుతున్నట్లు మెసేజ్ పెడతాడు. అది చూసిన శ్వేత జీవన్‌కి కాల్ చేసి అమ్మానాన్నలు గుర్తొచ్చి ఇంటికి వెళ్తున్నానని అంటుంది.
రూప, రాజులు రఘుకి కలుస్తారు. తాము చేసిన పని రఘుతో చెప్తారు. ఇక రఘు విజయాంబిక నిజం ఒప్పుకోవడమే ఉందని అందుకు ఏం చేయాలో ఆ ప్లాన్ చెప్తారు. రూప, రాజులు ఒకే అంటారు. ఇక విజయాంబిక పనులు చేయలేక బాధపడుతుంటుంది. ఇంతలో రూప, రాజలు పాము బొమ్మని విజయాంబిక గది వైపు విడిచిపెడతారు. ఫోన్‌లో పాము బుస సౌండ్ పెడతారు. విజయాంబిక పాముని చూసి షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.