Ammayi garu Serial Today November 21st: అమ్మాయి గారు సీరియల్: రూప, రాజులు చేసిన పనికి విజయాంబికని చెప్పులతో చితక్కొట్టిన భూత వైద్యుడు!
Ammayi garu Today Episode విజయాంబికకు దెయ్యం పట్టిందని భూతవైద్యుడితో చితక్కొట్టించేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode విజయాంబిక జీవన్, పింకీల ఫస్ట్‌నైట్ గురించి మాట్లాడటానికి సూర్యప్రతాప్ దగ్గరకు వస్తుంది. వీల్ ఛైర్‌లో వచ్చిన విజయాంబికని చూసి రెస్ట్ తీసుకోకుండా ఇలా వచ్చావ్ ఏంటి అని సూర్య అడుగుతాడు. దాంతో విజయాంబిక జీవన్, పింకీల ఫస్ట్‌నైట్ గురించి మాట్లాడాలి అని వచ్చానని పంతులు ఈ రోజు ముహూర్తం పెట్టాడు కదా అని అంటుంది.
సూర్యప్రతాప్: అక్క ఫస్ట్ నీ ఆరోగ్యం బాగుపడని ఇంట్లో ఒకరు బాధ పడితే మిగతా వాళ్లు సంతోషంగా ఎలా ఉంటారు.
విజయాంబిక: నాకు ఏం కాలేదు కదా తమ్ముడు కాస్త కాలు బెనికింది అంతే కదా. ఇంత చిన్న విషయానికి వాళ్లని దూరం చేయడం ఎందుకు.
సుమ: మనసులో విజయాంబిక వదిన ఎందుకు ఎప్పుడూ పింకీ మీద పడి కొట్టుకుంటుంది అయినా పెళ్లి అయిన వాళ్లకి లేని తొందర ఈవిడకు ఎందుకు.
చంద్ర: అన్నయ్య నిర్ణయం తీసుకుంటే పింకీని కాపాడుకోవడం కష్టం.
సూర్యప్రతాప్: రాజు, రూపల ముహూర్తం కూడా చెడిపోయింది కదా నీ ఆరోగ్యం బాగు పడితే ఇద్దరికీ ఒకే సారి చేయిద్దాం. పింకీ, రూపలకు ఉన్న ఒక్క మేనత్త తను కోలుకున్న తర్వాత తన చేతుల మీద జరుగుతుందిలే.
విజయాంబిక: మనసులో సెంటిమెంటూ..
రూప: రాజు అత్తయ్యకు నడుం విరిగినా బుద్ది రాలేదు ఇంకా ఏదో చేయాలి.
రాజు: ఈరోజు రాత్రి ప్లాన్ చేద్దాం అమ్మాయిగారు.
దీపక్ విజయాంబికకి మందులు ఇస్తాడు. తనకు భయంగా ఉందని ఇక్కడే పడుకోమని విజయాంబిక కొడుకుతో చెప్తుంది. దీపక్ సరే అంటాడు. తల్లి దగ్గరే పడుకుంటారు. ఇద్దరూ పడుకున్న తర్వాత రూప, రాజులు గదిలోకి వచ్చి విజయాంబిక దగ్గర మళ్లీ స్ఫ్రే చేస్తారు. దాంతో విజయాంబిక మళ్లీ నవ్వడం ప్రారంభిస్తుంది. దీపక్ భయపడతాడు. విజయాంబిక దీపక్ చేయి పట్టుకొని వదలకపోవడంతో భయంతో మామయ్య అని పిలుస్తాడు. ఇంతలో అందరూ వస్తారు. మమ్మీకి దెయ్యం పట్టిందని అంటాడు. విజయాంబిక నవ్వుతూ పిచ్చా దీపక్ నాకు దెయ్యం పట్టడం ఏంటి అని నవ్వుతుంది. మాటకు ముందు వెనుక పెద్దగా నవ్వుతుంది. దాంతో అందరూ షాక్ అయిపోతారు.
రాజు: పెద్దయ్య మేం చెప్తే మీకు నచ్చదు కానీ ఓ భూత వైద్యుడికి చూపించి మంత్రించి చూద్దాం.
సూర్య: నాన్ సెన్స్ ఈ కాలంలోనూ ఇలాంటివేంటి రాజు.
దీపక్: ఒకసారి ట్రై చేద్దాం మామయ్య.
సూర్య: సరే మీ ఇష్టం.
అందరితో పాటు దీపక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఉదయం భూత వైద్యుడు ఇంటికి వస్తాడు. రూప, రాజులు భూత వైద్యుడిని విజయాంబిక దగ్గరకు తీసుకెళ్తాడు. విజయాంబిక అతని మీద ఫైర్ అవుతుంది. ఇక రూప కావాలనే మళ్లీ స్ప్రే కొడుతుంది. విజయాంబిక మళ్లీ నవ్వుతుంది. దాంతో భూత వైద్యుడు వేపాకులు నిమ్మకాయలు తెచ్చి విజయాంబికని కొడతాడు. అయినా విజయాంబిక నవ్వుతుంది. దాంతో భూత వైద్యుడు చెప్పులు తీస్తాడు. చెప్పులతో విజయాంబికని చితక్కొడతాడు. విజయాంబిక నవ్వుతూ వాళ్లని వదలమని అంటుంది. నవ్వుతూ ఉంటే అతను వాయించేస్తాడు. విజయాంబికని బాగు చేయడం నా వల్ల కాదని సిటీ చివర ఉన్న రఘునందస్వామిని పంపిస్తానని అంటాడు. దాంతో సూర్య ఏంటి మా బావగారా అని అడుగుతాడు. ఇక దీపక్ నాన్నని నేను తీసుకొస్తా అని వెళ్తాడు. మరోవైపు విరూపాక్షి వాళ్లు స్వామీజీ అయిన విజయాంబిక భర్త దగ్గరకు వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: చక్రవర్తికి సర్‌ఫ్రైజ్ ఇచ్చిన క్రిష్.. మైత్రి ఇంట్లో హర్ష.. నందిని ఫైర్!