Ammayi garu Serial Today july 25th: అమ్మాయి గారు సీరియల్: చిక్కినట్లే చిక్కి మాయమైన రాఘవ.. సూర్యకేమైంది? ఆ దుస్థితికి కారణమేంటి?
Ammayi Garu Serial Today Episode july 25th దీపక్ రాఘవని దాచేసి ఆనంద్‌ని చంపేస్తానని బెదిరించడం, రూపకి పెను ప్రమాదం ఉందని స్వామీజీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi Garu Serial Today Episode ఆనంద్ రాఘవని తీసుకొని వస్తాడు. రూప, రాజులు మాట్లాడుతుంటే దీపక్ వాళ్లు చూసి పొగ పెట్టి రాఘవని తీసుకెళ్లిపోతారు. రాజు వాళ్లు విరూపాక్షి దగ్గరకు వస్తారు. ఆనంద్ విజయాంబిక వాళ్లు చేసుంటారా అంటే రాజు వాళ్లు ఇంత వరకు ఇక్కడే ఉన్నాడు వాళ్లు కాదు అనేస్తారు. ఇక సూర్యప్రతాప్ రావడం చూసి ఆనంద్‌ని పంపేస్తారు.
రుక్మిణి వాళ్లు వెళ్తుంటే ఓ స్వామి ఆగి రుక్మిణిని చూసి ఈమెకు అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నాయి అని అంటారు. ఏంటి స్వామి అలా అంటున్నారు అని సూర్యప్రతాప్ అడుగుతాడు. దానికి స్వామీజీ అవును అని ఇంతకు ముందే ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది ఆ అమ్మవారే కాపాడింది ముందు ముందు ఇంకా ప్రమాదాలు వస్తాయి.. ఓ పెద్ద ప్రళయం నీ జీవితంలో రాబోతుంది.. దాని వల్ల నీ జీవితం తారు మారు అయిపోతుంది. జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్తారు. అందరూ షాక్ అయిపోతారు. అతను ఎవరో పిచ్చోడు ఏం కాదు అని విజయాంబిక సూర్యప్రతాప్ వాళ్లని తీసుకెళ్లిపోతుంది.
దీపక్ రాఘవని తీసుకొని వెళ్లి మళ్లీ కట్టేస్తారు. విజయాంబిక అక్కడికి వెళ్లి రౌడీలను కొడుతుంది. చేతకాని వాళ్లని తిడుతుంది. ఇక దీపక్‌తో వీడి కొడుకు ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయమని అంటుంది. దాంతో రాఘవ మీరు ఏం చెప్తే అది చేస్తా నా కొడుకుని ఏం చేయొద్దని చెప్తాడు. దీపక్ రాఘవతో ఇంకోసారి మా మామయ్యని రాజు, రూపల్ని కలవాలని చూస్తే నీ కొడుకు ప్రాణాలు పోతాయని అంటుంది. ఇక ఆనంద్ తన ఫోన్ కోసం అలాగే రాఘవని అక్కడే ఉంచుంటారేమో అని ఆ ప్లేస్‌కి బయల్దేరుతాడు. ఇక విజయాంబిక రాఘవని ఆ ప్లేస్ నుంచి తీసుకెళ్లి మరో చోట పెట్టాలని చెప్పి తీసుకెళ్తుంది.
ఆనంద్ ఆ ప్లేస్‌కి వచ్చి ఫోన్ కోసం వెతుకుతాడు. ఓ చోట ఫోన్ దొరుకుతుంది. రాఘవ మిస్ అయ్యాడని రాజు చాలా ఫీలవుతాడు. అన్ని ప్రాబ్లమ్స్ పరిష్కారం అయ్యేవి కళ్ల ముందుకు వచ్చిన రాఘవని కాపాడుకోలేకపోయానని తనని తాను తిట్టుకుంటాడు. రూప వచ్చి రాఘవ గురించి మాట్లాడుతుంది. బాధ పడొద్దని అంటుంది. రాఘవ కనిపించకపోయిన ముందు వరకు తల్లీకొడుకులు మనతోనే ఉన్నారు కానీ రాఘవ మిస్ అయినప్పటి నుంచి దీపక్ కనిపించలేదని తన తల్లిని ఇబ్బంది పెట్టాలని దీపక్, విజయాంబికలు చాలా ప్రయత్నిస్తున్నారని దీపక్‌ని నిలదీయడానికి ఇద్దరూ వెళ్తారు.
ఇంతలో విరూపాక్షి రూప గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంటుంది. రూప, రాజులు చూసి విరూపాక్షి దగ్గరకు వెళ్తారు. ఆ స్వామీజీ మాటలు నా గుండెల్లో పిడుగు పడేలా చేస్తున్నాయని విరూపాక్షి ఏడుస్తుంది. నీకు నా జీవితం ముఖ్యమైతే నాకు నీ జీవితం ముఖ్యం ఏ తల్లీ తన బిడ్డ జీవితం నాశనం అయితే చూస్తూ ఊరుకోదు.. ఇప్పటి వరకు మీరు నా కోసం పడిన కష్టం చాలు ఇక వదిలేయండి ఈ క్షణం నుంచి మీరు మీ గురించి మాత్రమే ఆలోచించండి.. నీ చుట్టూ ఏ ప్రమాదం దాగుందో ఎవరికీ తెలీదు అని విరూపాక్షి చెప్తుంది. రూప తల్లితో దీపక్ మీద అనుమానం ఉంది వాడిని నాలుగు తగిలిస్తే వాడే నిజం చెప్తాడని రాజు, రూపలు అంటారు. నా గురించి వదిలేయండి నువ్వు నీళ్లలో మునిగినప్పుడు మేం పడిన బాధ చాలు అలాంటిది ఇంకొకటి మేం తట్టుకోలేం అన్నీవదిలేయ్ అని విరూపాక్షి అంటే తల రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నా ఆశయం గొప్పది నాకు ఏం కాదు అంటుంది. రాజు కూడా రూపకే సపోర్ట్ చేస్తాడు.
ఉదయం అందరూ కిందకి వస్తారు. సుమ బావ గారు ఇంకా రాలేదని సూర్యప్రతాప్ గురించి చెప్తుంది. సుమ చేతిలో కాఫీ తీసుకొని రూప తండ్రి గదిలోకి వెళ్తుంది. అక్కడ సూర్యప్రతాప్ కూర్చొని నిద్ర పోతూ కనిపిస్తాడు. రుక్మిణి నాయనా అనగానే సూర్యప్రతాప్ లేస్తాడు. బెడ్ మీద రుక్మిణి చూస్తుంది. రాత్రి డ్రస్ కూడా మార్చుకోకుండా రాత్రంతా నిద్ర పోకుండా సూర్యప్రతాప్ స్వామీజీ చెప్పిన మాటలు తలచుకొని భయంతో ఉంటాడు. సూర్యప్రతాప్ కళ్లు ఎర్రగా మారిపోయి.. నిద్ర లేక తూగుతూ ఉంటాడు. ఏమైంది నాన్న అని రుక్మిణి కంగారు పడితే నాకు నిద్ర పట్టడం లేదమ్మా నాకు తెలీయని భయం పట్టుకుంది.. ఒక తండ్రిగా కూతురి కోసం భయపడున్నా అని అంటాడు. రుక్మిణి చాలా ఎమోషనల్ అయిపోతుంది. తండ్రి పక్కనే కూర్చొని ఎందుకు భయం నాన్న అంటే నీకు మీ అక్క రూప గురించి ఎంత తెలుసో నీకు తెలీదు కానీ నేను రూప విషయంలో ఎప్పుడూ ప్రేమగా ఉండలేదు కానీ రూప మాత్రం నన్ను ఎప్పుడూ ప్రేమించే కూతురిగా మిగిలిపోయింది. తన తల్లి బతికే ఉందని తెలిసినా నాతోనే ఉండిపోయింది తన తల్లిని దూరం పెట్టింది అని చెప్తాడు. నాకు ఇష్టం లేదు అంటే ఆ ప్రస్తావన నా దగ్గర తీసుకురాదు.. రాజుతో పెళ్లి అయినా సరే రాజు కావాలా నేను కావాలా అంటే నాతో ఉండిపోయింది అని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆదిత్య-దేవాల పోరాటం.. మిథునని తండ్రి తీసుకెళ్లిపోతాడా? సత్యమూర్తి దేవాకి ఏం చెప్పాడు?





















