అమ్మాయి గారు: ఆనంద్ రహస్యం, జీవన్ ప్లాన్, రుక్మిణి పెళ్లి.. నేటి ఎపిసోడ్ హైలైట్స్!
Ammayi garu Today Episode ఆనంద్ తండ్రి రాఘవ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి విజయాంబిక, దీపక్‌లు జైలులో జీవన్‌ని కలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాఘవ కొడుకు ఆనంద్ అని తెలిస్తే మనం అంతా నాటకం ఆడుతున్నాం అని సూర్యకి తెలిస్తే ఆ బాధ తట్టుకోలేడు అని విరూపాక్షి అంటుంది. ఇప్పుడే నిజం చెప్పేద్దాం అని విరూపాక్షి అంటే దానికి ఆనంద్ అలాంటి పరిస్థితి వస్తే తాను పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి ఆపేస్తానని అవసరం అయితే కొట్టించుకొని తిట్టించుకొని తన తండ్రిలాగే అజ్ఞాతంలోకి వెళ్లడానికి రెడీ అని అంటాడు.
రూప ఆనంద్‌ని థ్యాంక్స్ చెప్తుంది. అంతా మనం అనుకున్నట్లే జరుగుతుందని అంటుంది. ఇక రాజు ఆనంద్‌తో విజయాంబిక, దీపక్‌లు మానాన్ని తీసుకొస్తారు. నువ్వు నిశ్చింతగా ఉండు అని రాజు చెప్తాడు. జైలులో ఉన్న జీవన్ దగ్గరకు విజయాంబిక, దీపక్‌లు వెళ్తారు. జీవన్ వాళ్లు తనకు చేసిన ద్రోహం గుర్తు చేసుకొని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు.. మీరు నాకు చేసిన ద్రోహానికి మిమల్ని చంపినా చంపేస్తా అంటాడు. విజయాంబిక ఆ హక్కు నీకు ఉంది కానీ మేం ఆ రోజు అలా ఎందుకు చేశామో నీకు తెలుసు కదా అంటారు. జీవన్‌ని నమ్మించి తమ వైపునకు తిప్పుకునేలా మాట్లాడుతారు. వీలైతే నన్ను బయటకు తీసుకు రండి రాజు రూపల్ని ఏసేస్తా అని జీవన్ అంటే దీపక్ రూపని చంపేశాడు అని విజయాంబిక చెప్తుంది. రూప శ్రద్ధాంజలి ఫొటోని దీపక్ చూపిస్తాడు. జీవన్ చాలా హ్యాపీగా ఫీలవుతాడు.
విజయాంబిక, దీపక్‌లు రుక్మిణి గురించి ఆనంద్‌తో పెళ్లి చేస్తే వాడు మనకు ఆస్తి ఇస్తాడంట.. రాఘవని వాడికి ఇస్తే మనకు ఆస్తి ఇస్తాడు అని దీపక్ అనగానే మీరు నా కోసం రాలేదా రాఘవ కోసం వచ్చారా వెంటనే వెళ్లిపోండి లేదంటే చంపేస్తా అంటాడు. తల్లీకొడుకులు ఎంత బతిమాలినా జీవన్ అరిచి గెంటేస్తాడు. ఇంట్లో అందరూ రాఘవని తీసుకొస్తారా లేదా అని టెన్షన్ పడతారు. వాళ్లు రాఘవని తీసుకొచ్చిన వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆనంద్ అని విరూపాక్షి చెప్తుంది. విజయాంబిక వాళ్లని చూసిన ఆనంద్ మా నాన్న ఆచూకీ తెలిసినట్లు లేదు అని అంటాడు. వాళ్లని తొందర పెట్టు లేదంటే వెళ్లిపోతా అని చెప్పు ఆనంద్ అని రూప అంటుంది.
సూర్యప్రతాప్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. రూపలా ఉన్న రుక్మిణిని రాజుకి ఇచ్చి పెళ్లి చేసి శాశ్వతంగా నా వారసురాలిగా ఉంచాలి అనుకున్నా కానీ రుక్మిణి ఆనంద్‌ని ప్రేమించింది అనుకుంటాడు. మరోవైపు ఆనంద్ తన తండ్రి ఆచూకీ తెలుసుకోమని తల్లీకొడుకులల్ని కంగారు పెడతాడు. సూర్యప్రతాప్ రాజుని పిలిచి పంతుల్ని పిలిపించమని అంటాడు. రుక్మిణి సూర్యప్రతాప్‌తో నాయనా ఇప్పుడే మీ దగ్గరకు వచ్చాకదా అప్పుడే నన్ను పంపేయాలి అని తొందరపడుతున్నారు అని అడుగుతుంది. దానికి సూర్యప్రతాప్ నువ్వు ప్రేమించి వాడితోనే నీ పెళ్లి జరిపిస్తున్నా కదమ్మా నువ్వు ఎక్కడున్నా మేం అంతా నీకు తోడుగా ఉంటా ఏం భయపడకు అని చెప్తాడు.
విజయాంబిక ఆనంద్‌తో పంతులు ముహూర్తం పెట్టడానికి గంట ముందు అయినా మీనాన్నని తీసుకొస్తా అని చెప్తారు. ఆనంద్ ఆ విషయం రాజు వాళ్లతో చెప్తాడు. పంతులు పెట్టబోయే ముహూర్తం విజయాంబిక పతనానికి అని రాజు అంటాడు. ఉదయం పంతులు ఇంటికి వస్తాడు. పంతులుతో సూర్యప్రతాప్ రుక్మిణి గురించి చెప్పి ముహూర్తాలు పెట్టమని అంటారు. బంటీ తనకు రుక్మిణి తల్లిగా కావాలి అంటాడు. అలా అనకూడదు అని సూర్యప్రతాప్ అంటాడు. ఇద్దరి జాతకాలు చూసిన పంతులు 21వ తేదీన పెళ్లికి ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తం ఖాయం సూర్యప్రతాప్ చెప్తారు. తర్వాత సూర్యప్రతాప్ పంతులుతో బంటీని చూసుకోవడానికి ఓ అమ్మ కావాలి రాజుకి పెళ్లి చేయాలి అనుకుంటున్నా ఓ మంచి అమ్మాయిని చూడమని సూర్యప్రతాప్ చెప్తారు. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాఘవ కొడుకే ఆనంద్.. రుక్మిణి, ఆనంద్‌ల ప్రేమ కథ వెనక పెద్ద కథే ఉందిగా!





















