Ammayi garu Serial Today November 17th: అమ్మాయిగారు సీరియల్: ప్రెగ్నెంట్ డ్రామా ఏమో కానీ పులుపు తిని చచ్చేలా ఉన్న కోమలి!
Ammayi garu Serial Today Episode November 17th కోమలి ప్రెగ్నెంట్ నాటకం బయట పెట్టించడానికి రాజు విపరీతంగా పులుపు తినిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి సూర్యప్రతాప్‌తో నిజం చెప్పేస్తా అని అంటుంది. దానికి విజయాంబిక నిజం చెప్తే నీ భర్త బతుకుతాడా.. ఈ కోమలినే రూప అని పూర్తిగా నమ్మేశాడు.. ఇప్పుడు చెప్తే నా తమ్ముడి గుండె ఆగిపోతుంది.. నిజం తెలిసి కూడా చెప్పలేదు అని రాజు, రూపల్ని.. ఉన్న రూపని చంపేసి.. లేని రుక్మిణిని సృష్టించిన నిన్ను మీ ముగ్గురిని ఏం చేస్తాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అని అంటుంది.
విరూపాక్షి విజయాంబికతో మేం నిజం చెప్పలేం కానీ వందల తప్పులు చేసిన మిమల్ని ఒకే ఒక్క ఆధారం తొక్కేస్తుంది అని అంటుంది. డూప్లికేట్‌ని తీసుకొచ్చి ఒరిజినల్ అని నమ్మించాలి అనుకుంటున్నావ్ డూప్లికేట్ ఎప్పటికీ ఒరిజినల్ కాలేదు అని రాజు అంటాడు. ఏయ్ డూప్లికేట్.. డూప్లికేట్‌ని ఒరిజినల్ కొడితే ఎలా ఉంటుందో చూపిస్తా.. నువ్వు ప్రెగ్నెంట్ అని నాటకం ఆడావు కదా.. అదే ప్రెగ్నెన్సీని నువ్వే అబద్ధం అని నీ నోటితో చెప్పిస్తా.. నీకు సరిగ్గా 48 గంటలు టైం ఇస్తున్నా.. ఈ 48 గంటల్లో ప్రాణం భయంతో ఎవరికీ కనిపించకుండా పరుగులు పెట్టేలా చేస్తా అని రూప వార్నింగ్ ఇస్తుంది.
రూప ( కోమలి) ప్రెగ్నెంట్ అని సూర్యప్రతాప్, చంద్రప్రతాప్ చాలా సందడి చేస్తారు. రూప ఏం కావాలి అనుకున్నా అందుబాటులో ఉండాలి అని సూర్యప్రతాప్ చాలా వెరైటీలు తెప్పిస్తారు. ఇన్ని వెరైటీలు ఎందుకు అని సుమ అంటే మొదటి సారి తను ప్రెగ్నెంట్ అయినప్పుడు మనం తినమని చెప్పే పరిస్థితిలో లేం.. తను తినే పరిస్థితిలో లేదు అందుకే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నా అంటారు. కోమలి మెట్ల మీద నుంచి వస్తుంటే సూర్యప్రతాప్ పరుగున వెళ్లి నువ్వు ఎందుకు మెట్లు దిగి వస్తున్నావ్ ఏం కావాలి అన్నా సుమ, మందారం చూసుకుంటారు కదా అని అంటాడు.
కోమలిని సూర్యప్రతాప్ తీసుకొచ్చి కూర్చొపెట్టి స్వీట్ తినమని చెప్తాడు. కోమలి స్వీట్ తినే టైంకి రాజు బుట్టలతో మామిడికాయలు, చింత పండు పలుకులు తీసుకొని వస్తాడు. కోమలి చూసి షాక్ అయిపోతుంది. పులుపు తినాలి అని నాకు అస్సలు అనిపించడం లేదు.. పైగా నాకు పులుపు అంటే నాకు అస్సలు పడదు అని కోమలి అనుకుంటుంది. రాజు సూర్యప్రతాప్‌తో ఈ టైంలో పులుపు తినాలి అనిపిస్తుంది కదా అందుకే నేనే స్వయంగా తీసుకొచ్చా అని చెప్తాడు. రాజు నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం అమ్మా అని సూర్యప్రతాప్ అంటాడు.
విరూపాక్షి రాజుతో రాజు అలా చూస్తావేంటి తన కోసం తెచ్చావ్ కదా తినిపించు అని అంటుంది. విజయాంబిక కొడుకుతో ప్రెగ్నెంట్ అయితే ఇవి తినాలి అంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కాదు కాబట్టి తింటే పులుపుతో చస్తుందని అంటుంది. రాజు కోమలికి పులుపు తినిపించాలని వెళ్తే దానికి విజయాంబిక తనకు తినాలి అనిపిస్తుందో లేదో అంటుంది. ప్రెగ్నెంట్ అయిన వాళ్లకి కచ్చితంగా పులుపు తినాలి అనిపిస్తుంది కదా అని విరూపాక్షి అంటుంది. దాంతో దొరికిపోతా అని కోమలి తనకు పులుపు ఇష్టం అని అంటుంది.
రాజు కోమలికి పులుపు తినిపిస్తాడు. పులుపుగా ఉందా అని మందారం అడిగితే అవును అని కోమలి అంటే ఏంటి అలా అడిగావ్ మందారం ప్రెగ్నెంట్ లేని వాళ్లకే పులుపు ఉండదు దాంతో నువ్వు అక్క ప్రెగ్నెంట్ కాదు అంటున్నావా అని అంటుంది. ప్రెగ్నెంట్ అయితే ఎవరికీ పులుపు తెలీదు కదా మరి అక్కకి ఎందుకు పులుపు అనిపిస్తుంది అని అంటుంది. అలా ఏం లేదు అని కోమలి చింతకాయలు, మామిడికాయలు బలవంతంగా తినేస్తుంది. రూప, రాజు, విరూపాక్షి, మందారం నువ్వుకుంటారు. రాజు తినిపించిన తర్వాత ఇప్పుడు నేను తినిపిస్తా అని విరూపాక్షి వెళ్లి బలవంతంగా తినిపిస్తుంది. మింగలేక కక్కలేక కోమలి ఇరుక్కుంటుంది.
విరూపాక్షి కోమలి దగ్గరకు వెళ్లి పులుపే కదా భరించేద్దాం అనుకుంటున్నావేమో.. అవసరం మించి తింటే రక్తహీనత అవుతుంది. చర్మవ్యాధులు వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయ్.. చూసుకో నిజం చెప్పేయడం బెటరో అవన్నీ తినడం బెటరో ఆలోచించుకో అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















