అన్వేషించండి

Ammayi garu Serial Today November 19th: అమ్మాయి గారు సీరియల్: విజయాంబిక నడుం విరగ్గొట్టి పిచ్చిదాన్ని చేసిన రూప.. పింకీ కోసం ఇంటికి వచ్చిన లవర్!

Ammayi garu Today Episode రూప విజయాబింక ముఖం మీద స్ప్రే కొట్టి నవ్వించి అందరి ముందు విజయాంబికను పిచ్చిదానిలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప అరటి పండు తిని విజయాంబిక రావడం చూసి మెట్ల మీద విసిరేస్తుంది. దాంతో అరటి తొక్క తొక్కి విజయాంబిక కింద పడిపోతుంది. నడుం విరిగిపోయిందని గోల గోల చేస్తుంది. అందరూ విజయాంబికని చూసి కంగారు పడతారు. అరటి పండు తిని పడిపోయిందని దీపక్ అంటే శ్వేత అరటి పండు తిని తొక్క పడేసిందని అందుకే విజయాంబిక పడిపోయిందని రాజు అంటాడు.

విజయాంబిక నడుం నొప్పి అని పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తుంది. రూప కావాలనే మరింత నొక్కి నొప్పి ఎక్కువయ్యేలా చేస్తుంది. చంద్ర డాక్టర్‌కి కాల్ చేస్తాడు. అందరూ కష్టపడి విజయాంబికని బెడ్ రూంకి తీసుకెళ్తారు. డాక్టర్ వచ్చి చూస్తారు. మరోవైపు రాజు సీక్రెట్‌గా రూప చేతిలో ఓ స్ఫ్రే పెడతాడు. దాంతో రూప మెల్లగా దాన్ని విజయాంబిక ముఖం దగ్గర కొడుతుంది. దాంతో విజయాంబిక నవ్వుతుంది. విజయాంబిక ప్రవర్తన చూసి అందరూ ముఖాలు చూసుకుంటారు. రూప, రాజులు నవ్వుకుంటారు. డాక్టర్ కాలు నొప్పి అని నొక్కినా విజయాంబిక నవ్వుతుంది.

రూప మళ్లీ స్ఫ్రే కొడుతుంది. దాంతో విజయాంబిక ఇంకా నవ్వుతుంది. విజయాంబిక ప్రవర్తనకు డాక్టర్ కూడా బిత్తరపోతాడు. విజయాంబికకి ఏమైనా మానసికరోగం ఉందా అని డాక్టర్ అడుగుతాడు. దాంతో సూర్యప్రతాప్ అలా ఏం లేదని చెప్తాడు. రూప ఏదో ప్లాన్ చేసుంటుందని శ్వేత జీవన్తో చెప్తుంది. దాంతో జీవన్ కూడా తనకు అలాగే అనిపిస్తుందని అంటాడు. ఇక డాక్టర్ పడిపోయినప్పుడు ఏమైనా మెంటల్ కండీషన్ ప్రాబ్లమ్ అయినట్లుందని అంటాడు. ఇక రెండు రోజులు ట్రీట్మెంట్ ఇద్దామని తగ్గకపోతే మెంటల్ హాస్పిటల్‌కి తీసుకెళ్లి వైద్యం చేద్దామని అంటారు. డాక్టర్ ఇంజక్షన్ చేస్తారు.

అందరూ విజయాంబిక ప్రవర్తనకు తలపట్టుకుంటారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత దీపక్ తల్లితో ఎందుకు అలా నవ్వుతున్నావ్ అమ్మా అందరూ నిన్ను పిచ్చిపట్టిందని అంటున్నారు అని అంటాడు. రూప, రాజులు చేసిన పాపాలు ఊరికే పోవని రెండు రోజులు చూపి ఎర్రగడ్డలో బెడ్ బుక్ చేయాలని అంటాడు. దీపక్ రాజు మీద అరుస్తాడు. మా అమ్మని పిచ్చిది అనొద్దని అంటాడు. రూప రాజులు తమ గదికి వెళ్లి జరిగింది తలచుకొని నవ్వుకుంటారు. ఇంతలో శ్వేత, జీవన్ వస్తే రూప శ్వేతని చూసి మీ చెల్లి వచ్చిందని అంటుంది. నేను చెల్లిని కాదు అని శ్వేత అంటుంది. 

జీవన్: ఇందాక జరిగిందంతా మీ ప్లానే అని మాకు తెలుసు.
శ్వేత: ఎలా తెలిసింది అని అనుకుంటున్నారా అరటి తొక్క గురించి అబద్ధం చెప్పినప్పుడే మాకు అర్థమైంది.
జీవన్: అయినా మేం మీకు చెప్పింది ఏంటి మీరు చేస్తుంది ఏంటి. మీరు కలవకుండా ఉండాలి అని మేం చెప్తే మీరు ఏం చేస్తున్నారు.
రూప: ఏంటి మీరు ఇలా కూడా మేం కలిసి ఉండకూడదా. అలా కుదరదు.
జీవన్: పింకీ వీళ్లు చాలా ఓవర్ చేస్తున్నారు మా చెల్లిని ఇబ్బంది పెడుతున్నారు ఇలా అయితే మనం మన ఇంటికి వెళ్లిపోదాం.
పింకీ: అక్క మా ఆయన చెల్లిని అంటే నన్ను అన్నట్లే నేను బాధ పడకూడదు అంటే మా ఆయన చెప్పినట్లు వినండి.
జీవన్: శ్వేత నిన్ను అవమానించారు అన్నావు కదా వీళ్లతో నీకు క్షమాపణ చెప్పిస్తా.
శ్వేత: వద్దు అన్నయ్య నాకు అవసరం అయినప్పుడు అందరి ముందు చెప్పించుకుంటా రూప చెప్పను అంటే మా వదిన ఒప్పుకోదు కదా
రాజు: అమ్మాయి గారు పింకీని అడ్డుపెట్టుకొని వీళ్లు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ముందు అది సాల్వ్ చేయాలి.

మందారం విరూపాక్షికి కాల్ చేసి విజయాంబిక పడిపోయిన విషయం చెప్తుంది. విరూపాక్షి ముత్యాలు వాళ్లకి విషయం చెప్తే అందరూ నవ్వుకుంటారు. దేవుడు వదిలి పెట్టడని వాళ్ల పాపాన వాళ్లే పోతారని అనుకుంటారు. మరోవైపు పింకీ ఎంత కాలం ఇలా నరకం అనుభవించాలని ఏడుస్తుంది. ఇక పింకీ లవర్ పింకీ ఇంటికి వస్తాడు. చాటుగా పింకీని కలిసి చనిపోవాలని అనుకుంటాడు. పింకీకి కాల్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: పాపని తాకగానే నయనిలా మారిపోయిన త్రినేత్రి.. విక్రాంత్‌లో కొత్త అనుమానాలు.. చనిపోయిన డాక్టర్!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget